https://oktelugu.com/

AP: ఏపీలో స్కూల్స్ ప్రారంభమయ్యేనా?

కరోనా ప్రభావంతో పాఠశాలలు గత మార్చి నుంచి మూతపడ్డాయి. దీంతో విద్యార్థులు ఇళ్లకే పరిమితమయ్యారు. ఆన్ లైన్ తరగతులతో కాలక్షేపం చేస్తున్నారు. దీంతో విద్యావ్యవస్థ కుంటుపడుతోంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈనెల 16 నుంచి పాఠశాలల ప్రారంభానికి చర్యలు చేపట్టింది. దీంతో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు తరగతుల నిర్వహణకు సమాయత్తమవుతున్నాయి. దీంతో ఏపీలో స్కూల్స్ రీ ఓపెన్ పై ఓ ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. దీంతో జగన్ సర్కారు నిర్ణయంపై సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. దీంతో […]

Written By: Srinivas, Updated On : August 13, 2021 5:16 pm
Follow us on

కరోనా ప్రభావంతో పాఠశాలలు గత మార్చి నుంచి మూతపడ్డాయి. దీంతో విద్యార్థులు ఇళ్లకే పరిమితమయ్యారు. ఆన్ లైన్ తరగతులతో కాలక్షేపం చేస్తున్నారు. దీంతో విద్యావ్యవస్థ కుంటుపడుతోంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈనెల 16 నుంచి పాఠశాలల ప్రారంభానికి చర్యలు చేపట్టింది. దీంతో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు తరగతుల నిర్వహణకు సమాయత్తమవుతున్నాయి. దీంతో ఏపీలో స్కూల్స్ రీ ఓపెన్ పై ఓ ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. దీంతో జగన్ సర్కారు నిర్ణయంపై సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.

దీంతో ఏపీలో పాఠశాలల ప్రారంభంపై అందరిలో గందరగోళం నెలకొంది. కరోనా జాగ్రత్తలు పాటించినా వైరస్ ప్రమాదంపై ఇంకా ఎలాంటి అప్రమత్తతలు పాటించాలో తెలియడం లేదని పేర్కొంటున్నారు. ఏపీ విద్యకు ప్రాధాన్యమిచ్చి విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నా ప్రభుత్వం ఏ మేరకు ప్రభావం చూపుతుంతో అందరిలో అనుమానాలు వస్తున్నాయి. విద్యా ప్రమాణాలు పెంచడానికి కీలక నిర్ణయాలు తీసుకుంటున్నట్లు చెబుతోంది.

రాష్ర్టవ్యాప్తంగా 44,512 ప్రభుత్వ పాఠశాలలున్నాయ. నాడు నేడు కార్యక్రమం ద్వారా పాఠశాలల రూపురేఖలు మార్చాలని ఏపీ సర్కారు భావిస్తోంది. మొదటి విడతగా 15,715 పాఠశాలల అభివృద్ధికి చర్యలు చేపట్టింది. పాఠశాలలకు రూ.3,585 కోట్లు కేటాయించింది. దీంతో పాఠశాలల మరమ్మతులు చేపట్టాలని భావిస్తోంది. విద్యార్థులకు ఉఫయోగపడేలా తీర్చిదిద్దేందుకు నిర్ణయించింది.

ఆంధ్రప్రదేశ్ లో కరోనా ప్రభావంతో పాఠశాలలను మూసివేసిన నేపథ్యంలో ఆన్ లైన్ తరగతులను ప్రవేశపెట్టి విద్యార్థులకు బోధిస్తున్నా అది పూర్తిస్థాయిలో నెరవేరడం లేదు. దీంతో ఈనెల 16 నుంచి ప్రత్యక్ష తరగతులను నిర్వహించేందుకు ప్రభుత్వం సంకల్పించింది. ఈ నేపథ్యంలో విద్యార్థుల భవిష్యత్ మారుతుందని చెబుతోంది. తగిన జాగ్రత్తలతో పాఠశాలలు ప్రారంభానికి చర్యలు చేపడుతున్నట్లు పేర్కొంది.

ప్రభుత్వ నిర్ణయాన్ని ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు సవాల్ చేస్తూ ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేయడం గమనార్హం. ఉఫాధ్యాయులందరికి వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తి కాకముందే పాఠశాలలు ప్రారంభిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని పేర్కొన్నారు. దీనిపై ప్రభుత్వం పునరాలోచించాలని హితవు పలికారు. ఇందులో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి, పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి, పాఠశాల విద్యా శాఖ కమిషనర్లను ప్రతివాదులుగా పేర్కొంటూ ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. దీంతో పాఠశాలల ప్రారంభంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.