Homeజాతీయ వార్తలుBandi Sanjay: ‘బండి’ని దించిందెవరు.. ఫిర్యాదులు చేసింది వారేనా?

Bandi Sanjay: ‘బండి’ని దించిందెవరు.. ఫిర్యాదులు చేసింది వారేనా?

Bandi Sanjay: బండి సంజయ్‌.. బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు. తెలంగాణలో పార్టీకి గతంలో ఎన్నడూ లేనంత హైప్‌ తీసుకుచ్చిన నేత. కరుడుగట్టిన హిందూవాది.. మాస్‌ లీడర్‌.. అధికార పార్టీతో ఢీ అంటే ఢీ అంటూ కొట్లాడిన నేత. 2020లో అధ్యక్ష బాధ్యతుల చేపట్టిన సంజయ్‌.. మూడేళ్లు పార్టీకి మంచి హైప్‌ తీసుకొచ్చారు. ప్రజల్లోకి పార్టీని తీసుకెళ్లారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల వరకు అధ్యక్షుడిని మర్చొద్దని అధిష్టానం నిర్ణయించింది. అయితే సడెన్‌గా పక్షం క్రితం అ«ద్యక్షుడిని మార్చింది. బండిని తప్పించి బీజేపీ రాష్ట్ర పగ్గాలను కిషన్‌రెడ్డికి అప్పగించింది. సడెన్‌ మార్పు వెనుక అనేక అనుమానాలు వ్యక్తమవయ్యాయి.

ఫిర్యాదులే కారణం..
బండి సంజయ్‌పై కొంతమంది ఆయన వ్యతిరేకులు అధిష్టానానికి ఫిర్యాదుచేశారని ప్రచారం జరిగింది. అది నిజమే అని సంజయ్‌ శుక్రవారం తెలిపారు. కిషన్‌రెడ్డికి బాధ్యతలు అప్పగించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధిష్టానానికి ఫిర్యాదులు చేయడం ఆపండి అని విన్నవించారు. దీంతో తనను తపిపంచడానికి కారణం ఫిర్యాదులే అని స్పష్టంగ చెప్పారు. ఫిర్యాదుల కారణంగా ప్రశాంతంగా పని చేసుకోలేకపోతున్నారని తెలిపారు.

ఎవరు చేసుంటారు..
పార్టీలోని కీలక నేతలంతా సమావేశంలో ఉన్న సమయంలోనే సంజయ్‌ ఫిర్యాదుల అంశాన్ని ప్రస్తావించడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఎవరిపేరు చెప్పకపోయినా.. తెలియాల్సిన వారికి తెలియాలి అన్నట్లుగానే సంజయ్‌ ఈ వ్యాఖ్యలు చేసి ఉంటారని సమాచారం. అయితే సంజయ్‌పై ఫిర్యాదు చేసిందెవరు అన్న విషయమై ఇప్పుడు పార్టీలో అంతర్గత చర్చ జరుగుతోంది. సభలో ఈటల రాజేందర్, రఘునందన్‌రావు, కోమటిరెడ్డి రాజపపాల్‌రెడ్డి, ఇతర నేతలంతా సమావేశంలో ఉన్నారు. గతంలో పార్టీలో కొత్తగా చేరినవారు, పార్టీలో సంజయ్‌ అంటే గిట్టనివారే అధిష్టానానికి ఫిర్యాదు చేశారని ప్రచారం జరిగింది. కానీ సంజయ్‌ వ్యాఖ్యల తర్వాత ఎవరూ ఈ అంశం గురించి ప్రస్తావించకపోవడం గమనార్హం.

కాంగ్రెస్‌లా మారుతున్న బీజేపీ..
ఇక బీజేపీ పరిస్థితి కూడా కాంగ్రెస్‌లా మారుతున్నట్లు కనిపిస్తుంది. బీజేపీ అంటే క్రమశిక్షణకు మారుపేరుగా ఉండేది. పార్టీ సిద్ధాంతాలకు, అధిష్టానం నిర్ణయాలకు కట్టుబడి ఉండే నేతలు పనిచేసేవారు. కానీ ఇటీవల వలసలు పెరిగాయి. అధికారం కోసం అధిష్టానం కూడా వలసలను ప్రోత్సహించింది. దీంతో పార్టీలో క్రమంగా కాంగ్రెస్‌ పరిస్థితులు నెలకొంటున్నాయి. చిట్‌చాట్‌లు, ప్రెస్‌మీట్లు పెట్టడం, అధిష్టానానికి వ్యతిరేకంగా మాట్లాడడం, అధ్యక్షుడిపై ఫిర్యాదులు చేయడం.. ఇవన్నీ కాంగ్రెస్‌లో మాత్రమే కనిపించేవి. కానీ ప్రస్తుతం బీజేపీ నేతలు కూడా ఇదే విధంగా ప్రవర్తిస్తున్నారు. ముఖ్యమంగా ఇతర పార్టీల నుంచి బీజేపీలో చేరినవారే ఇలా వ్యవహరిస్తున్నారు. దీంతో వలస నేతలే బండిపై ఫిర్యాదు చేసి ఉంటారన్న అభిప్రాయం పార్టీ క్యాడర్‌లో నెలకొంది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
RELATED ARTICLES

Most Popular