
– సకల జనుల సమ్మె జరిగి 10 ఏళ్లయినా స్మరించని కేసీఆర్
– ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని దుస్థితి
– కేటీఆర్ సవాళ్లన్నీ తుపాకీ రాముడి మాటలే
– నిధులపై ఢిల్లీ వెళ్లినప్పుడు మోదీని ఎందుకు అడగలేదు
– సకల జనులను నిలువునా వంచించిన కేసీఆరే రాజీనామా చేయాలి
– మెదక్ లో జరిగిన ప్రెస్ మీట్ లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ ఫైర్
Bandi Sanjay criticizes CM KCR’s rule: సకల జనుల సమ్మె జరిగి పదేళ్లయినా కనీసం స్మరించిన నీచమైన ముఖ్యమంత్రి కేసీఆర్ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్(Bandi Sanjay) మండిపడ్డారు. సకల జనుల సమ్మె లేకుంటే తెలంగాణ వచ్చేది కాదని, వారి పోరాటాలవల్లే తెలంగాణ కల సాకారమైందని స్మరించుకున్నారు. అయితే గత ఏడేళ్ల కేసీఆర్ పాలనలో ఉద్యోగులు, నిరుద్యోగులు, రైతులు సహా అన్ని వర్గాలు సంక్షోభంలో కూరుకుపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రానికి రాష్ట్రం ఇస్తున్న నిధులు తక్కువని, ఈ విషయంపై బండి సంజయ్ రాజీనామా చేయాలంటూ మంత్రి కేటీఆర్ విసిరిన సవాల్ పై ఘాటుగా స్పందించారు. ‘‘నువ్వో తూట్ పాలిష్ గాడివి. నీవన్నీ తుపాకీ రాముడి మాటలు. చదువుకున్న అజ్ఝానివి. రాజ్యాంగం కూడా తెలియనోడివి. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రాలకు 32 శాతం వాటా నిధులిస్తే…నరేంద్రమోదీ ప్రభుత్వం వచ్చాక 41 శాతానికి పెంచింది. ఇది గాక జాతీయ విపత్తులకు అదనంగా నిధులిస్తోంది. దేశ రక్షణ, ఫ్రీ వ్యాక్సిన్ నిధులన్నీ కేంద్రానివే. కనీస జ్ఝానం లేకుండా మాట్లాడుతున్నడు. అలాంటి తుపాకీ రాముడి మాటలు పట్టించుకునేదెవరు? చేతనైతే నీ అయ్య(కేసీఆర్)ను రమ్మను. మాట్లాడతా’’ అని అన్నారు. నిజానికి రాజీనామా చేయాల్సింది కేసీఆరేనని వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చని వ్యక్తి. ఉద్యోగాలివ్వనందుకు, రుణమాఫీ అమలు చేయనందుకు, నిరుద్యోగ భ్రుతి ఇవ్వనందుకు కేసీఆర్ రాజీనామా చేయాలి’’అని మండిపడ్డారు. ఈ సందర్భంగా బండి సంజయ్ ప్రెస్ మీట్ లో మాట్లాడిన అంశాలిలా ఉన్నాయి…
* ప్రజల నుండి పాదయాత్రకు విశేష స్పందన వస్తోంది. దానికి మీడియా సాక్ష్యం. ప్రజా స్పందనను చూసి జనంలో చర్చ మొదలైంది. రాజకీయ పార్టీలు మాట్లాడుతున్నయ్. ప్రజలు అనేక సమస్యలు చెబుతున్నారు. ఫసల్ బీమా అమలు చేయాలంటున్నరు. ఉద్యోగాల్లేవని, నిరుద్యోగ భ్రుతి లేదని, డబుల్ బెడ్రూం ఇండ్లు లేవని….ఇలా అనేక సమస్యలు చెబుతున్నరు.
