https://oktelugu.com/

Social Trends: ‘అయ్యయ్యో వద్దమ్మా..’ సుఖీభవ ట్రోల్స్.. జనాలను ఎందుకు ఊపేస్తోంది?

Social Trends Ayyayyo Vaddamma Sukheebhava: కొత్త ఒక వింత.. పాత ఒక రోత అంటారు. జనాలను ఆకట్టుకునేలా ఏది చేసినా వైరల్ అవుతుంటుంది. తాజాగా టీవీలో వచ్చే ఒక ప్రకటన జనాలను ఊపేస్తోంది. ఇప్పుడు ప్రతీ వేడుకలోనూ అదే ప్రతిధ్వనిస్తోంది. అదేంటో కాదు.. బ్రూక్ బ్రాంక్ టీ కంపెనీ యాడ్ ‘అయ్యయ్యో వద్దమ్మా.. సుఖీభవ’. ఇప్పుడీ యాడ్ ట్రెండ్ సెట్టర్ గా మారింది. కొత్తగా ఏది వచ్చినా జనాలు వదలడం లేదు. పిండి పిప్పి చేసి […]

Written By:
  • NARESH
  • , Updated On : October 18, 2021 / 11:56 AM IST
    Follow us on

    Social Trends Ayyayyo Vaddamma Sukheebhava: కొత్త ఒక వింత.. పాత ఒక రోత అంటారు. జనాలను ఆకట్టుకునేలా ఏది చేసినా వైరల్ అవుతుంటుంది. తాజాగా టీవీలో వచ్చే ఒక ప్రకటన జనాలను ఊపేస్తోంది. ఇప్పుడు ప్రతీ వేడుకలోనూ అదే ప్రతిధ్వనిస్తోంది. అదేంటో కాదు.. బ్రూక్ బ్రాంక్ టీ కంపెనీ యాడ్ ‘అయ్యయ్యో వద్దమ్మా.. సుఖీభవ’. ఇప్పుడీ యాడ్ ట్రెండ్ సెట్టర్ గా మారింది. కొత్తగా ఏది వచ్చినా జనాలు వదలడం లేదు. పిండి పిప్పి చేసి దాన్ని తెగ వాడేస్తున్నారు. ఏది కొత్తగా వస్తే దానిపై పడిపోతున్నారు. ఇప్పుడు ‘సుఖీభవ’ అంటూ ట్రోల్స్ , మీమ్స్ తో పాటు సెటైర్లకు దీన్ని వాడేస్తూ నెటిజన్లు పండుగ చేసుకుంటున్నారు.

    Three Roses Ad Viral Social media

    సృజనాత్మకతకు అంతం లేదంటారు. ఎంత జనాలను మెప్పించేలా మన ఆలోచనను తెరపై చూపితే అంతగా వాళ్లు ఆదరిస్తారనడానికి ఇదే ప్రత్యక్ష ఉదాహరణ. అప్పట్లో వోడాఫోన్ ‘హచ్ డాగ్’ యాడ్ ఎంతో పాపులర్. ఇక భారత్-పాకిస్తాన్ మ్యాచ్ సందర్భంగా పాక్ అభిమాని టీవీని పగుల కొట్టిన ‘మౌకా’ యాడ్ కూడా అప్పట్లో తెగ పాపులర్ అయ్యింది. దీనికి కొనసాగింపుగా ప్రస్తుతం భారత్-పాక్ టీ20 ఫైట్ సందర్భంగా మరో యాడ్ ట్రెండింగ్ లో ఉంది.

    ఇవే కాదు.. అప్పట్లో బజాజ్ చేతక్ యాడ్, ఒనిడా టీవీల రాక్షసుడి ప్రకటన, క్యాడ్ బరీ చాక్లెట్స్ యాడ్ ఇలా వినూత్నంగా ఆలోచించి ప్రేక్షకులను తమ ప్రొడక్టులు కొనిపించేలా చేయడంలో ఆయా కంపెనీలు సక్సెస్ అయ్యాయి.

    తాజాగా మరో యాడ్ ఇప్పుడు జనాలను విపరీతంగా ఆకట్టుకుంటుంది.. అదే బ్రుక్ బాండ్ టీ పొడి యాడ్ ‘అయ్యయ్య వద్దమ్మా.. సుఖీభవ’. ఇదిప్పుడు సోషల్ మీడియాను ఊపేస్తోంది. దీన్ని బేసుకొని జగన్ హామీలను, కేసీఆర్ వాగ్ధానాలపై జనాలు ట్రోల్ చేస్తున్నారు. అంతేనా బోలెడన్నీ మీమ్స్, ట్రోల్స్ చేస్తూ ఫన్నీగా తమ క్రియేటివిటీని చాటుకుంటున్నారు.

    ఇక కొందరైతే వేడుకల్లో, టీవీ ప్రోగ్రాముల్లో ఇప్పుడు ఈ ‘అయ్యయ్యో వద్దమ్మా’ యాడ్ ను డిజే రీమిక్స్ చేసి డ్యాన్సులతో హోరెత్తిస్తున్నారు. చిన్న టీ పొడి యాడ్ ఇంతలా ప్రేక్షకులను మెప్పించడం అంటే మామూలు విషయం కాదు. ఇప్పుడు ఎవరి నోట విన్నా ‘సుఖీభవ’ అంటూ మాటలే వినిపిస్తున్నాయంటే అతిశయోక్తి కాదు..

    https://www.youtube.com/watch?v=9WFZp-IsjM0

    *వైసీపీ నేతలపై ‘సుఖీభవ’ ట్రోల్స్

    https://www.youtube.com/watch?v=isRrZfELmIw