హిందూపురంలోనూ అధికార పార్టీదే హవా : బాలయ్యా.. ఇది ఏందయా..!

ఏపీ పంచాయతీ పోరులో భాగంగా.. తుదిపంచాయతీ పోరు హిందూపురంలోనూ జరిగింది. అనంత‌పురం జిల్లా హిందూపురం నియోజ‌క‌వ‌ర్గం ఎందుకు అంత ప్రత్యేకమో అందరికీ తెలిసిందే. గ‌త ఎన్నిక‌ల్లో టీడీపీ ఆ జిల్లాలో నెగ్గిన రెండు నియోజ‌క‌వ‌ర్గాల్లో ఇది ఒక‌టి. ఇక్కడ నుంచి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడి బామ్మర్ది క‌మ్ వియ్యంకుడు, సినీ న‌టుడు బాల‌కృష్ణ మంచి మెజారిటీతోనే నెగ్గారు. Also Read: పంచాయతీ పోరులో తేలిన పార్టీ బలాబలాలు..: తిరుపతి సీటును బీజేపీ త్యాగం చేసేనా..! అయితే.. […]

Written By: Srinivas, Updated On : February 22, 2021 2:21 pm
Follow us on


ఏపీ పంచాయతీ పోరులో భాగంగా.. తుదిపంచాయతీ పోరు హిందూపురంలోనూ జరిగింది. అనంత‌పురం జిల్లా హిందూపురం నియోజ‌క‌వ‌ర్గం ఎందుకు అంత ప్రత్యేకమో అందరికీ తెలిసిందే. గ‌త ఎన్నిక‌ల్లో టీడీపీ ఆ జిల్లాలో నెగ్గిన రెండు నియోజ‌క‌వ‌ర్గాల్లో ఇది ఒక‌టి. ఇక్కడ నుంచి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడి బామ్మర్ది క‌మ్ వియ్యంకుడు, సినీ న‌టుడు బాల‌కృష్ణ మంచి మెజారిటీతోనే నెగ్గారు.

Also Read: పంచాయతీ పోరులో తేలిన పార్టీ బలాబలాలు..: తిరుపతి సీటును బీజేపీ త్యాగం చేసేనా..!

అయితే.. అసెంబ్లీ ఎన్నికల్లో మంచి మెజార్టీ ఇచ్చిన ప్రజలు మాత్రం పంచాయతీ ఎన్నిక‌ల్లో టీడీపీ క‌ళ్లు తేలేసిన ప‌రిస్థితి క‌నిపిస్తోంది. హిందూపురం జ‌నాలు త‌న‌కూ, త‌న ఫ్యామిలీకి రుణ‌ప‌డి త‌న‌ను గెలిపించాల్సిందే త‌ప్ప.. వారికి ట‌చ్‌లో ఉండ‌టానికి బాల‌కృష్ణ ఎప్పుడూ ప్రాధాన్యం ఇవ్వరు. ఆయ‌న పీఏలే అక్కడ రాజ్యం నడిపిస్తుంటారు. ఆయ‌న భార్యకు వ‌సూళ్ల బ్యాగులు అందుతుంటాయనేది టాక్‌. ఎన్నిక‌ల్లో పెట్టిన పెట్టుబ‌డిని నంద‌మూరి వ‌సుంధ‌ర రూపాయ‌ల‌తో లెక్కగ‌ట్టి మ‌రీ పీఏల ద్వారా రాబ‌డుతూ ఉంటార‌ని జ‌నంలో టాక్‌.

ఈ ప‌రిస్థితుల్లో పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో టీడీపీకి అక్కడ గ‌ట్టి ఝ‌ల‌క్ త‌గిలింది. ప‌ల్లెల్లో బీసీల్లో టీడీపీ అంటే అంతులేని అభిమానం. అయినా కూడా ప‌ల్లె పంచాయతీల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హ‌వా స్పష్టంగా క‌నిపించింది. హిందూపురంలో ఇక్బాల్‌ను ఇన్‌చార్జిగా పెట్టారు కానీ.. ఆయ‌న స్థానికేత‌రుడు అనే ఫీలింగ్‌ జనంలో కనిపించింది. స్థానికంగా ఉండే న‌వీన్ నిశ్చల్‌కు పార్టీ బాధ్యత‌లు ఇవ్వలేదు. దీంతో వైఎస్ఆర్సీపీ మ‌ద్దతుదారులే హవా నడిపించారు.

Also Read: ఏపీలో పంచాయతీ పోరు సక్సెస్..‘నిమ్మగడ్డ’ గెలిచినట్లేనా..?

హిందూపురం అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలోని 52 పంచాయ‌తీల‌కు గానూ.. 47 పంచాయ‌తీల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మ‌ద్దదారులే విజ‌యం సాధించారు. తెలుగుదేశం కేవ‌లం ఐదు పంచాయ‌తీల్లో మాత్రమే పైచేయి సాధించిందంటే ప‌రిస్థితిని అర్థం చేసుకోవ‌చ్చు. ప‌ల్లెల‌పై తెలుగుదేశం పార్టీ ప‌ట్టు పూర్తిగా చేజారిందనేందుకు హిందూపురం కూడా ఒక ఉదాహ‌ర‌ణ‌గా నిలుస్తోంది.

మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్