
Raja Singh Youtube Channel: రాజాసింగ్.. ఈ పేరు వినగానే మనకు గొర్తొచ్చేది గోషామహల్ ఎమ్మెల్యే. హిందువులంతా హిందూ టైగర్‌గా పిలుచుకునే రాజాసింగ్.. హిందువును ఎవరి విమర్శించినా, హిందూ దేవతలను ఎవరు దూషించినా సహించరు. ఇక మరో మతంపై విమర్శలు చేస్తుంటారు. ఈ క్రమంలో అనేక కేసులు కూడా రాజాసింగ్‌పై నమోదయ్యాయి. పలుమార్లు జైలుకు కూడా వెళ్లారు. పిడీయాక్ట్ పెట్టారు. అయినా రాజాసింగ్ మాత్రం హిందువుల విషయంలో తగ్గేదేలే అంటారు. తాజాగా ఎమ్మెల్యే రాజా సింగ్‌కు మరో షాక్ తగిలింది. ఆయనకు చెందిన ‘శ్రీరామ్ చానల్ తెలంగాణ’ యూట్యూబ్ చానెల్‌ను నిషేధించారు. వీడియో స్ట్రీమింగ్ సైట్ యూట్యూబ్‌లో ద్వేషపూరిత ప్రసంగాలు, వీడియోలను అప్‌లోడ్ చేస్తున్నారంటూ బ్యాన్ చేశారు. ఈ చానెల్‌కు 5.5 లక్షల మంది సబ్‌స్క్రైబర్లు నిషేధం సమయంలో ఛానెల్‌కు 5.5 లక్షల మంది సబ్‌స్క్రైబర్లు, వెయ్యి వీడియో పోస్టులు ఉన్నాయి.
ఆ చానెల్ వ్యవస్థాపకుడి ఫిర్యాదుతో..
రాజాసింగ్‌కు చెందిన యూట్యూబ్ చానెల్ నిషేధంపై ఆల్ట్ న్యూస్ సహ వ్యవస్థాపకుడు మహమ్మద్ జుబైర్ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. ద్వేషపూరిత ప్రసంగాలపై తాము ఫ్యాక్ట్ చెక్ చేసిన తర్వాత ఈ యూట్యూబ్ చానెల్ నిషేధానికి గురైందని పేర్కొన్నారు. మూడు నెలలపాటు చానెల్‌ను పర్యవేక్షించిన తర్వాత ఆల్ట్ న్యూస్ యూట్యూబ్‌కు లేఖ రాసిందని దాని రీసెర్చర్ కలీమ్ చెప్పారు. ఈ క్రమంలో చానెల్‌ను నిషేధించినట్లు వ్లెడించారు.
కేసులు నమోదు..
కాగా, ఇటీవల ఎమ్మెల్యే రాజా సింగ్‌పై ద్వేషపూరిత ప్రసంగాలు చేశారంటూ హైదరాబాద్ నగరంలో కేసులు నమోదయ్యాయి. శ్రీరామనవమి సందర్భంగా నిర్వహించిన శోభయాత్రలో రాజాసింగ్ ద్వేషపూరిత ప్రసంగం చేశారని పోలీసులు కేసు నమోదు చేశారు.
అయితే, తాను ఎలాంటి ద్వేషపూరిత వ్యాఖ్యలు చేయలేదని, ఉద్దేశపూర్వకంగానే తనపై కేసులు పెట్టి.. మరోసారి అరెస్ట్ చేయాలని ప్రయత్నిస్తున్నారని రాజాసింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ తర్వాత హనుమాన్ జయంతి సందర్భంగా నిర్వహించిన శోభయాత్రలో రాజాసింగ్ పాల్గొనేందుకు వెళుతుండగా ఆయనను పోలీసులు అరెస్ట్ చేసి.. ఆ తర్వాత విడిచిపెట్టారు. ర్యాలీలో విద్వేషపూరిత ప్రసంగం చేస్తారనే అలాచేశామని పోలీసులు తెలిపారు.

తాజాగా 5.5 లక్షల మంది సబ్‌స్క్రైబర్స్ ఉన్న యూట్యూబ్ చానెల్‌ను నిషేధం విధించడంతో రాజాసింగ్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి రాజాసింగ్ ఎలా స్పందిస్తారో చూడాలి.