MP Bandi Sanjay: పాదయాత్ర బీజేపీకి కలిసొస్తుందా?

భారతీయ జనతా పార్టీ రాష్ర్ట అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర చేసేందుకు నిర్ణయించుకున్నారు. తన పాదయాత్రకు ప్రజా సంగ్రామ యాత్ర అని పేరు పెట్టారు. కార్యకర్తల్లో నూతనోత్తేజం నింపే పనిలో భాగంగా పాదయాత్ర చేపట్టనున్నట్లు ప్రకటించారు. పాదయాత్ర ఈనెల 9 నుంచి చేపట్టాలని మొదట నిర్ణయించుకున్నా అది సాధ్యం కాలేదు. ఈ నేపథ్యంలో పాదయాత్రపై భారీగానే ఆశలు పెట్టుకున్నారు. పాదయాత్ర ఏర్పాట్లపై ఎమ్మెల్యే రాజాసింగ్ కూడా తన సేవలు అందించనున్నారు. ఆయనే దీనికి ప్రజాసంగ్రామ యాత్రగా పేరు […]

Written By: Srinivas, Updated On : August 13, 2021 4:58 pm
Follow us on

భారతీయ జనతా పార్టీ రాష్ర్ట అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర చేసేందుకు నిర్ణయించుకున్నారు. తన పాదయాత్రకు ప్రజా సంగ్రామ యాత్ర అని పేరు పెట్టారు. కార్యకర్తల్లో నూతనోత్తేజం నింపే పనిలో భాగంగా పాదయాత్ర చేపట్టనున్నట్లు ప్రకటించారు. పాదయాత్ర ఈనెల 9 నుంచి చేపట్టాలని మొదట నిర్ణయించుకున్నా అది సాధ్యం కాలేదు. ఈ నేపథ్యంలో పాదయాత్రపై భారీగానే ఆశలు పెట్టుకున్నారు.

పాదయాత్ర ఏర్పాట్లపై ఎమ్మెల్యే రాజాసింగ్ కూడా తన సేవలు అందించనున్నారు. ఆయనే దీనికి ప్రజాసంగ్రామ యాత్రగా పేరు పెట్టి ఈనెల 24 నుంచి పాతబస్తీలోని భాగ్యలక్ష్మి ఆలయం నుంచి పాదయాత్ర ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. సంజయ్ బీజేపీ రాష్ర్ట అధ్యక్షుడు అయినప్పటి నుంచి పాదయాత్ర చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.

పార్టీ కోసం పాదయాత్ర చేయాలని సంకల్పించినా అనివార్య కారణాలతో వాయిదా పడుతూ వస్తోంది. ఈ నేపథ్యంలో ప్రజా ఆశీర్వాద యాత్ర పేరుతో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సైతం పాదయాత్ర చేసేందుకు సిద్ధమైన తరుణంలో హుజురాబాద్ ఉప ఎన్నికపై ప్రభావం పడే అవకాశముందని బీజేపీ వర్గాలు పేర్కొంటున్నాయి. హుజురాబాద్ ఉప ఎన్నిక నోటిఫికేషన్ వచ్చిన తరువాత బండి సంజయ్ వారం రోజుల పాటు అక్కడే పాదయాత్ర చేస్తారని పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ప్రస్తుతం బీజేపీలో రెండు వర్గాలు ఉండడంతో నేతల మధ్య సఖ్యత కొరవడి పార్టీపై ప్రభావం చూపుతున్నాయని చెబుతున్నారు.

దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడంతో ఇక బండి సంజయ్ కు ఎదురే లేదనే ప్రచారం సాగింది. దీంతో ఆ పార్టీ నేతలే సంజయ్ కు చెక్ పెట్టాలని భావిస్తూ ఆయన నిర్ణయాలు కార్యరూపం దాల్చకుండా చేసేందుకు పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. దీంతోనే ఆ పార్టీ విజయాలకు దూరంగా ఉండాల్సి వస్తోందని చెబుతున్నారు. ఇప్పటికైనా నాయకుల మధ్య సఖ్యత పెరిగి పార్టీ కార్యక్రమాలపై దృష్టి సారించి పార్టీ విజయానికి బాధ్యత వహించాలని కార్యకర్తలు కోరుతున్నారు.