•సకల జనుల సమ్మె జరిగి 10 ఏండ్లయింది. ఉవ్వెత్తిన లేచిన ఉద్యమం. అన్ని రకాల ఉద్యోగులు, జర్నలిస్టులు, ప్రజా సంఘాలు సహా ప్రతి ఒక్కరూ ఈ సమ్మెలో పాల్గొన్నరు. ఉద్యోగాల నుండి తొలగిస్తామని అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం బెదిరించినా లెక్క చేయకుండా తెలంగాణ కోసం సమ్మె చేసిండ్రు. ఇంతమంది ఉద్యమాలతో తెలంగాణ వస్తే ఈ ఏడేళ్లలో సకల జనుల కోసం ఏం చేశారో చెప్పాలి.
•కనీసం సీఎం నోట ఆ మాట కూడా రాకపోవడం సిగ్గు చేటు. ఇంతకంటే నీచమైనది ఇంకోటి లేదు. సకల జనుల సమ్మె లేకుంటే తెలంగాణ వచ్చేది కాదు. తెలంగాణ వచ్చాక కేసీఆర్ సాధించింది ఆయన, ఆయన కుటుంబం కోట్లు కూడగట్టి విదేశాల్లో దాచుకోవడం తప్ప ప్రజలకు చేసిందేమీ లేదు.
•ఉన్న సచివాలయాన్ని కూల్చేసి కొత్తది కడతనని చెప్పిండు. అందులో ఏదో మతలబు ఉంది. గుప్త నిధి ఉందని ప్రచారం జరుగుతోంది.
•కొత్త ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వాలని నిరుద్యోగులు మొత్తుకుంటున్నా పట్టించుకోవడం లేదు. రైతులు కష్టమైనా నష్టమైనా అప్పోసప్పో చేసి తమ పిల్లలను ఉన్నత చదువులు చదివిస్తే…వారికి ఉద్యోగాల్లేక భారమైపోతున్నరు. ఎక్కడపోయినా రైతులు ఇదే బాధను వ్యక్తం చేస్తుండ్రు.
•పీఆర్సీ ఇవ్వాలని మండలాలు, జిల్లాలు, రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేసినా పట్టింపు లేదు. పీఆర్సీ ప్రకటన చేసి 2020-21 సంవత్సరానికి బకాయిలు ఇవ్వడం లేదు. ఉద్యమాలు చేస్తే సీఎం ఏమంటున్నడంటే…..ఉద్యోగి రిటైర్డ్ అయ్యాక లేదా ఉద్యోగి చనిపోయాక బకాయిలు ఇస్తామని కేసీఆర్ చెబుతుండు. ఇంతకంటే మూర్ఖుడు ఇంకొకరు ఉంటారా? ఏం బిచ్చమేస్తున్నవా ఉద్యోగులకు?
•ప్రభుత్వ ఉద్యోగుల ప్రమోషన్లు లేవు, బదిలీల్లేవ్. ప్రభుత్వ కాలేజీ లెక్చరర్లు బాధలు వర్ణణాతీతం. మూడు డీఏలు ఇవ్వాలే అదీ ఇవ్వలేదు. జీతాలు ఎప్పుడిస్తడో ఎవరికీ తెలియదు. ఆర్టీసీ ఉద్యోగులు రోడ్డున పడ్డరు. వాళ్ల సమస్యలపై అశ్వథ్థామరెడ్డి పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తే ఆయనను తప్పిస్తేనే మీ సమస్యలు పరిష్కరిస్తనని సీఎం బెదిరించి తప్పించిండు. అయినా సమస్యలను పరిష్కరించని మూర్ఖుడు. రిటైర్డ్ అయిన ఉద్యోగులకు సకల జనుల సమ్మె కాలం నాటి జీతం ఇవ్వడం లేదు. దాదాపు వెయ్యి బస్సులను తీసేసిండ్రు. రూ.1300 కోట్ల ఆర్టీసీ నిధిని ప్రభుత్వం వాడుకుంది. ఆర్టీసీ స్థలాలను అమ్ముకోవాలని చూస్తుండ్రు.
•ఆర్టీసీ ఉద్యోగులు ఇతర పార్టీల నేతలతో కరచాలనం చేసినా, ఫొటోలు దిగినా సస్పెండ్ చేస్తున్నరు. గతంలో ఉద్యోగులు ఉద్యమాలు చేస్తేనే తెలంగాణ వచ్చిన సంగతి మర్చిపోయిండు. ఆర్టీసీ కార్మికులకు బ్యాంకులు లోన్లు కూడా ఇవ్వని పరిస్థితి. ఆర్టీసీ కార్మికులంటే హేళన చేసే దుస్థితి సమాజంలో ఏర్పడింది.
