ప్రజాసంగ్రామ యాత్రలో భాగంగా సంగారెడ్డి జిల్లా జోగిపేట బహిరంగ సభలో ఆయన ఆసక్తికర కామెంట్లు చేశారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలిచిన తరువాత కేసీఆర్ ఢిల్లీకి వెళ్లి అమిత్ షాతో మేయర్ పదవి బీజేపీకి ఇస్తామని చెప్పినట్లు బాంబు పేల్చారు. దీనికి అమిత్ షా సైతం అలాంటి పదవులు తమకు అక్కర్లేదని తిరస్కరించినట్లు చెప్పారని పేర్కొన్నారు. దీంతో బండి సంజయ్ పేల్చిన బాంబుకు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం అయింది.
ఈ నేపథ్యంలో బండి సంజయ్ చేస్తున్న ఆరోపణలకు అంతు లేకుండా పోతోందని రాజకీయ వర్గాల్లో సంచలనం రేకెత్తిస్తోంది. అధికార పార్టీ టీఆర్ఎస్ ను లక్ష్యంగా చేసుకుని సంజయ్ చేస్తున్న విమర్శలు పొంతన లేకుండా ఉంటున్నాయనే వాదన వినిపిస్తోంది. కేసీఆర్, అమిత్ షాల గురించి ఏ ఆధారాలతో ఇలా మాట్లాడారని ప్రశ్నిస్తున్నారు. రాబోయే ఎన్నికలే గురిగా ఆయన తన మార్గాలు వెతుకుతున్నట్లు చెబుతున్నారు.
ఉన్నది ఉన్నట్లు కుండబద్దలు కొట్టేలా మాట్లాడే బండి సంజయ్ చేస్తున్న ఆరోపణలు ఆలోచనలకు అందనివిగా ఉంటున్నాయని తెలుస్తోంది. జాతీయ పార్టీకి అధ్యక్షుడిగా ఉన్న సంజయ్ చెబుతున్న మాటల్లో ఆంతర్యమేమిటన్నది అర్థం కావడం లేదు. దీనికి వారి దగ్గర సరైన ఆధారాలు కూడా లేవని తెలుస్తోంది. అయినా కేసీఆర్ ను దెబ్బ కొట్టాలనే సంకల్పంతోనే ఇలా మాట్లాడున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఏది ఏమైనా బీజేపీ రాష్ర్టంలో అధికారం కోసం ఇంత దారుణంగా ఆరోపణలకు దిగడం సరైంది కాదని పలువురు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.