https://oktelugu.com/

జగపతి బాబును టార్గెట్ చేసిన బాబు గోగినేని

ప్రముఖ హేతువాది.. బిగ్ బాస్ సీజన్ 2 కంటెస్టెంట్ బాబు గొగినేని ఇప్పుడు హీరో జగపతి బాబుపై పట్టాడు. తన సోషల్ మీడియా ఖాతాలో జగపతి బాబుపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఆనందయ్య మందుకు మద్దతు ప్రకటించిన జగపతిబాబును ఎండగడుతూ వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ప్రముఖ తెలుగు జగపతి బాబు కరోనాను నివారిస్తున్న ఆనందయ్య ఆయుర్వేద ఔషధానికి మద్దతు ప్రకటించారు. జగపతి బాబు కూడా స్వయంగా ఆనందయ్య ఆయుర్వేద ఔషధం తీసుకున్నానని తెలిపారు. జగపతి బాబు ఆనందయ్య ఔషధానికి […]

Written By:
  • NARESH
  • , Updated On : June 12, 2021 / 04:21 PM IST
    Follow us on

    ప్రముఖ హేతువాది.. బిగ్ బాస్ సీజన్ 2 కంటెస్టెంట్ బాబు గొగినేని ఇప్పుడు హీరో జగపతి బాబుపై పట్టాడు. తన సోషల్ మీడియా ఖాతాలో జగపతి బాబుపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఆనందయ్య మందుకు మద్దతు ప్రకటించిన జగపతిబాబును ఎండగడుతూ వ్యాఖ్యలు చేశారు.

    ఇటీవల ప్రముఖ తెలుగు జగపతి బాబు కరోనాను నివారిస్తున్న ఆనందయ్య ఆయుర్వేద ఔషధానికి మద్దతు ప్రకటించారు. జగపతి బాబు కూడా స్వయంగా ఆనందయ్య ఆయుర్వేద ఔషధం తీసుకున్నానని తెలిపారు. జగపతి బాబు ఆనందయ్య ఔషధానికి ఎందుకు బహిరంగంగా మద్దతు ఇస్తున్నారని చాలా మంది ఆశ్చర్యపోయారు. అయితే దానికి కారణాన్ని తాజాగా హేతువాది బాబుగోగినేని బయటపెట్టారు. జగపతి బాబు ఆయుర్వేద దుకాణ వ్యాపారంలోకి అడుగుపెడుతున్నారని.. అందుకే ఆనందయ్య మూలికా ఔషధాన్ని ప్రశంసిస్తూ ప్రకటన చేశాడని.. ఇది ఆయన వ్యాపార వ్యూహమని బాబు గోగినేని సెటైర్లు వేశాడు.

    ఆనందయ్య మూలికా ఔషధాన్ని విమర్శిస్తూ, ఎగతాళి చేస్తూ హేతువాది బాబు గొగినేని ట్వీట్ చేశాడు. ఆనందయ్య మందులో పచ్చడి తప్ప మరేమీ లేదని.. ఇది ఆయుర్వేద ఔషధం కాదని జగపతి బాబుపై సెటైర్లు వేశారు.

    తాజాగా బాబు గోగినేని తన సోషల్ మీడియా లో ఇలా రాసుకొచ్చాడు. “మీరు ఒక దుకాణం తెరవబోతున్నారని చెప్పకుండా, ఆనందయ్య పచ్చడిని ప్రశంసించడం మంచి వ్యాపార వ్యూహం నటుడుగారు. కానీ తెలివిగల ఎవరైనా ఇలా చెప్పేస్తారా?. ఈ ఆత్రుత మాకు మాత్రమే చెడ్డగా కనిపిస్తోంది” అని జగపతి బాబుపై ఆయుర్వేద వ్యాపారంపై బాబు గోగినేనిసెటైర్లు వేశాడు. ముందుగానే ఆనందయ్య మందును ప్రశంసించి.. అదే వ్యాపారంలోకి దిగిన జగపతిబాబును బాబు గోగినేని టార్గెట్ చేశాడు. మరి దీనికి జగపతి బాబు ఎలా స్పందిస్తారనేది వేచి చూడాలి.