Homeఎంటర్టైన్మెంట్Upasana: సమంతది నిజమైన ప్రేమ అంటోన్న ఉపాసన!

Upasana: సమంతది నిజమైన ప్రేమ అంటోన్న ఉపాసన!

Upasana: సమంతకు తెలిసిన వాళ్లు ఎంతో మంది ఉన్నప్పటికీ.. సన్నిహితులుగా కొంతమంది మాత్రమే ఉంటారు. కాగా, మెగా పవర్​స్టార్​ రామ్​చరణ్​ భార్య ఉపాసన- సమంతల స్నేహం గురించి అందరికీ తెలిసిందే. ఫిట్​నెస్​, ఆరోగ్యం, మహిళా శక్తి వంటి ఎన్నో విషయాల్లో వీరిద్దరూ కలిసి పనిచేశారు. ఇద్దరిని పక్కపక్కన చూస్తే.. ఆలోచనలు ఒకేలా కనిపిస్తాయి. ఈ క్రమంలోనే ఉపాసన- సామ్​కు మధ్య మంచి స్నేహం ఎర్పడింది. గతంలో ఉపాసన సొంత వెబ్​సైట్​ అయిన యువర్ లైఫ్​.కో.ఇన్​కు సామ్​ గెస్ట్​ ఎడిటర్​గా వ్యవహరించారు. ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఉపాసన.. సమంతపై తనకున్న అభిప్రాయంపై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

upasana-latest-comments-on-samantha

తాను తెలంగాణలో పుట్టిన అమ్మాయినని. దసరా వంటి పండుగల సమయంలోనూ మాంసం తినడం తనకు ఇష్టమని అన్నారు. అయితే, సామ్​ ఆర్టికల్స్ ఎడిట్​ చేసిన తర్వాత మాంసం తినడం చాలా వరకు తగ్గించినట్లు తెలిపారు. సమంతలో సాయం చేసే గుణం ఉందని అన్నారు. ఎన్నో విషయాల్లో తనకు సామ్​ అండగా నిలిచిందని అన్నారు.  సమంతది నిజమైన ప్రేమ అని చెప్పింది ఉపాసన. ప్రస్తుతం ఉపాసన వ్యాఖ్యలు నెట్టింట వైరల్​గా మారాయి.

కాగా, ఇటీవల సామ్​- చైతన్య విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఇరువురు ఎవరి లైఫ్​లో వారు ముందడుగు వేశారు. ప్రస్తుతం థాంక్యూ సినిమా షూటింగ్​లో చైతన్య ఫుల్​ బిజీగా గడుపుతున్నారు. మరోవైపు, సామ్ కూడా సినిమా, వెబ్​సిరీస్​లతో కెరీర్​లో దూసుకెళ్తోంది.

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
Exit mobile version