Trivikram Srinivas: త్రివిక్రమ్.. నీకు ఇది తగదయ్యా !

Trivikram Srinivas: త్రివిక్రమ్ (Trivikram) మాటలకు తెలుగు ప్రేక్షకులు పెద్ద అభిమానులు. త్రివిక్రమ్ రెండో సినిమా ‘చిరునవ్వుతో’ నాటి నుంచి త్రివిక్రమ్ రాసిన చాలా డైలాగులు కంఠతా పడుతున్న అభిమానులు ఉన్నారు త్రివిక్రమ్ కి. కానీ ఎందుకో త్రివిక్రమ్ సినిమా క్రెడిట్స్ విషయంలో తన స్థాయికి తగ్గట్టుగా ప్రవర్తించట్లేదు అనే ఆరోపణలు ఉన్నాయి. త్రివిక్రమ్ రాసిన చాలా సినిమాలలో కథలు యద్దనపూడి సులోచనారాణి గారి నవలలు నుంచి ప్రేరణ పొంది రాసుకున్నవే. కొన్ని కథలు యధాతధంగా కాపీ […]

Written By: admin, Updated On : September 14, 2021 6:45 pm
Follow us on

Trivikram Srinivas: త్రివిక్రమ్ (Trivikram) మాటలకు తెలుగు ప్రేక్షకులు పెద్ద అభిమానులు. త్రివిక్రమ్ రెండో సినిమా ‘చిరునవ్వుతో’ నాటి నుంచి త్రివిక్రమ్ రాసిన చాలా డైలాగులు కంఠతా పడుతున్న అభిమానులు ఉన్నారు త్రివిక్రమ్ కి. కానీ ఎందుకో త్రివిక్రమ్ సినిమా క్రెడిట్స్ విషయంలో తన స్థాయికి తగ్గట్టుగా ప్రవర్తించట్లేదు అనే ఆరోపణలు ఉన్నాయి.

త్రివిక్రమ్ రాసిన చాలా సినిమాలలో కథలు యద్దనపూడి సులోచనారాణి గారి నవలలు నుంచి ప్రేరణ పొంది రాసుకున్నవే. కొన్ని కథలు యధాతధంగా కాపీ కొట్టినవే. ఉదాహరణకు, త్రివిక్రమ్ రాసిన ‘మన్మథుడు’లో చాలా భాగం యద్దనపూడి రాసిన ‘గిరిజా కళ్యాణం ‘అనే నవలలోదే. ఈ విషయాన్ని ఎక్కడా బయటకి చెప్పలేదు త్రివిక్రమ్.

ఇక యద్దనపూడి సులోచనారాణి రాసిన మీనా నవల నుంచి ‘అ..ఆ’ సినిమా చేశాడు త్రివిక్రమ్. ఆ వ్యవహారం పెద్ద వివాదం అయ్యాక, అందరూ త్రివిక్రమ్ పై విమర్శలు చేసాకా, అపుడు త్రివిక్రమ్ సినిమాలో యద్దనపూడి సులోచనారాణి పేరు వేశాడు. అయినా ఆవిడకి అభిమాని అని చాలాసార్లు చెప్పే త్రివిక్రమ్, సినిమాలో ఆమెకే క్రెడిట్‌ ఇవ్వడానికి ఆలోచించడం నిజంగా ఆశ్చర్యమే.

ఇక అరవింద సమేత కథ ఓ నవల ఆధారంగా తీసుకున్నాడు అని రాయలసీమకు చెందిన రచయిత ఆరోణలు చేశాడు. అయితే, త్రివిక్రమ్ ఆ ఆరోపణల పై కనీసం స్పందించలేదు. ఇక సూపర్ స్టార్ మహేష్ బాబుతో పాన్ ఇండియా సినిమా చేయడానికి త్రివిక్రమ్ ప్రస్తుతం కిందామీదా పడుతున్నాడు.

అయితే, ఈ సినిమా కథా చర్చలలో ఓ రచయిత పాల్గొన్నాడు. కొన్ని కారణాల కారణంగా ఆ రచయిత ఇప్పుడు సినిమా నుంచి తప్పుకున్నాడు. అయితే, అతని చెప్పిన కథతోనే త్రివిక్రమ్.. మహేష్ సినిమాకి స్క్రీన్ ప్లే రాసుకున్నాడు. కానీ ఇప్పుడు ఆ రచయితకు క్రెడిట్ ఇవ్వడానికి త్రివిక్రమ్ ఆలోచిస్తున్నాడు. మొత్తానికి చేసిన తప్పే మళ్లీ చేస్తున్నాడు అన్నమాట. త్రివిక్రమ్.. నీకు ఇది తగదయ్యా !