https://oktelugu.com/

NTR: రాజకీయాలు కంటే పాన్ ఇండియా స్టార్ అవ్వడమే ముఖ్యం !

NTR:  జూనియర్ ఎన్టీఆర్ కాబోయే సీఎం అని ఇప్పటికే తారక్ అభిమానులు ఫిక్స్ అయిపోయారు. తారక్ లో మంచి రాజకీయ నాయకుడు ఉన్నాడని కొందరు టీడీపీ నాయకులు కూడా గతంలో అభిప్రాయపడ్డారు. దానికి తగ్గట్టుగానే ఎన్టీఆర్ ఏం మాట్లాడినా చాలా లోతుగా ఆలోచించి మాట్లాడతాడు. ఎవరితో ఎలా ఉండాలి ? ఎవర్ని ఎలా డీల్ చేయాలి ? లాంటి అంశాల్లో ఎన్టీఆర్ కి మంచి అనుభవం ఉంది. చిన్న వయసులోనే రాజకీయ దెబ్బలు తిన్న కష్టాల గమనం […]

Written By:
  • Shiva
  • , Updated On : December 21, 2021 / 11:01 AM IST
    Follow us on

    NTR:  జూనియర్ ఎన్టీఆర్ కాబోయే సీఎం అని ఇప్పటికే తారక్ అభిమానులు ఫిక్స్ అయిపోయారు. తారక్ లో మంచి రాజకీయ నాయకుడు ఉన్నాడని కొందరు టీడీపీ నాయకులు కూడా గతంలో అభిప్రాయపడ్డారు. దానికి తగ్గట్టుగానే ఎన్టీఆర్ ఏం మాట్లాడినా చాలా లోతుగా ఆలోచించి మాట్లాడతాడు. ఎవరితో ఎలా ఉండాలి ? ఎవర్ని ఎలా డీల్ చేయాలి ? లాంటి అంశాల్లో ఎన్టీఆర్ కి మంచి అనుభవం ఉంది. చిన్న వయసులోనే రాజకీయ దెబ్బలు తిన్న కష్టాల గమనం ఉంది.

    NTR

    అందుకే, ఎన్టీఆర్ పక్కా ముందు చూపుతో ముందుకు వెళ్తున్నాడని అంటున్నారు. వచ్చే ఎన్నికల్లో కూడా రాజకీయాల్లో డైరెక్ట్ గా ఎలాంటి పాత్ర లేకుండా చూసుకోవాలని నిర్ణయించుకున్నాడు. అదేవిధంగా వచ్చే ఎన్నికల నాటికీ పాన్ ఇండియా స్టార్ గా వెలిగిపోవాలని కూడా తారక్ ప్లాన్ చేసుకున్నాడు. రాజమౌళి మహేష్ తో చేయబోయే సినిమా కూడా మల్టీస్టారర్ అంటున్నారు.

    ఆ సినిమాలో తారక్ నటించబోతున్నాడని పుకార్లు వినిపిస్తున్నాయి. మరి ఈ వార్తలో ఎంత నిజం ఉందో తెలియదు గానీ, రాజమౌళి మాత్రం ఎన్టీఆర్ ను పాన్ ఇండియా స్టార్ గా చేయాలని కంకణం కట్టుకున్నాడు. పైగా ఎన్టీఆర్ కూడా తన తర్వాత సినిమాలను పాన్ ఇండియా సినిమాలుగానే ప్లాన్ చేస్తున్నాడు. తర్వాత చిత్రాన్ని ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో చేయబోతున్నాడు.

    ఈ సినిమా షూటింగ్ ఫిబ్రవరిలో స్టార్ట్ అవుతుంది. ఇది ఒక రివెంజ్ డ్రామాగా ఈ చిత్రం రాబోతుంది. ఈ సినిమాలో మెయిన్ విలన్ గా సంజయ్ దత్ నటించబోతున్నాడు. ఇక కొరటాల సినిమా తర్వాత కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో ఓ భారీ చిత్రం ఉంటుంది. అక్టోబర్ 2022లో ఈ సినిమా మొదలవుతుంది.

    Also Read: RRR: రామ్​ మేకోవర్​ అదుర్స్​.. సీతారామరాజు పాత్రకోసం ఇంతలా కష్టపడ్డాడా?

    ఇది కూడా పాన్ ఇండియా సినిమానే. ఎన్టీఆర్, బుచ్చిబాబుతో కూడా ఒక సినిమా కమిట్ అయ్యాడని ఇప్పటికే వార్తలు వచ్చాయి. ‘ఉప్పెన’ తీసి మంచి హిట్ కొట్టిన బుచ్చిబాబు ఇటీవల ఒక యూట్యూబ్ ఛానెల్ కి ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఆ ఇంటర్వ్యూలో కూడా తన తదుపరి సినిమా ఎన్టీఆర్ తో ఉంటుందని హింట్ ఇచ్చాడు. కానీ ఎన్టీఆర్ మాత్రం బుచ్చిబాబుకి బదులు దర్శకుడు అట్లీతో సినిమా ప్లాన్ చేస్తున్నాడు. ఇది కూడా పాన్ ఇండియా సినిమానే. రాజకీయాలు కంటే పాన్ ఇండియా స్టార్ అవడమే ముఖ్యం అని తారక్ ఫీల్ అవుతున్నాడు.

    Also Read: Tollywood Industry Highlights: టాలీవుడ్ ఇండస్ట్రీ హైలైట్స్.. అంచనాలు తలకిందులైన వేళ..!

    Tags