
NTR- Allu Arha: నందమూరి హీరో ఎన్టీఆర్, హీరో అల్లు అర్జున్ గారాలపట్టి అల్లు అర్హలో కొన్ని కామన పాయింట్స్ ఉన్నాయి. అనుకోకుండా జరిగిన ఈ పరిణామం వైరల్ అవుతుంది. సినీ లవర్స్ విశేషంగా చెప్పుకుంటున్నారు. అవేమిటంటే.. వీరిద్దరూ ఒకే పాత్రతో నటులుగా మారారు. బాల భరతుడు పాత్రతో ఎన్టీఆర్, అల్లు అర్హ వెండితెర అరంగేట్రం జరగడం ఊహించని సంఘటన. 1991లో నందమూరి తారక రామారావు బ్రహ్మర్షి విశ్వామిత్ర టైటిల్ తో ఓ చిత్రం చేశారు. ఈ మూవీలో సీనియర్ ఎన్టీఆర్ విశ్వామిత్ర పాత్ర చేశారు. అంటే శకుంతల తండ్రిగా ఆయన నటించారు.
బ్రహ్మర్షి విశ్వామిత్రలో బాలకృష్ణ కీలక రోల్స్ చేయడం విశేషం. ఆయన దుష్యంతుడిగా అలరించారు. బాలయ్య ఈ మూవీలో రెండు పాత్రలు చేయడం విశేషం. ఆయన నారద మహర్షిగా కూడా నటించారు. కాగా ఈ చిత్రాన్ని హిందీలో విడుదల చేయాలని భావించారు. హిందీ వెర్షన్ లో బాల భరతుడు పాత్ర జూనియర్ ఎన్టీఆర్ చేశాడు. అప్పటికి పదేళ్ల లోపు బాలుడిగా ఉన్న జూనియర్ ఎన్టీఆర్ భరతుడు పాత్ర చేశాడు.
అయితే బ్రహ్మర్షి విశ్వామిత్ర హిందీ వెర్షన్ విడుదల కాలేదు. అయినప్పటికీ జూనియర్ ఎన్టీఆర్ నటుడిగా మొదట చేసిన పాత్ర భరతుడు. అనంతరం 1996లో బాల రామాయణం మూవీతో చైల్డ్ ఆర్టిస్ట్ గా పూర్తి స్థాయిలో పరిచయమయ్యాడు. ఈ చిత్రానికి గుణశేఖర్ దర్శకుడు. కాగా అల్లు అర్హ సైతం బాల భరతుడు పాత్రతోనే వెండితెరకు పరిచయమైంది. దర్శకుడు గుణశేఖర్ తెరకెక్కించిన శాకుంతలం మూవీలో అల్లు అర్హ బాల భరతుడు పాత్ర చేసింది.

ఏప్రిల్ 14న ఈ చిత్రం వరల్డ్ వైడ్ విడుదల చేశారు. అల్లు అర్హ నటనకు ప్రశంసలు దక్కుతున్నాయి. పసిప్రాయంలోనే ఆకట్టుకుందని ఆమెను కొనియాడుతున్నారు. కెరీర్ భరతుడు పాత్రతో మొదలుపెట్టడం ఎన్టీఆర్, అల్లు అర్హలలో ఉన్న ఒక కామన్ పాయింట్. మరొక కామన్ దర్శకుడు గుణశేఖర్. వీరిద్దరినీ ఇంట్రడ్యూస్ చేసింది ఆయనే. ఎన్టీఆర్ మొదటి సినిమా బ్రహ్మర్షి విశ్వామిత్ర అయినప్పటికీ అది విడుదల కాలేదు. బాల రామాయణం మూవీతో ఎన్టీఆర్ ని గుణశేఖర్ వెండితెరకు పరిచయం చేశారు. అల్లు అర్హను కూడా ఆయనే ఇంట్రడ్యూస్ చేశారు. ఇవి రెండు ఎన్టీఆర్, అల్లు అర్హలలోని కామన్ పాయింట్స్ అని చెప్పొచ్చు.