•రాబోయే రోజుల్లో ఆర్టీసీని కాపాడటానికి బీజేపీ ముందుంటుంది. వారి డిమాండ్ల సాధన కోసం పోరాడతాం. ఎంతోమంది ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నా భరోసా ఇవ్వని సీఎం కేసీఆర్. బెదిరించి కాలయాపన చేస్తుండే తప్ప ఏనాడూ వారి సమస్యలను పరిష్కరించిన దాఖలాల్లేవ్. సెలెక్టెడ్ గా కొద్దిమందిని పిలిచి వారికి చికెన్, మటన్ సహా అన్నీ వడ్డిస్తడు. యూనియన్ లీడర్ల వద్దకు పోయి అన్నీ బాగున్నయా? తిన్నరా? అని అడిగి వెళ్లిపోతడే తప్ప సమస్యలపై చర్చించిన దాఖలాల్లేవ్.
•ఈ సీఎంది నోరా….తాటిమట్టా? మాటలు కోటలు దాటుతయ్. మాట్లాడితే వందల కోట్లు ఇస్తనని చెబుతడు. కానీ పైసా కూడా ఇవ్వడు. ఇప్పటికైనా సీఎం మారాలి. ఆర్టీసీ విషయంలో శ్రద్ధ వహించాలి.
•కేంద్ర మంత్రి శోభ కరంద్లాజే సీఎంను కొన్ని ప్రశ్నలడిగారు. కేంద్ర వ్యవసాయ మంత్రి వీడియో కాన్ఫరెన్సుకు సీఎం ఎందుకు హాజరుకాడు. అంత బిజీ ఏముంది? అపెక్స్ కౌన్సిల్ సమావేశానికి వెళ్లడు. వాయిదా వేయిస్తడు. పోనీ ప్రజల్లో ఏమన్నా ఉంటుండా? సమస్యలపై చర్చిస్తుండా? అంటే అదీ లేదు.
•ఫసల్ బీమా రాష్ట్రంలో అమలు చేయకపోవడానికి కారణమేందో చెప్పాలి. భూసార(సాయిల్) హెల్త్ కార్డులు ఎందుకు ఇస్తలేరు. వ్యవసాయ శాఖ నిధుల విషయంలో మీ వైఖరి ఏంది?
•వ్యవసాయంలో సమస్యలున్నయ్. వరి వడ్లు కొంటలేరని నువ్వే అంటున్నవ్ కదా….కేంద్ర వ్యవసాయ మంత్రి వచ్చి అపాయిట్ మెంట్ అడిగితే ఎందుకు ఇవ్వలేదు?
•కేటీఆర్ విసిరిన సవాల్ పై…….ఆ తుపాకీ రాముడి సవాల్ ను ఎవరు పట్టించుకుంటరే? గతంలో కేంద్రానికి వచ్చిన ఆదాయంలో రాష్ట్రాలకు 32 శాతం వాటా ఇచ్చేది. మోదీ ప్రభుత్వం ఆ వాటాను 41 శాతానికి పెంచారు. ఇవిగాకుండా జాతీయ విపత్తులకు అనేక నిధులిస్తోంది. ఫ్రీ వ్యాక్సిన్ వంటి వాటికి నిధులన్నీ కేంద్రమే ఇస్తోంది. బియ్యంసహా అన్నింటికీ కేంద్రమే ఇస్తోంది.
•పక్క రాష్ట్రం గురించి నీకెందుకు? నువ్వేం చేస్తున్నవ్. కేటీఆర్ అజ్ఝాని. రాజ్యంగం గురించి తెలియదు. మీ అయ్య ఢిల్లీకి పోయిండు కదా? ఎందుకు మోడీగారిని అడగలేదు. అక్కడ ఎందుకు రాజీనామా అడగలేదు? మీ అయ్య వస్తే నేను, మీ అయ్య కలిసి వెళ్లి మోదీ గారి వద్దకు వెళ్లి అడిగి రాజీనామా చేస్తం. రమ్మనండి.
