AP CM Jagan: వడ్డించేవాడు మనవాడైతే చివరి బంతిలో కూర్చున్న ఫర్వాలేదు. ఇప్పుడు ఏపీపీఎస్సీ పని కూడా అలాగే ఉంది. ఇన్నాళ్లు చైర్మన్ గా కొనసాగిన ఉదయభాస్కర్ ను రాజీనామా చేయించి ఇంటికి సాగనంపారు. ఇప్పుడు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన రమణారెడ్డిని ఇన్ చార్జిగా నియమించారు. గతంలో ఏ నిర్ణయం తీసుకున్నా కనీసం చైర్మన్ కు చెప్పకుండా ఏకపక్ష నిర్ణయాలు తీసుకుని ఆయనను కష్టాల పాలు చేశారు. దీంతో కోర్టుల వరకు వెళ్లాల్సి వచ్చింది. అయినా అక్కడ కూడా ఎవరు నమ్మలేదు. చైర్మన్ కు తెలియకుండా నిర్ణయాలు ఎలా తీసుకుంటారనే ప్రశ్నలు వచ్చాయి. దీంతో ఏం చేయలేక ఆయన ఉద్యోగ బాధ్యతలను ఓ సవాలుగా తీసుకున్నారు.
ఎట్టకేలకు వారు ఊహించేదే అయింది. ఆయన పదవీ కాలం పూర్తయింది. దీంతో ఇంటికి పంపించారు. ఇక తమ వర్గానికి చెందిన వ్యక్తినే ఇన్ చార్జిగా నియమించుకున్నారు. త్వరలో చైర్మన్ గా కూడా ఆయననే కొనసాగించే ఏర్పాట్లు కూడా సాగుతున్నాయి. ఇప్పటికే అన్ని పోస్టుల్లో ఒకే సామాజిక వర్గానికి చెందిన వారినే నియమించుకున్నారనే అపవాదు ఉన్నా పట్టించుకోవడం లేదు. జగన్ పాలనలో మరీ పదవుల కేటాయింపులో ఇంత స్పీడు ఉండటానికి ప్రధాన కారణం సామాజికవర్గమే. తమ కులానికి చెందిన వ్యక్తి కాబట్టే ఇంత త్వరగా నియామకం చేపట్టినట్లు తెలుస్తోంది.
దీంతో నిర్ణయాలు కూడా ఏ తీరుగా ఉంటాయోనని అభ్యర్థుల్లో ఆందోళన పట్టుకుంది. వైసీపీ ప్రభుత్వ నిర్ణయాలతో ప్రజలందరు నానా తిప్పలు పడుతున్నా ప్రభుత్వం మాత్రం తాను అనుకున్నది చేయడమే తరువాయి. ఇందులో భాగంగానే పలు సర్వేలు చెబుతున్నా నిర్లక్ష్యంతోనే పనులు చేస్తున్నారు. దీంతో ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకుంటున్నారు. అయినా ఎన్నికల్లో మాత్రం విజయాలు సొంతం చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఏపీపీఎస్సీ భవితవ్యం ఏమిటన్నది తేలడం లేదు.
Also Read: Pawan Kalyan: పవన్ కళ్యాణ్ ‘డిజిటల్’ సెగ వైసీపీకి బాగానే తగులుతోందే?
అసలే ఉద్యోగాల కొరతతో ఇబ్బందులు పడుతున్న నిరుద్యోగుల ఆశలపై నీళ్లు చల్లుతారో లేక ఆగ్రహం పెంచుతారో తెలియడం లేదు. దీంతో రాష్ర్టంలో ఏపీపీఎస్సీలో ఉద్యోగ నియామకాలపై ఏ చర్యలు తీసుకుంటారో అర్థం కావడం లేదు. నిబంధనల ప్రకారం నడుచుకుంటూ ప్రభుత్వం ఉత్తర్వులు అమలు చేస్తుందా? లేక నియంతృత్వ ధోరణితో పని చేస్తుందా అనే అనుమానాలు అందరిలో వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం రెడ్డి సామాజిక వరానికి పెద్దపీట వేస్తుందనేది బహిరంగ రహస్యమే.
Also Read: Happy Birthday YS Jagan: అలుపెరగని పోరాట యోధుడు ‘జగన్’