Pallavi Prashanth: రైతుబిడ్డ ట్యాగ్ తో బిగ్ బాస్ హౌస్లో అడుగుపెట్టాడు పల్లవి ప్రశాంత్. అనూహ్యంగా టైటిల్ విన్నర్ అయ్యాడు. బిగ్ బాస్ షోకి వెళితే చాలు అనుకున్న ఈ కామనర్ అందరి అంచనాలు తలకిందులు చేశాడు. వెండితెర, బుల్లితెర స్టార్స్ కి షాక్ ఇస్తూ టైటిల్ కైవశం చేసుకున్నాడు. విజయంతో పాటు విమర్శలు పల్లవి ప్రశాంత్ ని చుట్టుముడుతున్నాయి. ప్రశాంత్ ఫ్యాన్స్ ఫినాలే రోజు అన్నపూర్ణ స్టూడియో ముందు హంగామా చేశారు. అమర్ దీప్, గీతూ రాయల్, అశ్వినిశ్రీ కార్లను ధ్వంసం చేశారు.
అలాగే ఆరు ఆర్టీసి బస్సుల అద్దాలు పగలగొట్టారు. పల్లవి ప్రశాంత్ సైతం పోలీసుల సూచనలు పాంటించకుండా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం తెచ్చాడు. దీంతో పలు సెక్షన్ క్రింద అతని మీద కేసులు పెట్టారు. పల్లవి ప్రశాంత్ అరెస్ట్ అవుతాడని ప్రచారం జరుగుతుంది. ఇదిలా ఉంటే మరో విషయంలో పల్లవి ప్రశాంత్ విమర్శలు ఎదుర్కొంటున్నాడు. పల్లవి ప్రశాంత్ కి నాగార్జున రెండు మొక్కలు ఇచ్చాడు. ఇంట్లోకి వెళ్లబోయే ముందు ఒక మొక్క ఇచ్చి జాగ్రత్తగా చూసుకో అన్నాడు.
ఆ మొక్క గురించి ప్రశాంత్ పట్టించుకోలేదు. అది చనిపోయింది. దాంతో నాగార్జున సీరియస్ అయ్యాడు. మరో మొక్క ఇచ్చిన నాగార్జున కనీసం దాన్నైనా జాగ్రత్తగా పెంచు అన్నాడు. ప్రశాంత్ ఆ మొక్కకు రోజూ ఉదయాన్నే దండం పెట్టేవాడు. కాగా నాగార్జున ఇచ్చిన ఆ మొక్కను పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ హౌస్లోనే వదిలేశాడట. దాంతో సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. నువ్వు నిజంగా రైతు బిడ్డవు అయితే ఆ మొక్కను ఎలా మర్చిపోయావని కౌంటర్స్ వేస్తున్నారు.
ఆ విషయం అటుంచితే పల్లవి ప్రశాంత్ టైటిల్ విన్నర్ గా భారీగానే ఆర్జించాడు. అతడికి ప్రైజ్ మనీ రూపంలో రూ. 35 లక్షలు ఇచ్చారు. మరో రూ. 15 లక్షల విలువైన డైమండ్ నెక్లెస్, ఒక కారు గిఫ్ట్ గా ఇచ్చారు. పల్లవి ప్రశాంత్ రెమ్యూనరేషన్ వారానికి రూ. 1 అని సమాచారం. అలా మరో రూ. 15 లక్షలు పొందాడు. అయితే బిగ్ బాస్ షోలో టైటిల్ కొడితే ఆ డబ్బులు పేద రైతులకు ఖర్చు చేస్తానని పల్లవి ప్రశాంత్ చెప్పిన విషయం తెలిసిందే…