India Vs Australia Adelaide Test: చరిత్రలో కొన్ని రోజులను మరపురాని రోజులు గా గుర్తుపెట్టుకుంటూ ఉంటాం ఎందుకంటే ఆరోజున మనకు మంచి జరిగితే ఆ రోజులను ఎప్పటికీ సంతోషంగా గుర్తు పెట్టుకుంటూ ఉంటాం. అదే మనకు బాధ కలిగినట్లయితే ఆ రోజున జరిగిన బాధకి కారణమేంటో తెలుసుకొని మరి అలాంటివి చేయకుండా ఉండడం కోసమైనా ఆ రోజులను మరోసారి గుర్తుపెట్టుకుంటు ఉంటాం…ఇక ఇండియన్ టీమ్ కి కూడా ఇదే పరిస్థితి నెలకొంది. గత రెండు సంవత్సరాల క్రితం డిసెంబర్19వ తేదీన ఆస్ట్రేలియా చేతిలో ఇండియన్ టీమ్ భారీ అవమానాన్ని పొందింది. కేవలం 36 పరుగులకే ఆల్ ఔట్ అయిన ఇండియన్ టీమ్ కి ఇదొక చేదు అనుభవమనే చెప్పాలి.
అడిలైడ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన ఈ మ్యాచ్ లో భారత్ సెకండ్ ఇన్నింగ్స్ లో కేవలం 36 పరుగులు మాత్రమే చేసి ఆల్ ఔట్ అయి అందర్నీ ఆశ్చర్యపరిచింది. మొదటి ఇన్నింగ్స్ లో 244 పరుగులు చేసిన ఇండియన్ టీమ్ సెకండ్ ఇన్నింగ్స్ లో మాత్రం 36 పరుగులకే ఆల్ అవుట్ అయి చతికల పడిపోయింది. ఇక దాంతో ఆస్ట్రేలియా మొదటి ఇన్నింగ్స్ లో 191 పరుగులు చేసింది. రెండో ఇన్నింగ్స్ లో 2 వికెట్లు కోల్పోయి 193 పరుగులను చేసి ఎనిమిది వికెట్ల తేడాతో భారీ విజయాన్ని అందుకుంది…
ఇక ఆ టెస్ట్ మ్యాచ్ లో ఇండియా ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. అయినప్పటికీ ఆ తర్వాత మ్యాచ్ ల్లో పుంజుకొని విజయం సాధించి ఈ సిరీస్ ని ఇండియా 2-1 తేడాతో కైవసం చేసుకుంది…మొత్తానికి ఆ తర్వాత మ్యాచ్ ల్లో ఆస్ట్రేలియా టీమ్ బౌలర్లకు మన ప్లేయర్లు చుక్కలు చూపించారు. ఇక ఇండియన్ టీమ్ టీమ్ ఘోరం గా ఓడించినందుకు ఆస్ట్రేలియా టీమ్ పైన ఇండియన్ ప్లేయర్లు రివెంజ్ తీర్చుకున్నారు…ఇక అదే రీతిలో ప్రస్తుతం ఇండియన్ టీం సౌతాఫ్రికా తో ఆడుతున్న మ్యాచ్ లో కూడా మంచి విజయాలను నమోదు చేసుకుంటూ వస్తుంది.
ఇక రెండేళ్ల కిందట డిసెంబర్ 19వ తేదీన ఎదురైన ఆ చేదు అనుభవాన్ని గుర్తు చేసుకుంటూ మరొకసారి ఇలాంటి రోజు రాకూడదనే ఉద్దేశ్యంతోనే ఈ రోజును మర్చిపోకుండా ఇండియన్ అభిమానులు అందరూ గుర్తుంచుకుంటున్నారు. ఇక ఈరోజు సౌతాఫ్రికా తో సెకండ్ వన్డే ఆడబోతున్న ఇండియన్ టీమ్ ఈ వన్డే లో కనక విజయం సాధించినట్లయితే వన్డే సిరీస్ కూడా ఇండియా సొంతం అవుతుంది. చూడాలి మరి ఈ రోజు ఏం జరుగుతుంది అనేది…