నిజాలు చెబుతున్న అయ్యన్న… చంద్రబాబుకు కొత్త చిక్కులు?

చేసిన పాపం ఊరికే పోదని పెద్దలు చెబుతూ ఉంటారు. చేసిన తప్పులకు కొన్ని సందర్భాల్లో శిక్ష ఆలస్యం కావొచ్చేమో కానీ పాపం పండిన రోజున శిక్ష అనుభవించక తప్పదని కూడా పెద్దలు చెబుతుంటారు. చంద్రబాబు ప్రస్తుతం ఎదుర్కొంటున్న పరిస్థితులను చూస్తే ఒక విధంగా ఈ మాటలు నిజమేనేమోనని నమ్మాల్సి వస్తోంది. సొంత పార్టీ నేతలే చంద్రబాబు బండారాలను, రహస్యాలను చెబుతూ బాబు పరువు తీస్తున్నారు. Also Read : ఈ వైసీపీ ఎంపీ మాటలు భలే ఉన్నాయే..? […]

Written By: Navya, Updated On : September 19, 2020 9:40 am
Follow us on


చేసిన పాపం ఊరికే పోదని పెద్దలు చెబుతూ ఉంటారు. చేసిన తప్పులకు కొన్ని సందర్భాల్లో శిక్ష ఆలస్యం కావొచ్చేమో కానీ పాపం పండిన రోజున శిక్ష అనుభవించక తప్పదని కూడా పెద్దలు చెబుతుంటారు. చంద్రబాబు ప్రస్తుతం ఎదుర్కొంటున్న పరిస్థితులను చూస్తే ఒక విధంగా ఈ మాటలు నిజమేనేమోనని నమ్మాల్సి వస్తోంది. సొంత పార్టీ నేతలే చంద్రబాబు బండారాలను, రహస్యాలను చెబుతూ బాబు పరువు తీస్తున్నారు.

Also Read : ఈ వైసీపీ ఎంపీ మాటలు భలే ఉన్నాయే..?

చంద్రబాబు ఒకవైపు లోకేశ్ భవిష్యత్తు గురించి, మరోవైపు రోజురోజుకు బలహీనపడుతున్న పార్టీ గురించి ఆందోళనకు గురవుతున్నారు. వీటికి తోడు సుప్రీం అవినీతి, ఆర్థిక నేరాల గురించి తాజాగా జారీ చేసిన ఆదేశాలు చంద్రబాబును మరింత ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఇలాంటి తరుణంలో మాజీ మంత్రి, టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు చెప్పిన నిజాలు చంద్రబాబుకు కొత్త చిక్కులు తెచ్చిపెడుతున్నాయి.

అయ్యన్నపాత్రుడు నోరు జారి చెప్పిన మాట చంద్రబాబు అసమర్థతను చాటి చెబుతోంది. ఏపీ రాష్ట్ర ఖజానా గురించి కామెంట్లు చేస్తూ తమ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో వివిధ ప్రభుత్వ శాఖలకు 35 వేల కోట్ల రూపాయలు చెల్లించాల్సి ఉందని అయ్యన్న నోరు జారారు. చంద్రబాబు పాలనలో పెద్దగా పథకాల అమలు, అభివృద్ధి జరగకపోయినా అప్పులు మాత్రం పెరగడం గమనార్హం.

జగన్ పలు సందర్భాల్లో గత ప్రభుత్వం చేసిన అప్పులను తీరుస్తున్నామని ప్రకటించారు. అప్పట్లో టీడీపీ నేతలు కూడా జగన్ కామెంట్లపై పెద్దగా స్పందించలేదు. అయితే ప్రస్తుతం అయ్యన్న చేసిన కామెంట్లు చూస్తే జగన్ చెప్పిన మాటలు నమ్మాల్సి వస్తోంది. సొంత పార్టీ నేత చేసిన కామెంట్ల వల్ల చంద్రబాబుకు కొత్త చిక్కులు తప్పడం లేదు.

Also Read : వైసీపీ ఎమ్మెల్యేకు కోర్టు షాక్… కేసు పెట్టాలని ఆదేశాలు..?