Bandla Ganesh: బండ్ల గణేష్ నిర్మాత కంటే.. పవన్ వీరాభిమాని, వీరభక్తుడు అని పిలిపించుకునేందుకు ఇష్టపడతారు. పవన్ ను దేవుడితో పోల్చుతారు. ఆయన్ను ఎవరైనా విమర్శిస్తే తట్టుకోలేరు. అంతకుమించిన స్థాయిలో రిప్లై ఇస్తారు. కానీ గత కొంతకాలంగా ఏపీలో వైసీపీ నేతలు పవన్ ను టార్గెట్ చేసుకుంటూ వస్తున్నారు. అయినా సరే బండ్ల గణేష్ సహనంతో వ్యవహరిస్తూ వచ్చారు. కానీ ఇటీవల సీఎం జగన్ పదేపదే పవన్ వైవాహిక జీవితం పై మాట్లాడుతుండడంతో స్పందించారు. పదేపదే పవన్ కళ్యాణ్ పెళ్లిళ్లు గురించి మాట్లాడడం ఎందుకు? మరి ఇతర అంశాల్లో ఆయనపై విమర్శలు చేయలేకనే ఇలా చేస్తున్నారా? అంటూ ఏపీ సీఎం జగన్కు వినమ్ర పూర్వకంగా విన్నపం చేశారు. ఓ వీడియోను సోషల్ మీడియాలో విడుదల చేశారు. ప్రస్తుతం అది వైరల్ అవుతోంది.
” నిన్నటి నుంచి మనసులో ఒకటే వేదన.. ఒకటే బాధ.. ఇప్పుడు కూడా మాట్లాడకపోతే.. నా బతుకు ఎందుకా? అని నాకే అనిపిస్తుంది.. చిరాకు వేస్తోంది.. నిన్న గౌరవ ముఖ్యమంత్రి వైయస్ జగన్ గారు నాకు ఇష్టుడైన పవన్ కళ్యాణ్ గారి గురించి ఇస్తారు ఇచ్చిన మాట్లాడారు. అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారు. భగవంతుడు మీకు గొప్ప హోదాను ఇచ్చారు. నేను దశాబ్దాలుగా ఆయన వెంట తిరిగాను. ఆయన వ్యక్తిత్వం గురించి నాకు తెలుసు. ఆయన చాలా నిజాయితీపరుడు, నీతిమంతుడు.. ఎవరు కష్టంలో ఉన్నా.. అది నా కష్టమని భావించే భోళామనిషి” అంటూ బండ్ల గణేష్ భావోద్వేగంగా మాట్లాడారు.
జీవితంలో కొందరికి కొన్ని చేదు సంఘటనలు జరుగుతాయి. అవి వారి ప్రమేయం లేకుండా జరిగినవే. పవన్ కళ్యాణ్ విషయంలో అలానే జరిగి ఉంటుందని భావిస్తున్నా. కానీ అదే పనిగా పవన్ పై వ్యక్తిగత విమర్శలు చేయడం దారుణం. సమాజం కోసం ఉపయోగపడే మనిషి… దేశం కోసం బతికే మనిషి… నిస్వార్ధంగా ఉండే మనిషి.. స్వలాభం కోసం ఆశించని మనిషి పవన్ కళ్యాణ్ అన్న విషయాన్ని గుర్తు చేసుకోవాలని బండ్ల గణేష్ హితవు పలికారు. సూపర్ స్టార్ లా బతకాలని నేను సలహా ఇస్తే.. జనాల కోసం ఏదో ఒకటి చేయాలని పరితపించే వ్యక్తి పవన్ అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. రాత్రీ, పగలూ సినిమాలతో కష్టపడి సంపాదించుకున్న సొమ్మును పార్టీకి, ప్రజలకు పెడుతున్న విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించుకోవాలన్నారు.
ఎవరికి ఏ కష్టం వచ్చిందన్నా సరే ముందుకు వచ్చే ఒకే ఒక వ్యక్తి పవన్ కళ్యాణ్.ఆయనకు కులాభిమానం లేదు.దేశ ప్రజలంతా ఒక్కటే అనుభవిస్తారు. కుల పిచ్చి ఉంటే నన్ను ఇలా ఆదరిస్తాడా? నన్ను పైకి రానిస్తాడా? నేను ఈరోజు అనుభవిస్తున్నదంతా కూడా ఆయన పెట్టిన భిక్షే.. ఆయన మంచి వ్యక్తి, అత్యంత నిజాయితీపరుడు.. ఎప్పటికైనా తెలిసి తెలియకుండా అబాండాలు వేయకండి.. నేను జనసేన మనిషిని,కార్యకర్తని కాదు.. కేవలం ఆయన ప్రేమించే వ్యక్తినిఅంటూ బండ్ల గణేష్ షేర్ చేసిన వీడియో నెట్ ఇంట్లో వైరల్ అవుతోంది. అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటుంది. దీనిపై జనసైనికులు విభిన్నంగా రిప్లై ఇస్తున్నారు.