ఎన్టీఆర్ కు వెన్నుపోటు: చంద్రబాబు నివాళియే సూపర్

ఈరోజు దివంగత ఎన్టీఆర్ జయంతి. తెలుగు జాతి గర్వించదగిన నటుడు, రాజకీయ నాయకుడిగా చెరగని ముద్రవేసిన సీనియర్ ఎన్టీఆర్ ను అందరూ తలుచుకుంటున్నారు. అయితే ఆయన చనిపోవడానికి పరోక్ష కారణమైన చంద్రబాబు తన పిల్లనిచ్చిన మామను ఓన్ చేసుకోవడమే ఆయన ప్రత్యర్థులను జీర్ణించుకోనివ్వడం లేదు. తాజాగా టీడీపీ వ్యవస్తాపకుడు అయిన ఎన్టీఆర్ ను చంద్రబాబు ఆయన జయంతి సందర్భంగా హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ లో నివాళులర్పించి తలుచుకున్నారు. ఎన్టీఆర్ జీవితం భావితరాలకు దిక్సూచి అని చంద్రబాబు […]

Written By: NARESH, Updated On : May 28, 2021 4:22 pm
Follow us on

ఈరోజు దివంగత ఎన్టీఆర్ జయంతి. తెలుగు జాతి గర్వించదగిన నటుడు, రాజకీయ నాయకుడిగా చెరగని ముద్రవేసిన సీనియర్ ఎన్టీఆర్ ను అందరూ తలుచుకుంటున్నారు. అయితే ఆయన చనిపోవడానికి పరోక్ష కారణమైన చంద్రబాబు తన పిల్లనిచ్చిన మామను ఓన్ చేసుకోవడమే ఆయన ప్రత్యర్థులను జీర్ణించుకోనివ్వడం లేదు.

తాజాగా టీడీపీ వ్యవస్తాపకుడు అయిన ఎన్టీఆర్ ను చంద్రబాబు ఆయన జయంతి సందర్భంగా హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ లో నివాళులర్పించి తలుచుకున్నారు. ఎన్టీఆర్ జీవితం భావితరాలకు దిక్సూచి అని చంద్రబాబు కొనియాడారు. ఎన్టీఆర్ తెలుగు ప్రజల ఆస్తి, వారసత్వమన్నారు. ప్రజలకు ఏం కావాలో అదే చేసిన గొప్ప నేత అన్నారు.

ఇక చంద్రబాబు ట్వీట్ చేసి మహనీయుడు ఎన్టీఆర్.. ఆదర్శాలు, ఆశయాలు, ప్రజా సేవలో స్ఫూర్తిని పొందామని గొప్ప వ్యాఖ్యలు చేశారు. రాజీపడకుండా ముందుకెళ్లిన గొప్ప వ్యక్తి ఎన్టీఆర్ అని చంద్రబాబు అన్నారు. ఆయన స్ఫూర్తిని కొనసాగించకుండా గద్దెదించింది అందుకేనా బాబు అని వైసీపీ నేతలు బాబు ట్వీట్ కు అప్పుడే కౌంటర్లు మొదలుపెట్టారు.

చంద్రబాబు, లోకేష్, ఎల్ రమణ ఇలా ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచి ఆయనను పదవీచిత్యూడిని చేసి గుండెపోటుకు పరోక్షంగా కారణమైన వారంతా కూడా ఎన్టీఆర్ ఘాట్ లో ఆయనకు నివాళులర్పించడం విశేషం. తిలాపాపం.. తలా పిడికెడు అన్నట్టు నాడు ఎన్టీఆర్ ను దించేసిన వారంతా ఇప్పుడు ఆయన జయంతికి నివాళులర్ిపంచడమే ఇక్కడ విచిత్రంగా ఉందని సగటు ఎన్టీఆర్ అభిమానులు బాధపడుతున్నారు.