
బక్రీద్ పండుగను ప్రపంచవ్యాప్తంగా ముస్లింలు ఘనంగా జరుపుకుంటున్నారు. ఒకరినొకరు శుభాకాంక్షలు చెప్పుకుంటున్నారు. ఈ పండుగ ప్రత్యేకం మేకలు, గొర్రెలే. ఈ పండుగ నాడు ముస్లింలు అంతా వాటిని భారీగా కొనుగోలు చేసి విందు ఆరగిస్తారు.
బక్రీద్ సందర్భంగా బలమైన ధృడంగా ఉండే పొట్టేలులను కొనేందుకు ముస్లింలు పోటీపడుతుంటారు. తాజాగా యూపీ రాజధాని లక్నోలో రెండు చూడ ముచ్చటైన బలమైన పొట్టేలు మేకలు వేలానికి వచ్చాయి. ఇవి ఇతర మేకల కన్నా భిన్నంగా.. ధృఢంగా ఉన్నాయి. దీంతో ఓ వ్యక్తి ఏకంగా రూ.4.5 లక్షలు పెట్టి కొనుగోలు చేశాడు.
లక్నోలోని గోమతి నది దగ్గర ఓ మేకల మార్కెట్ లో అమ్మకానికి ఇవి రాగా ఈ భారీ ధర వచ్చాయి. ఒక మేక బరువు 170 కేజీలు కాగా.. మరో దాని బరువు 150 కేజీలు.. రెండేళ్ల వయసున్న వీటికి ప్రతిరోజు పిస్తా, బాదంపప్పు, జీడీపిప్పు, ఆల్కండ్స్, స్వీట్స్ వగైనా తినిపిస్తారట.. జ్యూసులు తాగిస్తారట.. రోజుకు వీటికి దాదాపు 600 ఖర్చు చేశారట..
ఇంత బాగా చూసుకొని ఖర్చుచేసినందుకు తాజాగా బక్రీద్ వేలంలో ఊహించని ధర వాటికి వచ్చింది. దేశంలోనే అత్యధిక ధరకు అమ్ముడు పోయిన పొట్టేళ్లుగా ఇవి ప్రసిద్ధి చెందాయి.