
రాజకీయాల్లో హత్యలుండవు.. ఆత్మహత్యలే ఉంటాయని చాలా గొప్ప సామెత ఉంది. ఇప్పుడు దాన్ని అక్షరాల నిజం చేసుకుంటున్నారు మన అగ్రహీరో, టీడీపీ ఎమ్మెల్యే బాలయ్య అని టీడీపీ వర్గాల్లో చర్చ జరుగుతోందట… 151మంది ఎమ్మెల్యేలతో గెలిచి అఖండ మెజార్టీ సాధించిన వైసీపీ అధినేత వైఎస్ జగన్ వచ్చే ఎన్నికల నాటికి మరింత బలంగా తయారవుతున్నాడు. ఆయనను ఆపడం ఒక్క చంద్రబాబుతో అయ్యే పని కాదు. లోకేష్ అంత బలంగా లేడు. ఈ క్రమంలోనే ప్రజా బలంతో కాకుండా ఈసారి ముహూర్తాలు, జాతకాలు, జ్యోతిష్యాలపై భారం వేసి టీడీపీని నడపాలని బాలయ్య తాజాగా చంద్రబాబుకు సలహా ఇచ్చాడట..
Also Read: హైకోర్టు న్యాయమూర్తులపై జగన్ సర్కార్ సంచలన వ్యాఖ్యలు..?
సాధారణంగా టీడీపీ రాజకీయాలకు దూరంగా సినిమాలు చేసుకుంటూ తన పని తాను చేసుకునే బాలయ్యకు చంద్రబాబు అమిత ప్రాధాన్యం ఇస్తుంటాడు. సాధారణంగా టీడీపీ పార్టీ రాజకీయాల్లో బాలయ్య పెద్దగా పట్టించుకోడు. తన సినిమాలు ఏవో తను చూసుకొని పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉంటాడు. పార్ట్ టైం పాలిటిక్స్ చేస్తారు. ఎప్పుడూ ఏ కోరిక కోరని బావమరిది బాలయ్య కోరితే మాత్రం చంద్రబాబు తప్పకుండా చేస్తాడట..తాజాగా బాలయ్య ఏపీ టీడీపీ రాష్ట్ర కమిటీ ప్రకటన ఇప్పుడే వద్దని చెప్పారట.. ఈ నెలలో మంచి రోజులు లేవని.. ఈనెల 18 తరువాత కమిటీపై ప్రకటన చేయాలని సూచించాడట.. జాతకాలు,. జ్యోతిష్యాలను బాగా నమ్మే బాలయ్య సూచనతో అసలే టైం బ్యాడ్ గా నడుస్తున్న చంద్రబాబు అందుకే వెనక్కి తగ్గాడని టాక్.
మంచి మూహూర్తం చూసుకొని ఏపీ టీడీపీ రాష్ట్ర కమిటీ ప్రకటన చేస్తారని సమాచారం. ప్రతిపక్షంలో ఉండడం.. జగన్ సర్కార్ టార్గెట్ చేసి వేధిస్తుండడం.. నాయకులు చేజారిపోతుండడంతో ఈసారి బాలయ్య సూచన ప్రకారం దేవుడిపై భారం వేసి నమ్మకాలపై ఆధారపడుతూ చంద్రబాబు ఈ రాష్ట్ర కమిటీని వాయిదా వేశాడని ఆ పార్టీలో ఒకటే గుసగుసలు సాగుతున్నాయి. బామ్మర్ధి బాలయ్య వల్లే బాబు కమిటీ ప్రకటన ఆపారని కథలు కథలుగా చెప్పుకుంటున్నారు.
ఏపీ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా అచ్చెన్నాయుడిని దాదాపు కన్ఫం చేసిన చంద్రబాబు చివరికి ఇన్ చార్జిల ప్రకటనతోనే సరిపెట్టారు. ఏపీ టీడీపీ కొత్త కమిటీ ప్రకటన ఎందుకు ఆగిందనేది ఎవ్వరికీ అంతుబట్టలేదు. అయితే ఈ టీడీపీ కమిటీల ప్రకటన బామ్మర్ధి బాలయ్య వల్లే ఆగిందనే ప్రచారం టీడీపీలో సాగుతోంది. బాలయ్య సూచనతోనే చంద్రబాబు వెనక్కి తగ్గారని ఒక టాక్ వినిపిస్తోంది.
Also Read: న్యాయవ్యవస్థతో జగన్ ఢీ.. మతలబేంటి? ఏం జరుగనుంది?
ఏపీ టీడీపీ పార్లమెంట్ నియోజకవర్గాల అధ్యక్షుల ప్రకటన పూర్తి చేసిన చంద్రబాబు రాష్ట్ర కమిటీ ప్రకటన మాత్రం రేపు మాపు అంటూ నాన్చుతున్నారు. చంద్రబాబు ప్రకటన చేయకపోవడానికి కారణం ఎమ్మెల్యే బాలయ్యనే అని టాక్ నడుస్తోంది.