Natural Star Nani: న్యాచురల్ స్టార్ నాని విభిన్నమైన పాత్రలు, సోర్టీలు చేస్తూ… తనదైన నటనతో అభిమానుల మనసులలో చెరగని ముద్ర వేసుకుంటున్నాడు. అయితే ఇటీవల కాలంలో నానికి సరైన సక్సెస్ లభించలేదనే చెప్పాలి. ఆయన నటించిన వీ, టక్ జగదీష్ సినిమాలు ఓటీటీలో విడుదల అవుతున్నాయనే విమర్శలు, మరోవైపు చిత్రాలు సరైన సక్సెస్‌లు సాధించకపోవడం ఆందోళన కలిగిస్తోంది. అయితే ప్రస్తుతం నాని యాక్ట్ చేస్తున్న ” శ్యామ్ సింగ రాయ్ ” సినిమా ఓ బిగ్ అప్డేట్ ను మూవీ యూనిట్ ప్రకటించింది.
ఈ సినిమాను డిసెంబర్ 24న క్రిస్మస్ కానుకగా విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది చిత్ర బృందం. ఈ మేరకు హీరో నాని మరియు హీరోయిన్ సాయి పల్లవి కలిసి ఉన్న పోస్టర్ ను విడుదల చేశారు. ఈ చిత్రానికి రాహుల్ సాంకృత్యాయన్ దర్శకత్వం వహిస్తుండగా… కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్ లు కూడా హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ సినిమాను నాలుగు భాషల్లో విడుదల చేస్తున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. ఈ అప్డేట్ తో నాని ఫ్యాన్స్ ఫుల్ జోష్ లో ఉన్నట్లు తెలుస్తోంది.
This Christmas
Shyam will arrive where he belongs 🙂
To the big screen and to your hearts 🤍TELUGU,TAMIL,MALAYALAM,KANNADA
DECEMBER 24th 🔥#ShyamSinghaRoy @Sai_Pallavi92 @IamKrithiShetty @MadonnaSebast14 @MickeyJMeyer @Rahul_Sankrityn @vboyanapalli@NiharikaEnt pic.twitter.com/pbMojsNhs8
— Nani (@NameisNani) October 18, 2021
ఇటీవల దసరా కానుకగా ” దసరా ” అనే టైటిల్‌తో నాని 29వ మూవీ తెరకెక్కబోతుందని వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ చిత్రంలో కీర్తి సురేష్ కథానాయికగా నటిస్తోంది. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తుండగా… శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా పోస్టర్‌లో నాని రగ్డ్ లుక్‌తో కనిపిస్తుండగా, ‘ఈ దసరా నిరుడు లెక్కుండది.. బాంచత్.. జమ్మివెట్టి చెబుతున్నా.. బద్దల్ బాసింగలైతయ్.. ఎట్లైతే గట్లైతది.. సూసుకుందాం’ అంటూ తెలంగాణ యాసలో నాని చెప్పిన డైలాగ్ అదిరిపోయింది.