రఘురామ కృష్ణం రాజు కేసులో సీఐడీ వక్రభాష్యం చెప్పేందుకే నిర్ణయించుకుంది. ఇందులో భాగంగా ఆయనపై ఎలాంటి గాయాలు చేయలేదని బుకాయిస్తోంది. ఆర్మీ ఆస్పత్రిలో చేయించిన పరీక్షల్లో కాళ్లకు గాయాలయ్యాయని తేలింది. దీనికి సంబంధించిన రిపోర్టులు కూడా వచ్చాయి. ఈనేపథ్యంలో ఆయన ఢిల్లీలోని ఎయిమ్స్ లో చేరింది కూడా కాలి గాయాలు తగ్గించుకోవడానికే అని తెలుస్తోంది. దీంతో రఘురామ వ్యవహారంలో గాయాల విషయం హాట్ టాపిక్ గా మారింది.
ప్ర్తస్తుతం సీఐడీ కొత్త వాదన వినిపిస్తోంది. రఘురామ కాళ్లకు గాయాలు ఉన్నాయని ఆర్మీ ఆస్పత్రి నివేదికలో చెప్పలేదని సూచించింది. సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చిన నాలుగు రో జుల తరువాత అధ్యయనం చేయడానికి సమయం తీసుకున్నారో లేక గాయాలున్నాయని, అవి పోలీస్ కస్టడీలోనే అయ్యాయని ఆర్మీ ఆస్పత్రి తేల్చలేదని కొత్త వాదన మీడియా ముందుకు తెస్తోంది. ఆర్మీఆస్పత్రి నివేదిక సుప్రీంకోర్టులో సమర్పించారు. సుప్రీంకోర్టు ఇరుపక్షాల లాయర్లకు ఇచ్చింది.
రఘురామను హింసించిన అంశంపై సీబీఐ విచారణ కోసం పిటిషన్ విచారణలో ఉంది. సుప్రీంకోర్టు కేంద్రంతోపాటు సీబీఐకి నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో సీబీఐ విచారణ ఖాయమన్న విషయం తెలియడంతో సీఐడీ అధికారులు కంగారు పడుతున్నారు. ఆర్మీ ఆస్పత్రి కొట్టినట్లు నివేదిక ఇవ్వలేదని బుకాయిస్తోంది. గుంటూరు ఆస్పత్రి నివేదికను సీఐడీ ప్రముఖంగా ప్రస్తావిస్తోంది. అది ఫేక్ రిపోర్టు అని పత్రికలు చెబుతున్నాయి. ఈ పరిణామాలతో సీఐడీ ఉక్కిరిబిక్కిరి అవుతున్నట్లు తెలుస్తోంది.
రఘురామ వ్యవహారంలో సీఐడీ సాక్షాలను తారుమారు చేయాలని చూస్తో ంది. దీంతో పలు సంఘాలు సైతం సీఐడీ అబద్ధాలు చె బుతోందని చెబుతున్నాయి. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సీబీఐ విచారణ చేపట్టాలనే డిమాండ్ పె రుగుతోంది. రఘురామ విషయంలో భవిష్యత్ లో ఏం జరుగుతుందో వేచి చూడాల్సిందే