Bandi Sanjay: బండి సంజయ్ ‘దీక్ష’.. తెలంగాణ పీఠం కదిలిస్తాడా?

Bandi Sanjay: తెలంగాణలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీకి సరైన ప్రత్యామ్నాయంగా బీజేపీ మారింది. ప్రభుత్వ వైఫల్యాలను నిత్యం ప్రజాక్షేత్రంలో ఎండగడుతున్న బీజేపీ నాయకులు ఎన్నికల్లోనూ అదే రేంజులో సత్తా చాటుతూ సీఎం కేసీఆర్ కు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నేతృత్వంలో బీజేపీ తెలంగాణలో రోజురోజుకు బలమైన శక్తిగా ఎదుగుతుండటంతో టీఆర్ఎస్ హడలిపోతుంది. ఈక్రమంలోనే టీఆర్ఎస్, బీజేపీల మధ్య నిత్యం మాటలయుద్ధం నడుస్తోంది. ఎవరికీవారు తగ్గెదేలా అన్నట్లుగా మాటల […]

Written By: NARESH, Updated On : December 27, 2021 11:39 am
Follow us on

Bandi Sanjay: తెలంగాణలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీకి సరైన ప్రత్యామ్నాయంగా బీజేపీ మారింది. ప్రభుత్వ వైఫల్యాలను నిత్యం ప్రజాక్షేత్రంలో ఎండగడుతున్న బీజేపీ నాయకులు ఎన్నికల్లోనూ అదే రేంజులో సత్తా చాటుతూ సీఎం కేసీఆర్ కు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నేతృత్వంలో బీజేపీ తెలంగాణలో రోజురోజుకు బలమైన శక్తిగా ఎదుగుతుండటంతో టీఆర్ఎస్ హడలిపోతుంది.

ఈక్రమంలోనే టీఆర్ఎస్, బీజేపీల మధ్య నిత్యం మాటలయుద్ధం నడుస్తోంది. ఎవరికీవారు తగ్గెదేలా అన్నట్లుగా మాటల తూటాలు పేలుస్తుండటంతో తెలంగాణ రాజకీయాలు రోజురోజుకు హీటెక్కితున్నాయి. తెలంగాణలో బస్సు యాత్ర, పాదయాత్రతో రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు చేస్తున్న బండి సంజయ్ కు జనాలు నీరాజనాలు పడుతున్నారు. రాబోయే సార్వత్రిక ఎన్నికలే లక్ష్యంగా బీజేపీ పావులు కదుపుతోంది.

బీజేపీ ఓవైపు రైతుల పక్షాన పోరాటం చేస్తూనే మరోవైపు నిరుద్యోగ దీక్షకు పిలుపునిచ్చింది. దీంతో వేలాదిగా విద్యార్థులు, నిరుద్యోగ సంఘాలు, యువత నిరుద్యోగ దీక్షకు తరలి వస్తున్నారు. ఈక్రమంలోనే తెలంగాణ పోలీసులు బీజేపీ నాయకులను, నిరుద్యోగులను అదుపులోని తీసుకుంటూ అక్రమ అరెస్టులకు పాల్పడుతున్నాడు. ప్రభుత్వ వైఖరిని బీజేపీ నేతలు ఖండిస్తున్నారు.

కోవిడ్ నిబంధనలకు లోబడే బీజేపీ పార్టీ కార్యాలయంలో ‘నిరుద్యోగ’ చేపడుతుంటే ప్రభుత్వానికి ఉన్న అభ్యంతరం ఏంటని బండి సంజయ్ ప్రశ్నించారు. ‘నిరుద్యోగ దీక్ష’తో టీఆర్ఎస్ పీఠం కదులుతుందనే భయంతోనే ప్రభుత్వం ఇలాంటి చర్యలకు పాల్పడుతుందని ఆయన విమర్శించారు. కేసీఆర్ నియంత పాలనకు ఇలాంటి చర్యలు నిదర్శనమని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఉద్యోగ నోటిఫికేషన్లు రాక దాదాపు 600మంది నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్నారని అయినా ప్రభుత్వానికి చీమకుట్టినట్లు కూడా లేదని మండిపడ్డారు. ప్రభుత్వ చర్యలను మేధావులు, విద్యావేత్తలు, ప్రజాస్వామికవాదులంతా ఖండించాలని బండి సంజయ్ పిలుపునిచ్చారు. నిరుద్యోగ దీక్షకు రాజకీయాలకు అతీతంగా మద్దతు ఇవ్వాలని ఆయన కోరారు.

Also Read: Telangana: తెలంగాణకు 9, ఏపీకి 10.. సుపరిపాలనలో రెండు స్టేట్లకు ఆసక్తికరమైన సూచీలు

బీజేపీ చేపడుతున్న నిరుద్యోగ దీక్షపై మంత్రి కేటీఆర్ ఘాటుగా స్పందించారు. ‘బండి సంజయ్ ది నిరుద్యోగ దీక్ష కాదని.. సిగ్గులేని దీక్ష అన్నారు. పచ్చి అవకాశవాదమని కామెంట్ చేశారు. కేటీఆర్ వ్యాఖ్యలను ఎమ్మెల్యే రాజా సింగ్ తిప్పికొట్టారు. ఏడేళ్లుగా ప్రభుత్వం ఉద్యోగాల పేరుతో ఊరిస్తుందే తప్ప నోటిఫికేషన్లు ఇవ్వడం లేదన్నారు.

కేటీఆర్ నిరుద్యోగులను అవమానించేలా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. మొత్తంగా బీజేపీ చేపట్టిన నిరుద్యోగ దీక్ష తెలంగాణ మంత్రులను గట్టిగానే తాకినట్లు కన్పిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరోవైపు ప్రభుత్వం కోవిడ్ ఆంక్షల సాకుతో బీజేపీ నేతలను అక్రమ అరెస్టు చేస్తుండటం తెలంగాణలో చర్చనీయాంశంగా మారుతోంది.

Also Read: TPCC Revanth Reddy: వైఎస్‌‌ను ఫాలో అవుతున్న టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.. అదొక్కటే మార్గమా..?