https://oktelugu.com/

Unstoppable Show: బాలకృష్ణ “అన్ స్టాపబుల్” షో లో సందడి చేయనున్న “పుష్ప”రాజ్… స్ట్రీమింగ్ ఎప్పుడంటే

Unstoppable Show: ఓ వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు హోస్ట్​గా ప్రేక్షకులను అలరిస్తున్నారు నందమూరి బాలకృష్ణ. ఇటీవల అఖండ సినిమాతో ఘన విజయం సాదించాడు బాలయ్య. మరోవైపు ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహాలో అన్​స్టాపబుల్​ షోతో ప్రేక్షకులను అలరిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుత కాలంలో అత్యంత ప్రజాదరణ పొందిన టాక్ షోలలో ఒకటిగా ‘అన్‌స్టాపబుల్’ నిలిచింది. తనదైన శైలిలో హోస్ట్ గా బాలకృష్ణ అదరగొడుతున్నారు. ఈ షో కు ఇప్పటి వరకు మంచు మోహన్ బాబు, నాని, […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : December 21, 2021 / 10:52 AM IST
    Follow us on

    Unstoppable Show: ఓ వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు హోస్ట్​గా ప్రేక్షకులను అలరిస్తున్నారు నందమూరి బాలకృష్ణ. ఇటీవల అఖండ సినిమాతో ఘన విజయం సాదించాడు బాలయ్య. మరోవైపు ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహాలో అన్​స్టాపబుల్​ షోతో ప్రేక్షకులను అలరిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుత కాలంలో అత్యంత ప్రజాదరణ పొందిన టాక్ షోలలో ఒకటిగా ‘అన్‌స్టాపబుల్’ నిలిచింది. తనదైన శైలిలో హోస్ట్ గా బాలకృష్ణ అదరగొడుతున్నారు. ఈ షో కు ఇప్పటి వరకు మంచు మోహన్ బాబు, నాని, బ్రహ్మానందం, అనిల్​ రావిపూడి, అఖండ టీమ్​ గెస్ట్ లుగా హాజరయ్యారు. ఇక రాజమౌళి, కీరవాణి కూడా పాల్గొన్న ఎపిసోడ్ ను త్వరలోనే ప్రసారం చేయనున్నారు. “అన్‌స్టాపబుల్” షో ఆశ్చర్యకరంగా రాజమౌళి, రవితేజ, అల్లు అర్జున్ వంటి ఊహించని అతిథులను తెరపైకి తీసుకు వస్తూ ప్రేక్షకులను థ్రిల్ చేస్తోంది ఆహా టీమ్.

    allu arjun and pushpa team attending balayya unstoppable show

    Also Read: రాజకీయాలు కంటే పాన్ ఇండియా స్టార్ అవ్వడమే ముఖ్యం !

    ఇక ఇటీవలే మాస్ మహారాజ్ రవితేజ కూడా ఈ షో కు గెస్ట్ గా రాబోతున్నట్లు ప్రకటించారు. కాగా ఇప్పుడు తాజాగా ‘పుష్ప’ మూవీ టీమ్ ‘అన్‌స్టాపబుల్’ షోలో కన్పించబోతోందని సమాచారం. తదుపరి ఎపిసోడ్ కోసం ఈ టాక్ షోలో అల్లు అర్జున్, రష్మిక, దర్శకుడు సుకుమార్ బాలయ్యతో కలిసి పాల్గొననున్నారు. ఈ మేరకు ఈ వార్తను ఆహా టీమ్ అధికారికంగా ప్రకటించింది,. ఈ ఎపిసోడ్ ను క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25 నా స్ట్రీమింగ్ చేయనున్నట్లు తెలిపారు. వాస్తవానికి ‘అన్‌స్టాపబుల్’ నెక్స్ట్ ఎపిసోడ్‌లో రవితేజ, డైరెక్టర్ గోపీచంద్ మలినేని ఉండవలసి ఉంది. కానీ ‘పుష్ప’ టీమ్ కారణంగా మాస్ మహారాజ ఎపిసోడ్ ఈ సంవత్సరం చివరిన డిసెంబర్ 31 న ప్రసారం చేయనున్నారు. ఇటీవలే రిలీజ్ అయిన పుష్ప సినిమా కూడా కలెక్షన్ల సునామీ సృష్టిస్తూ దూసుకుపోతుంది.

    https://twitter.com/ahavideoIN/status/1473146479288066050?s=20

    Also Read: సోషల్ మీడియా లో వైరల్ గా మారిన సూపర్ స్టార్ కృష్ణ – సితార ఫోటో…