Bandi Sanjay: తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ మాటల్లోనే విద్వేషం తొణికిసలాడుతుంటుంది. పాతబస్తీ ముస్లిం ఏరియాలోని భాగ్యలక్ష్మీ అమ్మవారిని దర్శించుకొని అక్కడే ఎంఐఎం నాయకులతో ఫైటింగ్ కు దిగుతుంటారు. ఫక్తు హిందుత్వవాదిలా రెచ్చిపోతుంటారు. దేశంలో బీజేపీ అధికారంలో ఉండడం.. వారి సిద్ధాంతమే అది కావడంతో ఎవరూ ఏమీ అనలేని పరిస్థితి. ఇటీవల బీజేపీ ఎమ్మెల్యే అయితే ఓ మత ప్రవక్త గురించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హైదరాబాద్ ను అల్లకల్లోలంగా మార్చేశాయి. మత ఘర్షణలకు దారితీశాయి. ఇప్పటికీ హైదరాబాద్ లో కర్ఫ్యూ కొనసాగుతోంది.

ప్రశాంతంగా ఉండే హైదరాబాద్ లో బీజేపీ నేతల మాటలే చిచ్చు పెట్టాయి. పెడుతున్నాయి కూడా. తాజాగా బీజేపీ చీఫ్ బండి సంజయ్ కరీంనగర్ లో నిరసన దీక్షలో కూర్చుంటూ హైదరాబాద్ లో మత ఘర్షణలు జరుగుతున్నాయా? అని ఆరాతీసిన వైనం అందరినీ విస్తుగొలుపుతోంది. ప్రెస్ మీట్ లో ఉండగా.. జర్నలిస్టులు అందరూ వీడియో రికార్డ్ చేస్తుండగా ఏమాత్రం సంకోచం లేకుండా బండి సంజయ్ హైదరాబాద్ మత ఘర్షణలు జరుగుతున్నాయా? అని అడగడం అందరినీ షాక్ కు గురిచేస్తున్నాయి.
Also Read: Prophet Remarks Row: తెలంగాణలో మతం చిచ్చు: మళ్లీ మూడు దశాబ్దాల నాటి పరిస్థితులు
హైదరాబాద్ లో మత ఘర్షణల పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మనసులో మాట కెమెరాకు చిక్కింది. అదిప్పుడు వైరల్ గా మారింది. ఏ కుట్రకు ఈ గుసగుసలు అంటూ వీడియోను షేర్ చేసి పలువురు నిలదీస్తున్నారు. వీళ్లా నాయకులు అంటూ ప్రశ్నిస్తున్నారు.

ఇక ఈ వీడియోను షేర్ చేసిన రేవంత్ రెడ్డి ‘ఇలాంటి క్రూర సిద్ధాంతాలు కలిగిన పార్టీని ఏం చేయాలో తెలంగాణ సమాజమే ఆలోచన చేయాలి.’ అంటూ ట్విట్టర్ లో ఎండగట్టారు. ఇలాంటి మత విద్వేశాలు రెచ్చగొట్టి పచ్చటి తెలంగాణను నిప్పులు కుంపటిలాగా మార్చే నేతలను మనం ఎన్నుకోవాలా? అని ప్రశ్నించారు.
బండి సంజయ్ హైదరాబాద్ లో మత ఘర్షణలపై ఆరాతీసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందరిముందే బీజేపీ నేత శ్రావణ్ తో దీనిపై గుసగుసలాడుకున్న వైనం విస్తుగొలుపుతోంది. ఈ వీడియో చూసి నెటిజన్లు బండి సంజయ్ తీరుపై నిప్పులు చెరుగుతున్నారు. మీ రాజకీయం కోసం ప్రజలను బలి చేస్తారా? అని నిలదీస్తున్నారు.
ఇదిగో…. బీజేపీ నైజం!
హైదరాబాద్ లో మత ఘర్షణల పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మనసులో మాట వినండి. ఏ కుట్రకు ఈ గుసగుసలు!? వీళ్లా నాయకులు…ఇలాంటి క్రూరసిద్ధాంతాలు కలిగిన పార్టీని ఏం చేయాలో తెలంగాణ సమాజమే ఆలోచన చేయాలి. pic.twitter.com/xW3D64wKh6
— Revanth Reddy (@revanth_anumula) August 25, 2022


[…] Also Read: Bandi Sanjay: హైదరాబాద్ లో మత ఘర్షణలపై బండి సం… […]