https://oktelugu.com/

బాబును కూల్చింది.. ‘ఇసుక’ తుఫాన్‌ రాకుండా జగన్‌ చర్యలు

కర్ణుడి చావుకి ఎన్ని కారణాలో.. ఏపీలో చంద్రబాబు ఓటమికి సవాలక్ష కారణాలు చెబుతుంటారు రాజకీయ నిపుణులు. ప్రజల దెబ్బకు టీడీపీ గవర్నమెంట్‌ కాస్త ‘ఇసుక’ తుఫానులో కొట్టుకుపోయింది. అవును.. తెలుగుదేశం పార్టీ ఓడిపోవడానికి ఇసుక రాజకీయం కూడా ఓ కారణమట. అందుకే.. ఆ అంశం తనను ఇబ్బంది తేకూడదని జాగ్రత్తపడ్డారు ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్. మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్ టీడీపీ హయాంలో ఉచిత ఇసుక అని చెప్పి తెచ్చిన రచ్చ […]

Written By:
  • NARESH
  • , Updated On : November 6, 2020 / 02:38 PM IST
    Follow us on

    కర్ణుడి చావుకి ఎన్ని కారణాలో.. ఏపీలో చంద్రబాబు ఓటమికి సవాలక్ష కారణాలు చెబుతుంటారు రాజకీయ నిపుణులు. ప్రజల దెబ్బకు టీడీపీ గవర్నమెంట్‌ కాస్త ‘ఇసుక’ తుఫానులో కొట్టుకుపోయింది. అవును.. తెలుగుదేశం పార్టీ ఓడిపోవడానికి ఇసుక రాజకీయం కూడా ఓ కారణమట. అందుకే.. ఆ అంశం తనను ఇబ్బంది తేకూడదని జాగ్రత్తపడ్డారు ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్.

    మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్

    టీడీపీ హయాంలో ఉచిత ఇసుక అని చెప్పి తెచ్చిన రచ్చ అంతా ఇంతా కాదు. ఈ విషయాలు తన దృష్టికి వచ్చినా చంద్రబాబు చూసీ చూడనట్లు వదిలేశారు తప్ప ఏ చర్యలకూ దిగలేదు. ఫలితంగా 2019 ఎన్నికల్లో ఇసుక తుఫానే బాబుని ఎగరేసుకుపోవాల్సి వచ్చింది. అయితే ఈ విషయంలో మొదట్లో కాస్త విమర్శలు వచ్చినప్పటికీ.. ఇప్పుడు జగన్ తేరుకున్నారు. జాగ్రత్తలు తీసుకున్నారు. ఫలితంగా ఏపీలో కొత్త ఇసుక పాలసీని తీసుకొచ్చారు.

    Also Read: ఆదాయం పెంచుకునేందుకు ఏపీ సర్కార్‌‌ కొత్త ‘దారులు’

    నాటి పరిస్థితులను బేరీజు వేసుకున్న జగన్‌.. ఇప్పుడు ఇసుక పాలసీలో దిద్దుబాటు చర్యలకు దిగారు. ఇకనుంచి రీచ్‌ నుంచి స్టాక్‌ పాయింట్‌కు.. అక్కడి నుంచి ప్రజలకు రవాణా చేసే క్లిష్టతరమైన విధానానికి స్వస్తి చెప్పాలని నిర్ణయించారట. అంతేకాదు.. ట‌న్ను ఇసుక రూ.475కు మించ‌కూడ‌ద‌నే గొప్ప నిర్ణయం కూడా చేశారు.

    Also Read: రాజకీయ అడ్డాగా మారిన దుర్గ గుడి

    మరోవైపు.. ఆఫ్‌లైన్‌లోనే ఇసుక పొందే అవకాశం కల్పిస్తోంది. ఇక పారదర్శకత విషయానికొతే రాష్ట్రంలోని ఇసుక రీచ్‌లను కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలకు అప్పగించాలని నిర్ణయించడం.. ప్రభుత్వ రంగ సంస్థలు ముందుకు రానిపక్షంలో.. 13 జిల్లాలను మూడు భాగాలుగా విభజించి టెండర్లు నిర్వహించాలని నిర్ణయించారు. జగన్‌ నిర్ణయంతో రాష్ట్రమంతటా పాజిటివ్‌ వాతావరణమే కనిపిస్తోంది. ప్రజలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు.