https://oktelugu.com/

వారి ఆరోపణల్లో పస లేదట..!

తాము ఉన్నామని నిరూపించుకోవాలంటే.. ఎదుటోడి మీద ఆరోపణలు చేయాలి. సరిగా ఇప్పుడు ఏపీలో అదే జరుగుతోంది. ప్రతిపక్షంలో తాము ఉన్నామని చెప్పుకునేందుకు టీడీపీ శతవిధాలా ప్రయత్నిస్తూనే ఉంది. అంతేకాదు.. వైసీపీ సర్కార్‌‌పై లేనిపోని ఆరోపణలు చేస్తోంది. అయితే.. ఆ ఆరోపణలకు కనీసం తమ్ముళ్లకు కూడా క్లారిటీ లేకుండాపోతోంది. అదే ఇక్కడ వింతైనా విషయం. పసలేని ఆరోపణలతో తమ్ముళ్లు పరువు పోగొట్టుకుంటున్నారు. అయినా.. వారి అత్యుత్సాహం మాత్రం ఆగడం లేదు. Also Read: పందెం రాయుళ్లకు హైకోర్టు షాక్‌ […]

Written By:
  • Srinivas
  • , Updated On : January 8, 2021 / 02:39 PM IST
    Follow us on


    తాము ఉన్నామని నిరూపించుకోవాలంటే.. ఎదుటోడి మీద ఆరోపణలు చేయాలి. సరిగా ఇప్పుడు ఏపీలో అదే జరుగుతోంది. ప్రతిపక్షంలో తాము ఉన్నామని చెప్పుకునేందుకు టీడీపీ శతవిధాలా ప్రయత్నిస్తూనే ఉంది. అంతేకాదు.. వైసీపీ సర్కార్‌‌పై లేనిపోని ఆరోపణలు చేస్తోంది. అయితే.. ఆ ఆరోపణలకు కనీసం తమ్ముళ్లకు కూడా క్లారిటీ లేకుండాపోతోంది. అదే ఇక్కడ వింతైనా విషయం. పసలేని ఆరోపణలతో తమ్ముళ్లు పరువు పోగొట్టుకుంటున్నారు. అయినా.. వారి అత్యుత్సాహం మాత్రం ఆగడం లేదు.

    Also Read: పందెం రాయుళ్లకు హైకోర్టు షాక్‌

    మాజీ మంత్రులు అయ్యన్నపాత్రుడు బండారు సత్యనారాయణమూర్తి పూటకోసారి మీడియా ముందుకు వచ్చి జగన్ సర్కార్ మీద పెద్ద పెద్ద ఆరోపణలే చేస్తున్నారు. ఇళ్ల పట్టాల విషయంలో నానా రకాలైన డౌట్లు పెడుతున్నాయి. పట్టాలిచ్చారు. స్థలాలు ఎక్కడ చూపిస్తారు అని ఒక తమ్ముడు అంటే.. అసలు ఇదంతా అతి పెద్ద మోసం అని మరో నేత అంటాడు.

    అంతకుమించి మరో నాటకమని ఇంకో నేత చెబుతుంటాడు. కంటికి కనిపిస్తున్న పట్టాల పంపిణీని అంతా బూటకమని వాపోతారు. వీటి మీద కోర్టుకు వెళ్తామని మరో తమ్ముడు గర్జిస్తాడు. ఇంతకీ తెలుగుదేశం తమ్ముళ్లకు ఏం కావాలి అంటే మాత్రం ఎవరికీ క్లారిటీ ఉండదు. జగన్‌ ఇచ్చిన హామీలు నిలబెట్టుకుంటున్నందుకు పసుపు దండు తట్టుకోలేక పోతోందని అర్థమవుతోంది.

    Also Read: జగన్ లేఖ.. సుప్రీ జడ్జి వివరణ.. స్పందించిన సుప్రీంకోర్టు

    సరే చిన్న చిన్న స్థాయి లీడర్లు అలా మాట్లాడారంటే ఏదో ఉనికి కోసమని అనుకోవచ్చు. కానీ.. మాజీ మంత్రులు కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేస్తుండడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఓ మాజీ మంత్రి కాస్తా ముందుకు వచ్చి ఎవరికి జగనన్న..? ఎక్కడి జగనన్న ..? అంటూ బాగానే ఎకసెక్కమే ఆడుతున్నారు. మరి అన్న ఎన్టీయార్ అని అన్నపుడు, చంద్రన్న అని చంద్రబాబు బాకా ఊదినప్పుడు ఈ రకమైన డౌట్లు మాజీ మంత్రులకు, తమ్ముళ్లకు వచ్చి ఉంటే బాగుండేది అని వైసీపీ నేతలు గట్టిగానే కౌంటర్‌‌ ఇస్తున్నారు. ఏదిఏమైనా రాష్ట్రంలో తాము ఉన్నామని చెప్పుకునేందుకు తమ్ముళ్లు ఈ పస లేని ఆరోపణలు చేస్తున్నారని వైసీపీ నేతలు అంటున్నారు.

    మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్