Radhe Shyam Budget and Remunerations: ‘ప్రభాస్’ ప్రస్తుతం నిజమైన నేషనల్ స్టార్. నిజంగా పాన్ ఇండియా రేంజ్ లో మార్కెట్ ఉన్న ఏకైక ఇండియన్ హీరో ప్రస్తుతానికి ప్రభాస్ ఒక్కడే. ఆర్ఆర్ఆర్ రిలీజ్ తర్వాత ఎన్టీఆర్ కి కూడా నేషనల్ వైడ్ గా మార్కెట్ వస్తోందని.. బాలీవుడ్ దర్శక దిగ్గజాలు అందుకే ఎన్టీఆర్ తో సినిమాలను ప్లాన్ చేస్తున్నారని వార్తలు వస్తున్నా.. ఇప్పటికైతే కేవలం ప్రభాస్ మాత్రమే స్టార్. ఏకైక పాన్ ఇండియా స్టార్.
మరి అలాంటి స్టార్ నుంచి వస్తోన్న సినిమా ‘రాధేశ్యామ్’. ఈ సినిమా పాన్ ఇండియా సినిమా కావడంతో ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులు ఈ సినిమా పై భారీ అంచనాలు పెట్టుకున్నారు. అయితే, ఈ సినిమా కోసం అసలు ప్రభాస్ ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నాడు ? ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ అయింది. వాస్తవానికి ప్రభాస్ ఓన్ బ్యానర్స్ యువీ క్రియేషన్స్, గోపీకృష్ణ మూవీస్ లోనే ఈ సినిమా తెరకెక్కుతుంది.
Also Read: Radhe Shyam: ప్రభాస్ “రాధే శ్యామ్” నుంచి…. గూస్ బంప్స్ అప్డేట్
కాబట్టి.. ప్రభాస్ కి ఇంత రెమ్యునరేషన్ అని ప్రత్యేకంగా లెక్కలు ఏమి లేవు. కానీ, సినిమాకి అయిన బడ్జెట్, అలాగే సినిమాకి జరిగిన బిజినెస్ ను దృష్టిలో పెట్టుకుంటే.. అసలు ఈ సినిమాకి ప్రభాస్ ఎంత మిగులుతుందో అని ఓ అంచనాకి వచ్చారు సినిమా పండితులు. ప్రభాస్ కి 90 కోట్లు వరకూ రెమ్యునరేషన్ ఉండే అవకాశం ఉందని అంటున్నారు.
బాలీవుడ్ లో 90 కోట్ల రెమ్యునరేషన్ అంటే సాధారణ విషయమే. అయితే, ప్రభాస్ ప్రస్తుతం ఆదిపురుష్ సినిమాకి గానూ దాదాపు వంద కోట్ల రూపాయల రేంజ్‌లో రెమ్యూనిరేషన్ అందుకుంటున్నట్లు తెలుస్తోంది. బాలీవుడ్ స్టార్ హీరోలు 70 – 80 కోట్లు డిమాండ్ చేస్తున్నారు. కానీ ప్రభాస్ వారిని తలదన్నేలా ఏకంగా రూ.100 కోట్ల రెమ్యునరేషన్ అందుకోవడం విశేషమే.
పైగా ప్రభాస్ డిమాండ్ చేయకుండా నిర్మాతలే స్వయంగా వచ్చి అంత భారీ రెమ్యునరేషన్ ను ఇవ్వడానికి ఉత్సాహం చూపించడం అంటే గ్రేట్. .. ఓ సౌత్ హీరో సాధించిన ఘనమైన ఘనత ఇది. పైగా ప్రభాస్ రెమ్యూనరేషన్ పై ఇండస్ట్రీలో వినిపిస్తోన్న టాక్ ప్రకారం.. 5 సినిమాలకు కలిపి ప్రభాస్ దాదాపు 610 కోట్లకు పైనే రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడట.
ఇక ప్రస్తుతం రాధేశ్యామ్ విషయానికి వస్తే.. ఈ మూవీ కనీసం సుమారు 400 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. అలాగే టాల్ బ్యూటీ పూజా హెగ్డేకి 4 కోట్లు రెమ్యునరేషన్ ను ఇచ్చారు. కాగా కృష్ణంరాజు సమర్పణలో యూవీ క్రియేషన్స్ – గోపీకృష్ణ మూవీస్ – టీ సిరీస్ సంస్థలు సంయుక్తంగా భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. కాగా వంశీ – ప్రమోద్ – ప్రసీద – భూషణ్ కుమార్ నిర్మాతలుగా వ్యవహరించారు.
Also Read:Radhe Shyam: ‘రాధేశ్యామ్’ స్థాయిని కావాలనే తగ్గించారు !