
AP High Court: ఆంధ్రప్రదేశ్ లో ప్రజాస్వామ్యం అపహాస్యం పాలవుతోంది. వ్యవస్థ వైసీపీ, పోలీసుల చేతిలో కీలు బొమ్మగా మారుతోంది. అధికార పార్టీ కనుసన్నల్లో నలిగిపోతోంది. కానీ ఇంత దుర్మార్గమైన తీరుపై చంద్రబాబు మండిపడుతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కుప్పంలో ప్రతిపక్ష పార్టీని నిలువరించే క్రమంలో టీడీపీని దెబ్బతీయాలని భావిస్తోంది. ఇందులో భాగంగా డీఎస్పీ చేత లేఖ ఇప్పించి టీడీపీ ప్రచారాన్ని అడ్డుకోవాలని చూస్తోంది.
దీనిపై టీడీపీ అధినేత చంద్రబాబు హైకోర్టును(AP High Court) ఆశ్రయించారు. టీడీపీపై ఆంక్షలు విధించడంలో డీఎస్పీకి ఏం అధికారం ఉందని ప్రశ్నించారు. దీంతో హైకోర్టు కూడా తీవ్రంగా స్పందించింది. టీడీపీ ప్రచారానికి ఎందుకు మోకాలడ్డుతున్నారని ఆక్షేపించింది. కుప్పంలో టీడీపీపై ఎందుకు అడ్డం పడుతున్నారని అడిగింది. అధికార పార్టీ విధానాలు పాటించి శిక్షార్హులవుతున్నారని తెలిపింది.
కుప్పం మున్సిపాలిటీలో ప్రచారం చేసుకునేందుకు టీడీపీకి డీఎస్పీ జారీ చేసిన ఆంక్షలు కలకలం రేపాయి. ప్రజాస్వామ్య ప్రభుత్వంలో పార్టీల ప్రచారానికి పోలీసుల అనుమతి ఎందుకని అడిగింది. దీంతో పోలీసుల తీరు మరోమారు చర్చనీయాంశం అవుతోంది. అధికార పార్టీకి తలొగ్గి నిర్ణయాలు తీసుకోవడంలో పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.
పలమనేరు డీఎస్పీ జారీ చేసిన నోటీసులపై హైకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. టీడీపీ నేతలు పులివర్తి నాని, అమర్నాథ్ రెడ్డి, నిమ్మల రామానాయుడు, మునిరత్నం ఎన్నికల ప్రచారం ఆపొద్దని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఎన్నికల ప్రచారానికి మార్గం సుగమం అయింది. టీడీపీకి హైకోర్టులో ఊరట లభించడంతో అధికార పార్టీ వైసీపీకి మరో దెబ్బ తగిలింది. ప్రజాస్వామ్యం అపహాస్యం కాకుండా కాపాడింది.
Also Read: వైసీపీ మండలి రద్దుకు కట్టుబడి ఉందా?