Monkeypox: దేశంలో కరోనా రక్కసి విజృంభించిన నేపథ్యంలో కొత్త రకం వ్యాధులు పుట్టుకొస్తున్నాయి. ఇందులో జికా వైరస్, మంకీపాక్స్ వంటివి ప్రజలను భయపెడుతున్నాయి. మంకీపాక్స్ ఇప్పటికే యాభైకి పైగా దేశాల్లో దడ పుట్టిస్తోంది. ప్రస్తుతం విజయవాడలో ఓ కేసు అనుమానాస్పదంగా అనిపిస్తోంది. దుబాయ్ నుంచి వచ్చిన ఓ రెండేళ్ల చిన్నారికి ఈ వైరస్ లక్షణాలు కనిపించడంతో విజయవాడ పాత ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. కానీ వివరాలు బయటకు చెప్పడం లేదు. దీంతో ప్రజల్లో భయాందోళన నెలకొంది.

ఇప్పటికే కేరళలో మంకీపాక్స్ కేసు వెలుగు చూడటంతో కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. జ్వర పీడితుల వద్దకు ఎట్టి పరిస్థితుల్లో కూడా వెళ్లరాదని సూచించింది. లేనిపోని వైరస్ లు అంటిపెట్టుకుని ఇతరులను ఇబ్బందులకు గురి చేసే విధంగా ప్రవర్తించరాదని తెలిపింది. ఈ నేపథ్యంలో విజయవాడ కేసు అందరిలో భయం కలిగిస్తోంది. మంకీపాక్స్ అయితే ఎలా అనే ఉద్దేశంతో వారి కుటుంబసభ్యులకు కూడా పరీక్షలు నిర్వహించారు. నమూనాలను పుణె ల్యాబ్ కు పంపించారు. నివేదిక వస్తేనే వ్యాధి ఏమిటని తెలిసే అవకాశం ఉంది. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో భయాందోళనలు రేగుతున్నాయి. ప్రశాంతమైన ప్రాంతాల్లో మంకీపాక్స్ వణికిస్తోంది.
Also Read: Jansena Chief Pawan Kalyan: వైసీపీ గెలిచే ఛాన్స్ ఇవ్వం.. .జనసేనాని పవన్ హాట్ హాట్ కామెంట్లు..
ఇతర దేశాలకు వెళ్లి వచ్చే వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు. వారికి ఏవైనా అనారోగ్య లక్షణాలు ఉంటే తక్షణమే పరీక్షలు చేయించుకుని ఏవైనా అనుమానాలు ఉంటే నివృత్తి చేసుకోవాలని సూచిస్తున్నారు. ఇతర దేశాలకు వెళ్లి వచ్చిన వారిలో చర్మ సంబంధమైన రుగ్మతలు కనిపిస్తే అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు. జ్వరంతో పాటు ఇతర లక్షణాలు ఉంటే ఉపేక్షించొద్దని తెలుస్తోంది. దగ్గరలోని ఆస్పత్రికి వెళ్లి వైద్య పరీక్షలు చేయించుకుని వ్యాధి నిర్ధారణ చేసుకుని తగిన మందులు వాడాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

విజయవాడలో వెలుగు చూసిన కేసు మంకీపాక్స్ అయితే అందరు అప్రమత్తం కావాల్సిందే. మంకీపాక్స్ కూడా వేగంగా విస్తరిస్తోన్నా ఇంతవరకు ఒకరు చనిపోవడం తెలిసిందే. ప్రాణనష్టం లేకున్నా వేగంగా విస్తరించడంతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. విజయవాడలో రోగ లక్షణాలు ఉన్న వారి కుటుంబ సభ్యులు నమూనాలు కూడా సేకరించారు. మొత్తానికి రిపోర్టు వస్తే గానీ ఏం చెప్పలేమని వైద్యులు చెబుతున్నారు. మంకీపాక్స్ నగరంలో కలకలం రేపుతోంది. వైద్యులు గోప్యంగా ఉంచుతున్నా సమాచారం మాత్రం వేగంగా విస్తరిస్తోంది. దీనిపై ప్రజలు జాగ్రత్తగా ఉండాలని తెలుస్తోంది.
Also Read:GST Rate Hike: మోడీ సార్ ‘జీఎస్టీ’ బాదుడు.. రేపటి వీటి ధర భారీగా పెంపు