•అసలు రాజీనామా చేయాల్సింది ఈ తుపాకీ రాముడి అయ్యే. ధనిక రాష్ర్టాన్ని అప్పుల పాల్జేసినందుకు. కేంద్రం నిధులను ప్రజలకు పంచకుండా దోచుకున్నందుకు, ఇంటికో ఉద్యోగం ఇవ్వనందుకు, రుణమాఫీ ఇవ్వనందుకు, నిరుద్యోగ భ్రుతి ఇవ్వనందుకు రాజీనామా చేయాలి. అసలు నువ్వు కాదు….మీ అయ్య రాజీనామా చేయాలి? నువ్వో తూట్ పాలిష్ గాడివి.
•కేసీఆర్ ది లీకేజీల పార్టీ. లోపల జరిగేది ఒకటి బయట చెప్పుకునేది మరొకటి. మోదీ గారిని కలిసి బయటకొచ్చి శభాష్ అని దుష్ర్పచారం చేసుకుంటడు. కేంద్ర మంత్రులు ఖండిస్తున్నరు కూడా…దయచేసి మీడియా వాస్తవాలు తెలుసుకుని రాయాలని కోరుతున్నా.
•విద్యుత్ మీటర్ల బిగింపుపై అడిగిన ప్రశ్నకు ‘దుబ్బాక ఎన్నికల టైములు ఇలాంటి ఆరోపణలు చేసిండ్రు. కానీ ఇప్పటి వరకు మీటర్లు పెట్టిండ్రా పెట్టలేదు. కావాలని కేంద్రంపై అభాండాలు వేస్తున్నరు. ప్రజలు ఈ పిచ్చికూతలన్నీ అర్ధం చేసుకున్నరు. తగిన గుణపాఠం చెబుతరు.
-ఊహించిన దానికన్న మిన్నగా సాగుతున్న పాదయాత్ర : డాక్టర్ జి.మనోహర్ రెడ్డి
పాదయాత్ర ప్రముఖ్ డాక్టర్ మనోహర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ… రోజుకు సగటున 15 కి.మీలు పాదయాత్ర జరుగుతోంది. ప్రజల నుండి విశేష స్పందన. బీజేపీ అంటే భాగ్యనగర్ కే పరిమితమనే అనుమానాలను పటాపంచలు చేస్తూ పాదయాత్ర సాగుతోంది. ఊహించిన దానికంటే మిన్నగా మెదక్ జిల్లాలో పాదయాత్ర సాగుతోంది. నేటికి 250 కి.మీలు పాదయాత్ర పూర్తయ్యింది. 14 నియోజకవర్గాల్లో సాగింది. ప్రజల నుండి అనేక సమస్యలపై వినతి పత్రాలు వస్తున్నాయి. గతంలో జరిగిన పాదయాత్రలకంటే మిన్నగా జనం ప్రజా సంగ్రామ యాత్రకు వస్తున్నారు.
•ప్రెస్ మీట్ లో పాల్గొన్న నాయకులు : బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ తోపాటు పాదయాత్ర ప్రముఖ్ డాక్టర్ మనోహర్ రెడ్డి, ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్.కుమార్ పార్టీ జిల్లా అధ్యక్షులు గడ్డం శ్రీనివాస్, రాష్ట్ర అధికార ప్రతినిధి రాకేశ్ రెడ్డి, సిరిసిల్ల జిల్లా ప్రతాప రామక్రిష్ణ, సిద్దిపేట జిల్లా అధ్యక్షులు శ్రీకాంత్ రెడ్డి, యువ మోర్చారాష్ట్ర అధ్యక్షులు భాను ప్రకాశ్, జిల్లా నాయకులు కుమ్మరి శంకర్, తాళ్లపల్లి రాజశేఖర్, నందారెడ్డి, సురేష్, విజయ్, సుధాకర్ రెడ్డి, శ్రీనివాసగుప్త తదితరులు ప్రెస్ మీట్ లో పాల్గొన్నారు.