Bandi Sanjay: తెలంగాణలో మొదటి నుంచి బండి సంజయ్‌కు పోలీసులకు మధ్య పెద్ద వార్ నడుస్తోంది. గతంలో హుజూరాబాద్ ఎలక్షన్స్ టైమ్ లో అంతకు ముందు ఆర్టీసీ సమ్మె సమయంలో, మొన్న ఉద్యోగుల బదిలీ సమయంలో దీక్ష చేస్తుండగా.. ఇలా చాలా సార్లు ఆయనపై పోలీసులు దాడి చేశారు. అప్పటి నుంచే ఆయన నేరుగా పోలీస్ వ్యవస్థపై ముఖ్యంగా డీజీపీ మహేందర్ రెడ్డిని టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు.
అయితే ఇలా వెళ్తే లాభం లేదనుకున్నారో ఏమో గానీ.. ఇప్పుడు మైండ్ గేమ్ స్టార్ట్ చేశారు. ఎలాగూ కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీకి అధ్యక్షుడు కాబట్టి.. ఆ అవకాశాలను వాడుకోవాలని డిసైడ్ అయినట్టున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో చాలా చోట్ల బీజేపీ నేతలపై దాడులు, అరెస్టులు జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా కుట్రపూరితంగానే జరుగుతున్నాయని బండి సంజయ్ చాలా సార్లు ఆరోపించారు.
Also Read: KCR Delhi Tour: కేసీఆర్ తరుచూ ఢిల్లీ ఎందుకు వెళ్తున్నారు?
రీసెంట్ గా సిరిసిల్ల జిల్లాలోని ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో టీఆర్ఎస్- బీజేపీ నేతలు, కార్యకర్తల మధ్య పెద్ద గొడవే జరిగింది. అయితే ఈ కేసుల్లో కొందరు బీజేపీ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరంతా బెయిల్ మీద బయటకు వచ్చిన సందర్భంగా కొన్ని ఆసక్తికర కామెంట్లు చేశారు సంజయ్. ఆయన కామెంట్లు చూస్తుంటే పోలీసులపై ఒత్తిడి పెంచినట్టు అనిపిస్తోంది.
కేసీఆర్ కచ్చితంగా జైలుకు వెళ్తారని, తాము అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ మోచేతి నీళ్లు తాగుతున్న వారిని కూడా విడిచిపెట్టబోమంటూ చెప్పుకొచ్చారు. రిటైర్ అయినా సరే వారిని వదిలేది లేదంటూ హెచ్చరిస్తున్నారు. ఈ కామెంట్లు చర్చనీయాంశంగా మారాయి. ఎందుకంటే పోలీసులను నయానో, భయానో బెదిరించి తమ దారిలోకి తెచ్చుకోవాలని సంజయ్ భావిస్తున్నారు.
ఎలక్షన్లకు టైమ్ దగ్గర పడుతుండటంతో.. పోలీస్ వ్యవస్థపై పట్టు పెంచుకోవాలని చూస్తున్నారు. పోలీసుల ఆఫీసర్లకు ఓ అలవాటు ఉంది. ప్రస్తుతం ఉన్న పార్టీ ఓడిపోతుందని అనుమానం వస్తే.. ఎలక్షన్లకు ముందే ఇతర పార్టీ నేతలకు సపోర్టుగా నిలుస్తారు. ప్రస్తుతం సంజయ్ కూడా ఇలాంటి వాతావరణమే సృష్టించాలనుకుంటున్నారు. ప్రస్తుతం కేసీఆర్‌కు తెలంగాణ పోలీస్ వ్యవస్థపై సంపూర్ణమైన పట్టు ఉంది.
కాబట్టి ఆ పట్టును తమ చేతుల్లోకి తీసుకోవాలని సంజయ్ ఇలా హెచ్చరిస్తున్నారు. బుజ్జగిస్తే వినని వారిని భయపెట్టి అయినా దారిలోకి తెచ్చుకోవాలనే సిద్ధాంతాన్ని వాడేస్తున్నారు. మరి సంజయ్ ప్రయత్నం ఫలిస్తే మాత్రం అది టీఆర్ ఎస్‌కు పెద్ద దెబ్బ అనే చెప్పాలి. అందుకే టీఆర్ ఎస్ లో కొంత అలజడి నెలకొన్నట్టు తెలుస్తోంది.
Also Read: AP Cabinet Expansion: జగన్ కొత్త కేబినెట్ లో ఎవరెవరు ఉంటారు?