Homeఅంతర్జాతీయంIndia Vs Bangladesh: వాపు చూసి బలుపు అనుకుంటున్న బంగ్లాదేశ్‌.. భారత్‌ విషయంలో మరో కీలక...

India Vs Bangladesh: వాపు చూసి బలుపు అనుకుంటున్న బంగ్లాదేశ్‌.. భారత్‌ విషయంలో మరో కీలక నిర్ణయం!

India Vs Bangladesh: బంగ్లాదేశ్‌ స్వతంత్ర దేశంగా అవతరించడానికి ప్రత్యక్షంగా, పరోక్షంగా సాయం చేసిన దేశం భారత్‌. అన్నం పెట్టిన చేతికి సున్నం పెట్టాలని చూస్తోంది బంగ్లాదేశ్‌. ఈ ఏడాది జూలైలో ఉద్యోగ రిజర్వేషన్ల విషయమై మొదలైన అల్లర్లు… క్రమంగా తీవ్రమయ్యాయి. చివరకు ప్రధాని షేక్‌ హసీనా రాజీనామా చేసి దేశం విడిచి పారిపోయేలా చేశాయి. విద్యార్థుల అల్లర్లను అదునుగా తీసుకున్న కొన్ని అరాచక శక్తులు బంగ్లాదేశ్‌లోని భారతీయులు, హిందువులపై దాడులకు తెగబడ్డారు. చాలా మందిని చంపేశారు. హిందువుల ఇళ్లను లూటీ చేశారు. ప్రధాని షేక్‌ హసీనా రాజీనామా తర్వాత తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది. అయినా అల్లర్లు, హిందువులపై దాడులు ఆగడం లేదు. ప్రశాంత దేశంగా గుర్తింపు ఉన్న బంగ్లాదేశ్‌ అక్కడి మధ్యంతర ప్రభుత్వం తీరుతో అల్లర్లు, అశాంతి దేశంగా ముద్ర పడుతోంది. ఇప్పటికే ఇంగ్లండ్‌ ఆ దేశ పౌరులకు కీలక సూచన చేసింది. ఎవరూ బంగ్లాదేశ్‌కు వెళ్లొదని సూచించింది. ఇక షేక్‌ హసీనా భారత్‌లో తలదాచుకుంటన్న నేపథ్యంలో భారత్‌తో బంగ్లాదేశ్‌ కయ్యానికి కాలుదువ్వుతోంది. అక్కడి అరాచక శక్తులను రెచ్చగొట్టి హిందువులపై దాడులు చేయిస్తోంది.

ఇరు దేశాల మధ్య ఉద్రిక్తత..
హిందువులపై దాడుల నేపథ్యంలో బంగ్లాదేశ్‌– భారత్‌ మధ్య సత్సంబంధాలు దెబ్బతింటున్నాయి. షేక్‌ హసీనా ప్రభుత్వం ఉన్నంతకాలం ఇరు దేశాల మధ్య మంచి సంబంధాలు కొనసాగాయి. వ్యాపార, వాణిజ్య పరంగా పరస్పరం సహకరించుకున్నాయి. కానీ మధ్యంతర ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇరు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతింటున్నాయి. తాజాగా ఉద్రిక్తతలు నెలకొన్నాయి. దౌత్య సంబంధాలు కూడా దెబ్బతింటున్నాయి. బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులను నిరసిస్తూ.. అగర్తలాలో బంగ్లాదేశ్‌ కార్యాలయంపై హిందువులు దాడిచేశారు. దీంతో బంగ్లాదేశ్‌.. కోల్‌కతాలోని డిప్యూటీ హౌకమిషనర్‌ షికార్ట్‌ మహ్మద్‌ అష్రఫుల్‌ రహ్మాన్, అగర్తలా అసిస్టెంట్‌ కమిషనర్‌ ఆరిఫ్‌ మహ్మద్‌ను రీకాల్‌ చేసింది.

కృష్ణదాస్‌ అరెస్టుపై నరిసన..
ఇస్కాన్‌కు చెందిన చిన్మక్‌ కృష్ణదాస్‌ అరెస్టుకు నిరసనగా పశ్చిమ బెంగాల్, త్రిపుర రాస్ట్రాల్లోని బంగ్లాదేశ్‌ దౌత్య కార్యాలయాల వద్ద ఆందోళనలు జరిగాయి. ఈ నేపథ్యంలో ఇక్కడి దౌత్యవేత్తలను వెనక్కు పిలిపించాలని బంగ్లాదేశ్‌ నిర్ణయించింది. ఈమేరకు ఇద్దరు కమిషనర్లకు సమాచారం అందించింది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఇద్దరూ ఢాకా నుంచి పని చేయాలని సూచించింది. అష్రఫుల రహ్మాన్‌ ఇప్పటికే బంగ్లాదేశ్‌ వెళ్లిపోయారు. ఆరిఫ్‌ కూడా ఒకటి రెండు రోజుల్లో తిరిగి వెళ్లే అవకాశం ఉంది.

కార్యాలయం మూసివేయాలని…
అగర్తలలోని బంగ్లాదేశ్‌ అసిస్టెంట్‌ హైకమిషనర్‌ కార్యాలయం మూసివేయాలని హిందువులు ఇటీవల కార్యాలయం ఎదుట ఆందోళన చేశారు. కొందరు కార్యాలయంలోకి దూసుకెళ్లే ప్రయత్నం చేశారు. దీనిపై బంగ్లాదేశ్‌ విదేశాంగ శాఖ స్పందిస్తూ.. ఉద్దేశపూర్వకంగానే ఆందోళనకారులు కార్యాలయంలోకి వచ్చారని ఆరోపించింది. చిన్మయ్‌ కృష్ణదాస్‌ తరఫున న్యాయవాదులెవరూ వాదించకపోవడాన్ని తప్పు పడుతూ ఇలా నిరసన తెలిపారు. దీంతో బంగ్లాదేశ్‌ కమిషనర్లను వెనక్కు పిలిపించింది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
RELATED ARTICLES

Most Popular