Bandi Sanjay- KCR: కేసీఆర్‌ ని కట్టేసి బలగం సినిమా చూపించాలి. బండి సంజయ్‌ ఇదేం ర్యాగింగ్‌!

Bandi Sanjay- KCR: తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావును సరికొత్తగా ర్యాగింగ్‌ చేస్తున్నారు. కేసీఆర్‌కు బంధాలు, బంధుత్వాలు, విలువలు తెలియవని విమర్శిస్తున్నారు. అవి తెలియాలంటే ఆయనకు బలగం సినిమా చూపించాలని వారం రోజులుగా పదే పదే వ్యాఖ్యానిస్తున్నారు. తాజాగా కేసీఆర్‌ను కట్టేసి బలగం సినిమా చూపెట్టాలన్నారు. ఆ సినిమా చూస్తే అయినా కేసీఆర్‌కు పేదలు పడుతున్న ఇబ్బందులు తెలుస్తాయని పేర్కొన్నారు. తనను అరెస్టు చేసిన తీరుపై భావోద్వేగం.. ఇటీవల టెన్త్‌ హిందీ […]

Written By: Raj Shekar, Updated On : April 15, 2023 1:37 pm
Follow us on

Bandi Sanjay- KCR

Bandi Sanjay- KCR: తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావును సరికొత్తగా ర్యాగింగ్‌ చేస్తున్నారు. కేసీఆర్‌కు బంధాలు, బంధుత్వాలు, విలువలు తెలియవని విమర్శిస్తున్నారు. అవి తెలియాలంటే ఆయనకు బలగం సినిమా చూపించాలని వారం రోజులుగా పదే పదే వ్యాఖ్యానిస్తున్నారు. తాజాగా కేసీఆర్‌ను కట్టేసి బలగం సినిమా చూపెట్టాలన్నారు. ఆ సినిమా చూస్తే అయినా కేసీఆర్‌కు పేదలు పడుతున్న ఇబ్బందులు తెలుస్తాయని పేర్కొన్నారు.

తనను అరెస్టు చేసిన తీరుపై భావోద్వేగం..
ఇటీవల టెన్త్‌ హిందీ ప్రశ్నపత్రం బయటకు రావడానికి బండి సంజయ్‌ కారణమని ఆయనను రాత్రికి రాత్రి కరీంనగర్‌లోని ఆయన ఇంట్లో బలవంతంగా అరెస్ట్‌ చేశారు. ప్రివెంటివ్‌ అరెస్ట్‌ పేరుతో అదుపులోకి తీసుకుని తరలించారు. అయితే మరుసటి రోజు సంజయ్‌ అత్తగారి పదో రోజు కర్మ ఉందని చెప్పినా పోలీసులు వినలేదు. తన అత్త తనకు తల్లి తర్వాత తల్లి అని, ఆ విషయం చెప్పినా వినకుండా పోలీసులు అరెస్ట్‌ చేసిన తీరుబాధనిపించింని పేర్కొన్నారు. తాను రానందుకు పక్షి కూడా ముట్టలేదని తెలిపారు. బంధాల విలువ తెలిసి ఉంటే.. కేసీఆర్‌ తనను బలవంతంగా అరెస్ట్‌ చేయించేవారు కాదని విమర్శించారు.

సినిమా చూసిన సంజయ్‌..
జైలు నుంచి బెయిల్‌పై బయటకు వచ్చిన తర్వాత సంజయ్‌ బీజేపీ నేతలతో కలిసి బలగం సినిమా చూశారు. ఈ సందర్భగా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్‌ ఈ సినిమాను చూడాలని ఆయన అన్నారు. ఒకపక్క తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ను విమర్శిస్తూనే మరోపక్క బలగం సినిమా మీద బండి సంజయ్‌ ప్రశంసల వర్షం కురిపించారు. మనీ సంబంధాలు తప్ప మానవ సంబంధాలు లేని మూర్ఖుడు కేసీఆర్‌ అని విమర్శించారు. టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెyì ్డని కూడా కూతురు పెళ్లి రోజు, మా అత్తమ్మ పక్షి ముట్టే కార్యక్రమాలు జరగనీయకుండా ఇబ్బందికి గురి చేసిన నీచుడు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆయనకు బలగం సినిమా చూపిస్తే నైనా కనువిప్పు కలుగుతుందేమో అని కామెంట్లు చేశారు.

మానవ సంబంధాల విలువ తెలియాలి..
ముఖ్యమంత్రి కేసీఆర్‌కు మనీ బంధాలు తప్ప మానవ బంధాల గురించి తెలియదని సంజయ్‌ మరోమారు విమర్శించారు. అందుకే దేశవ్యాప్తంగా విపక్షాల ఎన్నికల ఖర్చు కూడా భరించడానికి ముందుకు వస్తున్నాడన్నారు. ముఖ్యమంత్రిగా ఉండి ప్రజల సమస్యలు కూడా తెలుసుకోలేరని విమర్శించారు. అక్రమంగా సంపాదించడం.. వాటితో ఎన్నికల్లో గెలవడం మాత్రమే కేసీఆర్‌కు తెలిసిన విద్య అన్నారు. ప్రజలను కన్న బిడ్డల్లా చూడాల్సిన ముఖ్యమంత్రి ఆ విషయాన్ని ఎప్పుడో మర్చిపోయాడని ఆరోపించారు. టీఎస్‌పీఎస్పీ ప్రశ్నపత్రం లీక్‌ కావడంతో 30 లక్షల మంది పిల్లలు తీవ్ర మనోవేదనకు గురయ్యారన్నారు. వారి తల్లిదండ్రులు తమ పిల్లల భవిష్యత్‌పై ఆందోళన చెందుతున్నారని తెలిపారు. బంధాల గురించి తెలిసి ఉంటే కేసీఆర్‌కు ఆ విషయం అర్థమయ్యేదని అన్నారు. పేపర్ల లీకేజీకి బాధ్యుడైన కేటీఆర్‌ను బర్తరఫ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు.

Bandi Sanjay- KCR

మొత్తంగా తన అత్తమ్మకు పక్షిముట్టే కార్యక్రమానికి తాను వెళ్లకుండా కేసీఆర్‌ అడ్డుకున్నారన్న విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో బండి సంజయ్‌ సక్సెస్‌ అయ్యారు. ఇప్పుడు అదే బంధాల గురించి కేసీఆర్‌ను ర్యాగింగ్‌ చేస్తున్నారు.