Badvel By poll: బద్వేలులో టీడీపీ ఓట్లు వైసీపీకే.. బీజేపీ, కాంగ్రెస్ కి డిపాజిట్ గల్లంతు.. కమలంకు 30 రెట్లు పెరిగిన ఓటింగ్

Badvel By poll Result: బద్వేలు ఉప ఎన్నికల్లో వైసీపీ అనుకున్నట్టే క్లీన్ స్వీప్ చేసేసింది. 90550 ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించింది. లక్ష ఓట్ల మెజార్టీ సాధించాలని సీఎం జగన్ ఆదేశించినా అంత వరకూ రాలేదు. పోలింగ్ తక్కువ కావడంతో వైసీపీ లక్ష ఓట్ల మెజార్టీ అందుకోలేదు. మొత్తం పోలైన ఓట్లలో వైసీపీ అభ్యర్థి డాక్టర్ సుధ ఏకంగా 76శాతం ఓట్లు సాధించడం విశేషం. 2019లో వైసీపీ అభ్యర్థి వెంటక సుబ్బయ్య సాధించిన మెజార్టీ […]

Written By: NARESH, Updated On : November 2, 2021 3:11 pm
Follow us on

Badvel By poll Result: బద్వేలు ఉప ఎన్నికల్లో వైసీపీ అనుకున్నట్టే క్లీన్ స్వీప్ చేసేసింది. 90550 ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించింది. లక్ష ఓట్ల మెజార్టీ సాధించాలని సీఎం జగన్ ఆదేశించినా అంత వరకూ రాలేదు. పోలింగ్ తక్కువ కావడంతో వైసీపీ లక్ష ఓట్ల మెజార్టీ అందుకోలేదు.

badvel-bypoll result

మొత్తం పోలైన ఓట్లలో వైసీపీ అభ్యర్థి డాక్టర్ సుధ ఏకంగా 76శాతం ఓట్లు సాధించడం విశేషం. 2019లో వైసీపీ అభ్యర్థి వెంటక సుబ్బయ్య సాధించిన మెజార్టీ కంటే ఈసారి ఆయన సతీమణి దాసరి సుధ రెండింతల మెజార్టీ సాధించారు. ఈ ఎన్నికల్లో వైసీపీకి 1,12,072 ఓట్లు, బీజేపీకి 21661 ఓట్లు పోలయ్యాయి. కాంగ్రెస్ కు కేవలం 6217 ఓట్లు దక్కగా.. నోటాకు ఏకంగా 3636 ఓట్లు వచ్చాయి.

బద్వేల్ ఉప ఎన్నికల్లో సరిపడా ఓట్లుపొందకపోవడంతో బీజేపీ, కాంగ్రెస్ లు డిపాజిట్ గల్లంతయ్యాయి. ఆ రేంజ్లో వైసీపీ ఓట్లు సాధించడం విశేషం. బద్వేలులో బీజేపీ, టీడీపీ, జనసేన కలిసినా డిపాజిట్ గల్లంతు కావడం గమనార్హం.

ప్రతీరౌండ్ లోనూ వైసీపీ మొదటి నుంచి ఆధిక్యత సాధించింది. ఇక్కడ గెలుపు ఖాయమని ముందు నుంచి వైసీపీ అంచనా వేసింది. మెజార్టీపైనే ప్రధానంగా వైసీపీ ఫోకస్ చేసింది. 2019లో 45వేల మెజార్టీకి రెట్టింపు సాధించింది.

బద్వేలు ఉప ఎన్నికల్లో చోటుచేసుకున్న సమీకరణాలు, పడిన ఓట్లను బట్టి ఏపీ రాజకీయాల్లో కొత్త సమీకరణాలు మొదలయ్యాయి. 2019లో బీజేపీ అభ్యర్థికి కేవలం 735 ఓట్లు పడ్డాయి. కాంగ్రెస్ కు 2337 ఓట్లు పోలయ్యాయి. ఇప్పుడు ఎన్నికల్లో టీడీపీ, జనసేన పోటీ చేయలేదు. వైసీపీ ఒంటరిగానే చేసింది. గత ఎన్నికల్లో టీడీపీ ఏకంగా 50748 ఓట్లు పోలయ్యాయి. ఈసారి టీడీపీ బరిలోకి దిగలేదు.

దీంతో వైసీపీ వ్యతిరేక ఓటు అయిన టీడీపీ ఓట్లను తమవైపు తిప్పుకునేందుకు బీజేపీ నేతలు ప్రయత్నించారు. పవన్ ఫ్యాన్స్ తోపాటు జనసేన మద్దతుదారుల ఓట్లు తమకే పడుతాయని ఆశించారు. సీఎం రమేశ్, ఆదినారాయణ రెడ్డి లాంటి బీజేపీ నేతలు కీలకంగా పనిచేసినా టీడీపీ ఓట్లు మొత్తం బీజేపీకి పడలేదు. ఇటువైపు టర్న్ కాలేదు. వైసీపీకే టీడీపీ ఓట్లు చాలా మరలాయని తెలుసత్తోంది. దాదాపు 20వేల ఓట్లు బీజేపీకి పడగా.. 30వేల ఓట్లు వైసీపీకి మరలాయని అర్థమవుతోంది.

టీడీపీ ఓట్లు పూర్తిగా బద్వేలులో బీజేపీకి బదిలీ కాలేదన్న విషయం వెల్లడైంది. వైసీపీకి టీడీపీ ఓట్లు పడడమే ఇక్కడ సంచలనమైంది. ప్రభుత్వ సంక్షేమ పథకాలే ఇక్కడ వైసీపీ వైపు టీడీపీ ఓట్లు పడేలా చేశాయా? లేక ఆప్షన్ లేకపోవడంతో బీజేపీ బదులు వైసీపీకి వేశారా? అన్నది తేలాల్సి ఉంది. టీడీపీ, జనసేన ఓట్లు కనుక బీజేపీకే పడి ఉంటే వచ్చేసారి వీరి ముగ్గురు మధ్యపొత్తు పొడిచేది.

అయితే 700 ఓట్ల నుంచి 22వేల ఓట్ల వరకూ బీజేపీ ఎదిగిందంటే దాదాపు  30 రెట్లు ఎక్కువగానే ఓట్లు సంపాదించి సత్తా చాటినట్టే. ఏపీలో కనుక బీజేపీ, జనసేన, టీడీపీ కలిస్తే ఖచ్చితంగా వైసీపీ ఓటు బ్యాంకును కొల్లగొట్టొచ్చు అని బద్వేలు ఉప ఎన్నికల ద్వారా అర్తమవుతోంది.