AP High Court: జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక న్యాయపరంగా అనేక చిక్కులు ఎదుర్కోంటూ వస్తున్నారు. వ్యక్తిగతంగా, ప్రభుత్వా పరంగా ఆయన కోర్టుల్లో ఇబ్బందులు ఎదుర్కోంటూ వస్తున్న సంగతి తెల్సిందే. అయితే పాలపరంగా ఆయన అనుభవం సంపాదించుకోవడంతో గత కొద్దిరోజులుగా హైకోర్టుల్లో ప్రభుత్వానికి అనుకూలంగా వచ్చేలా తీర్పులను తెచ్చుకోగలుగుతున్నారు. న్యాయపరమైన ఎదురవుతున్న చిక్కులు తొలగిపోయేలా పకడ్బంధీ చర్యలు తీసుకుంటుండటంతో జగన్ సర్కార్ కు హైకోర్టులో ఊరట లభిస్తోంది.
వైఎస్సాసీపీ ప్రవేశపెట్టిన నవరత్నాల్లో పేదలందరికీ ఇళ్లు పథకం ముందువరుసలో ఉంటుంది. వైసీపీ అధికారంలోకి సీఎం జగన్మోహన్ రెడ్డి ఇళ్ళ పథకానికి అధిక ప్రాధాన్యం ఇచ్చారు. అయితే పథకానికి నిలిపివేయాలని అప్పట్లో ఏకంగా 128 పిటిషన్లు కోర్టుల్లో దాఖలయ్యారు.దీనిని విచారణ చేపట్టిన హైకోర్టు సింగిల్ బెంచ్ ఇళ్ళ పథకాన్ని నిలిపివేయాలంటూ అప్పట్లో తీర్పును ఇచ్చింది. దీనిపై జగన్ సర్కారు హైకోర్టు డివిజన్ బెంచ్ లో సవాల్ చేస్తూ రిట్ పిటిషన్ దాఖలు చేసింది.
ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ పై ఏపీ హైకోర్టు డివిజన్ బెంచ్ సమగ్రంగా విచారణ చేపట్టింది. ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ ఎస్ శ్రీరామ్, పిటిషనర్ల తరఫున న్యాయవాది వీఎస్ఆర్ ఆంజనేయులు తన వాదనలు వినిపించారు. ప్రభుత్వం తరుపున న్యాయవాది మాట్లాడుతూ సింగిల్ జడ్జి వద్ద పిటీషన్ దాఖలు చేసిన 128 మందిలో చాలామందికి ఇళ్ల స్థలాలు దక్కాయన్నారు.
Also Read: పవన్ ఆవేశానికి పెద్దల సంకెళ్లు… కారణం అదేనా?
పిటిషనర్లలో అర్హత ఉన్నవారికి ఇంటి స్థలం రాకపోతే పట్టాలిచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని కోర్టుకు విన్నవించారు.పిటిషన్ల తరుపు న్యాయవాది సైతం తమ పిటిషన్లరకు ఇళ్ళ స్థలాలు కేటాయించాలనే తమ ఉద్దేశ్యమని కోర్టుకు తెలిపారు. ప్రభుత్వం నుంచి పూర్తి సమాచారం, అదనపు వివరాలు అందజేయాల్సి ఉంటుందని అప్పుడే తమ వాదనలు విన్పించడానికి వెసులుబాటు కలుగుతుందని తెలిపారు.
ఇరువురి వాదనలు విన్న డివిజన్ బెంచ్ తాజాగా తీర్పును వెలువడింది. గతంలో సింగిల్ బెంచ్ తీర్పును రద్దు చేస్తూ ప్రభుత్వానికి లైన్ క్లియర్ చేసింది. దీంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇళ్ళ పథకం మరింత జెట్ స్పీడుతో పరుగులు పెట్టడం ఖాయంగా కన్పిస్తోంది.
Also Read: పొగడ్తల ‘వరద’.. సాయం అందేనా మరీ?