Bigg Boss 6: తెలుగు బుల్లితెర ప్రేక్షకులను బిగ్ రియాల్టీ షో బిగ్ బాస్ ఎంతగానో ఆకట్టుకుంది. ఇప్పటి వరకు ఐదు సీజన్లు ప్రసారమవగా… అన్ని సీజన్లు టీఆర్పీ రేటింగుల్లో దూసుకుపోయాయి. ఇప్పుడు బిగ్ బాస్ తెలుగు సీజన్ 6 కూడా అలరించడానికి సన్నద్ధం అయ్యింది. ఇప్పటికే విడుదలైన ప్రోమోలు, కొత్త లోగో బాగా ఆకట్టుకున్నాయి. పైగా ఈ 6 సీజన్‌కు సంబంధించి చాలా రోజులుగా ఎన్నో రకాల రూమర్లు వైరల్ అవుతూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే సెప్టెంబర్ 4 నుంచి ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ సీజన్ స్టార్ట్ కానుంది. ఐతే, ఈ సీజన్ 6లోకి జబర్ధస్త్‌లో స్టార్ గా వెలుగొందుతోన్న ఓ కమెడియన్ ఎంట్రీ ఇవ్వనున్నాడు. ఇంతకీ, అతను ఎవరో తెలిస్తే షాక్ అవుతారు. మరీ ఈ వార్తకు సంబంధించి ఆ కమెడియన్ వివరాలపై ఓ లుక్ వేద్దాం రండి.

అతనే.. జబర్ధస్త్ కమెడియన్ చలాకీ చంటి. చంటిని కంటెస్టెంట్‌గా తీసుకు వస్తున్నారు. అటు జబర్ధస్త్‌లో, ఇటు సినిమాల్లో సత్తా చాటుతోన్న చంటికి మంచి కామెడీ టైమింగ్ ఉంది. అందుకే, అతనికి అత్యధిక రెమ్యూనరేషన్ ఇచ్చి మరీ ఈ షోకి తీసుకు వస్తున్నారు. ఇప్పుడు బుల్లితెర వర్గాల్లో ఇదే హాట్ టాపిక్ అయ్యింది. చంటికి రోజుకు 4 లక్షలు ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఇది ఈ సీజన్ లోనే హియ్యేస్ట్ రెమ్యునరేషన్ అని తెలుస్తోంది. ఇప్పటికే బిగ్ బాస్ ఆరో సీజన్ పనులు మొత్తం పూర్తి అయ్యాయి. పైగా షో హౌస్ సెట్ వర్కును నిర్వహకులు చాలా గ్రాండ్ గా డిజైన్ చేశారు. అలాగే, స్టేజ్‌ను కూడా సుందరంగా తీర్చిదిద్దారు. మొత్తానికి ఈ ఆరో సీజన్ ఎన్నో అంచనాలతో వైభవంగా ప్రారంభం కాబోతుంది. అన్నిటికీ మించి ఈ సీజన్‌లో పాల్గొనే కంటెస్టెంట్ల విషయంలో నిర్వాహకులు ఎన్నో వ్యూహాలను అమలు పరచబోతున్నారు.
Also Read: Bandi Sanjay: హైదరాబాద్ లో మత ఘర్షణలపై బండి సంజయ్ గుసగుసలు.. వీడియో వైరల్
ఇక ఈ సీజన్ 6 లో పాల్గొనబోయే కంటెస్టెంట్లు ఎవరు అన్నదానిపై ఉత్కంఠ వీడలేదు. తాజాగా ఆ లిస్ట్ కన్ఫమ్ అయ్యింది. 13 మంది బిగ్ బాస్ కోసం క్వారంటైన్ కు వెళ్లినట్టు తెలిసింది. పూర్తిగా కొత్త ముఖాలను ఈసారి తీసుకున్నట్టు తెలుస్తోంది.

బిగ్ బాస్ లో ఈసారి కొత్త ముఖాలు ఇవీ..
1. శ్రీహాన్ (Actor Srihan)- సిరి హనుమంత్ బాయ్ ఫ్రెండ్
2. కామన్‌మెన్ సుధీర్ కుమార్ (Common Man Sudheer)
3. దీపిక పిల్లి (Deepika Pilli)- సోషల్ మీడియా సెలబ్రిటీ, హీరోయిన్
4. హీరో అర్జున్ కళ్యాణ్ – (Arjun Kalyan Actor) ప్లే బ్యాక్ మూవీ ఫేమ్
5. మోడల్ విశాల్ రాజ్ (Model Vishal Raj)
6. సుదీప (Sudeepa Pinky)-నువ్వు నాకు నచ్చావ్ ఫేమ్ పింకీ
7. గలాటా గీతు (Galatta Geetu) యూట్యూబర్, జబర్దస్త్ ఫేమ్
8. చలాకీ చంటి (Chalaki Chanti)- జబర్దస్త్ ఫేమ్
9. సింగర్ రేవంత్ (Singer Revanth)
10. యూట్యూబర్ ఆదిరెడ్డి (Youtuber Adi Reddy)
11. సీరియల్ నటి శ్రీ సత్య (Serial Actress Sri Satya)- త్రినయని సీరియల్ ఫేమ్
12. యాంకర్ ఆరోహి రావ్ అలియాస్ ఇస్మార్ట్ అంజలి (Ismart Anjali)
13. జబర్దస్త్ ఫైమా (Jabardasth Faima)
ఈ 13 మంది కంటెస్టెంట్స్ దాదాపు కన్ఫామ్ అయినట్టు తెలుస్తోంది.
[…] Also Read: Bigg Boss 6: 25న క్వారంటైన్‌కి వెళ్తున్న బిగ్ … […]