Bandi vs Etela: స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు బీజేపీలో చిచ్చుపెట్టాయి. అందివచ్చిన అవకాశంతో అధికార పార్టీని ఇరుకున పెట్టాలని ఆ పార్టీ ఎమ్మెల్యే భావించారు. బలం లేదు కదా!! సైలెంట్‌గా ఉండాలని ఆ పార్టీ అధ్యక్షుడు ప్రకటించారు. అయితే గతంలో టీఆర్‌ఎస్‌లో కలిసి పని చేసిన అనుబంధంతో తాజా మాజీ టీఆర్‌ఎస్ కరీంనగర్ లీడర్‌ను ఎలాగైనా పార్టీలోకి తెచ్చేందుకు ఎమ్మెల్యే పావులు కదుపుతున్నాడు. అందుకే బీజేపీ ఆయనకు మద్దతు ఇస్తుందని ప్రకటించారు. ఇదే ఇప్పుడా పార్టీలో ముసలానికి దారి తీసింది. ఆ ఎమ్మెల్యే ఎవరో కాదు హుజూరాబాద్ బైపోల్‌లో టీఆర్‌ఎస్‌పై ఘన విజయం సాధించిన ఈటల రాజేందర్. పూర్తి వివరాలకు ఈ కథనాన్ని పూర్తిగా చదవాల్సిందే..

సీఎం కేసీఆర్ తనకు మాటిచ్చిన ప్రకారం ఎమ్మెల్సీ సీటు కేటాయించకపోవడంతో టీఆర్‌ఎస్‌ను వీడిన కరీంనగర్ మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్ స్వతంత్ర అభ్యర్థిగా ఎమ్మెల్సీ బరిలో నిలిచారు. ఆయనకు మద్దతిస్తామని హుజురాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ప్రకటన చేశారు. కానీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజరు మాత్రం అసలీ ఎన్నికల్లో బీజేపీ తటస్థంగా ఉంటుందని చెప్పారు. కీలక నేతలు ఇద్దరూ పరస్పర విరుద్ధ ప్రకటనలు చేయడంతో బీజేపీ క్యాడర్ అయోమయానికి గురైంది. పార్టీ మేలు కోసమే.. టీఆర్‌ఎస్‌ను దెబ్బతీసేలా ఈటల వ్యూహరచన చేశారని ఆయన వర్గీయులు చెబుతుండగా, మాట మాత్రమైనా అధ్యక్షుడికి చెప్పకుండా సొంత నిర్ణయాలు తీసుకోవడం ధిక్కారమే అవుతుందని బండి వర్గీయులు అంటున్నారు. దీంతో భారతీయ జనతా పార్టీలో ఎమ్మెల్సీ ఎన్నికల చిచ్చు రాజుకుంటుంది.
కరీంనగర్ ఉమ్మడి జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీకి సంబంధించి రెండు స్థానాలకు గాను టీఆర్‌ఎస్ ఇద్దరు అభ్యర్థులు భానుప్రసాదావు, ఎల్.రమణలను బరిలో ఉంచింది. బలం లేదు కనుక బరిలో ఉండరాదని బీజేపీ నిర్ణయించుకుంది. మొత్తం పది మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. నిన్నటివరకు టీఆర్‌ఎస్‌లో ఉండి రాజీనామా చేసి నామినేషన్ దాఖలు చేశారు మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్. రవీందర్ సింగ్ నామినేషన్‌ను కరీంనగరు చెందిన ముగ్గురు బీజేపీ కార్పోరేటర్లు ప్రతిపాదించారు కూడా. రవీందర్ సింగ్ తెలంగాణ ఉద్యమ సమయంకంటే ముందు బీజేపీలో పనిచేశారు. కేసీఆర్ సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరి కార్పొరేటర్, మేయర్‌గా పనిచేశారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ టికెట్‌ను ఆశించిన రవీందర్ సింగు చుక్కెదురుకావడంతో టీఆర్‌ఎస్‌కు రాజీనామా చేసి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగారు.
Also Read: చాణక్య నీతి: ఈ పనులు చేయకపోతే మీ శత్రువులకు బలమిచ్చినవారవుతారు.. తక్షణం ఇలా మారండి
రవీందర్‌సింగ్‌కు ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మద్దతు ప్రకటించిన విషయం బండి సంజరుకి ఇష్టం లేదు. రాష్ట్ర అధ్యక్షునిగా ఉన్న తనతో కనీసం చర్చించకుండా ఏకపక్షంగా ఎలా నిర్ణయం తీసుకున్నారన్న భావనలో ఆయనున్నారు. పైగా ముగ్గురు కార్పొరేటర్లు రవీందర్ సింగ్‌ను బలపరిచారని సంజరు దగ్గరివారితో అన్నట్లు తెలిసింది. ఈటల రాజేందర్ సూచన మేరకే రవీందర్ సింగ్ పోటీలో దిగారని ప్రచారం జరుగుతుండటంతో ఎన్నికల తరువాత గెలిచినా, ఓడినా రవీందర్ సింగ్ బీజేపీలో చేరుతారనే మరో ప్రచారమూ నడుస్తుంది. ఈటల రాజేందర్ అన్ని తానై నడిపిస్తున్న తీరుపై సంజరు వద్ద సీనియర్లు ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలిసింది. పార్టీ నిర్ణయం లేకుండా ఎలా సింగ్ కు మద్దతు ఇస్తారని , ప్రకటన జారీ చేస్తారని ప్రశ్నిస్తుండటంతో సంజరు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలపై కార్యవర్గంలో చర్చించాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది. ఇన్ని రోజులు ఒకే తాటిపై ఉన్న బీజేపీ నాయకులు ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా విడిపోయే ప్రమాదమూ లేకపోలేదు. ఎన్నికల రోజున విప్ జారీ చేస్తారా లేక అంతరాత్మ ప్రభోదంతో ఓటు వేయాలని చెపుతారా చూడాలి. మొత్తానికి సింగ్ వల్ల బీజేపీలో చిచ్చు రాజుకుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. నగర మేయర్ ఆదివారం పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసి బీజేపీ అధ్యక్షుడు సంజరు నా లేక ఈటల అనే సందేశాన్ని వ్యక్తం చేశారు. బీజేపీలో అంతర్గతంగా ఎమ్మెల్సీ ఎన్ని కలపై చర్చ జరుగుతుండటంతో ఇతర పార్టీలకు అవకాశం వచ్చినట్లయిందని బీజేపీ సీనియర్లు అంటున్నారు. ఎన్నికల సమయానికి ఈ ఎన్నిక ఎటు దారితీస్తుందో వేచి చూడాలి.
Also Read: CM KCR: కిషన్‌రెడ్డి మొగోనివైతే ధాన్యం ఎంతకొంటారో చెప్పాలి! తీవ్ర విమర్శలు చేసిన కేసీఆర్