బాబుపై బాలయ్య అలక..: అందుకేనా..?

సింహంతో వేట.. బాలకృష్ణతో ఆట ఎవరికీ మంచిది కాదు. చాలా సందర్భాల్లో ఇది ఆయన చెప్పిన డైలాగే అనుకోండి. నందమూరి బాలకృష్ణ ఏం చేసినా సంచలనమే. ఒక్కో సైలెంట్‌ అయిపోయినా చర్చనీయాంశమే. హిందూపురం ఎమ్మెల్యేగా ఉన్న బాలయ్య తీరు ఇప్పుడు పార్టీలో కొత్త చర్చకు దారి తీసింది. అధినేతతో బాలయ్యకు గ్యాప్ పెరిగిందా..? అందుకే.. కీలక పొలిట్ బ్యూరో మీటింగ్ కు డుమ్మా కొట్టారా..? అసలు బాలయ్య మనసులో ఏముంది..? ఇదే ఇప్పుడు హాట్‌ టాపిక్‌ అయింది. […]

Written By: Srinivas, Updated On : January 8, 2021 3:08 pm
Follow us on


సింహంతో వేట.. బాలకృష్ణతో ఆట ఎవరికీ మంచిది కాదు. చాలా సందర్భాల్లో ఇది ఆయన చెప్పిన డైలాగే అనుకోండి. నందమూరి బాలకృష్ణ ఏం చేసినా సంచలనమే. ఒక్కో సైలెంట్‌ అయిపోయినా చర్చనీయాంశమే. హిందూపురం ఎమ్మెల్యేగా ఉన్న బాలయ్య తీరు ఇప్పుడు పార్టీలో కొత్త చర్చకు దారి తీసింది. అధినేతతో బాలయ్యకు గ్యాప్ పెరిగిందా..? అందుకే.. కీలక పొలిట్ బ్యూరో మీటింగ్ కు డుమ్మా కొట్టారా..? అసలు బాలయ్య మనసులో ఏముంది..? ఇదే ఇప్పుడు హాట్‌ టాపిక్‌ అయింది.

Also Read: పందెం రాయుళ్లకు హైకోర్టు షాక్‌

ఇటీవల చంద్రబాబు పార్టీ కమిటీలను ప్రకటించారు. ఇందులో బాలయ్యకు సైతం చోటు కల్పించారు. అప్పటి వరకు పార్టీలో ఎమ్మెల్యేగానే ఉన్న బాలకృష్ణను పొలిట్ బ్యూరోలోకి తీసుకున్నారు. అయితే.. పొలిట్ బ్యూరో సంఖ్యను అమాంతం 25కు పెంచడంతో దానికి ప్రాధాన్యం లేకుండా పోయింది. కొత్త వారికి పదవి వచ్చిందన్న ఆనందం అంతంత మాత్రంగానే ఉంది. ఇప్పటికే సభ్యులుగా ఉన్న వారు కీలక వ్యవస్థని పలుచన చేశారనే అభిప్రాయానికి వచ్చేశారు.

అయితే.. రెండు రోజుల క్రితం జరిగిన పొలిట్ బ్యూరో సమావేశానికి బాలయ్య డుమ్మా కొట్టారు. బాలయ్యని పొలిట్ బ్యూరోలోకి తీసుకున్న కారణంగానే ఇదే సామాజికవర్గం నుంచి ఇతర నేతలకు అవకాశం ఇవ్వలేకపోతున్నట్లు చంద్రబాబు పార్టీ నేతలకు చెప్పారు. కొందరు పొలిట్ బ్యూరోని ఆశించగా, బాలయ్య పేరుతో వారిని సైడ్‌ పంపించారు. పొలిట్ బ్యూరోలోకి బాలయ్యను తీసుకున్న తరువాత కూడా ఆయన అంత సంతృప్తిగా లేరనే వాదన వినిపిస్తోంది. పార్టీలో అతి కొద్ది మందితోనే మాట్లాడే బాలయ్య ఒకటి రెండు సందర్భాల్లో పార్టీ పోకడలు, అధిష్టానం వైఖరిపై తన అసంతృప్తిని వెళ్లగక్కారట.

Also Read: జగన్ లేఖ.. సుప్రీ జడ్జి వివరణ.. స్పందించిన సుప్రీంకోర్టు

అందుకే.. పొలిట్ బ్యూరో మీటింగ్‌కు బాలయ్య రాలేదని సమాచారం. దీనికి కరోనా పరిస్థితులు కారణమని చెప్పడానికి కూడా లేదు. రెగ్యులర్ గా బాలయ్య పార్టీ సమావేశాలకు వచ్చింది ఎప్పుడూ లేదు కానీ, కీలకమైన పొలిట్ బ్యూరోకు రాని బాలయ్య..ఇప్పుడు నియోజకవర్గ టూర్ పెట్టుకున్నారు. దీని వెనుక కారణం ఏంటిఆయన ఏం చెప్పాలనుకుంటున్నాడు అనేది ఇప్పుడు చర్చగా మారింది. హైదరాబాద్ లో ఉండి కూడా బాలయ్య పార్టీ కీలక సమావేశాలకు దూరంగా ఉన్నరన్న అభిప్రాయం పార్టీలో వ్యక్తమవుతోంది. మొత్తంగా బాలకృష్ణ అటు చంద్రబాబునాయుడితోపాటు ఇటు నారా లోకేష్ పైనా గుర్రుగా ఉన్నారనే టాక్ వినిపిస్తోంది.

మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్