Pawan kalyan: టీడీపీ ఆఫీసులపై దాడులు.. వైసీపీ నాయకులకు ఒకటే చెబుతున్నా.. పవన్ హెచ్చరిక

Pawan kalyan: ఏపీ ప్రధాన ప్రతిపక్షం టీడీపీ కార్యాలయాలను, నేతల ఇళ్లపై వైసీపీ దాడులు కలకలం రేపాయి. ఏపీ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో మూకుమ్మడిగా దాడులు చేయడం భీతావాహంగా మారింది. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇంతకు ముందెన్నడూ లేని విధంగా పార్టీ కార్యాలయాలపై దాడులు జరిగాయి. ఇలాంటి సంస్కృతి ప్రజాస్వామ్యానికి ఏ మాత్రం శ్రేయస్కరం కాదని జనసేనాని పవన్ కళ్యాణ్ ఆక్షేపించారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. జనసేన పార్టీ ఐటీ వింగ్ మీటింగ్ […]

Written By: NARESH, Updated On : October 19, 2021 8:40 pm
Follow us on

Pawan kalyan: ఏపీ ప్రధాన ప్రతిపక్షం టీడీపీ కార్యాలయాలను, నేతల ఇళ్లపై వైసీపీ దాడులు కలకలం రేపాయి. ఏపీ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో మూకుమ్మడిగా దాడులు చేయడం భీతావాహంగా మారింది. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇంతకు ముందెన్నడూ లేని విధంగా పార్టీ కార్యాలయాలపై దాడులు జరిగాయి. ఇలాంటి సంస్కృతి ప్రజాస్వామ్యానికి ఏ మాత్రం శ్రేయస్కరం కాదని జనసేనాని పవన్ కళ్యాణ్ ఆక్షేపించారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.

జనసేన పార్టీ ఐటీ వింగ్ మీటింగ్ లో ఉండగా మంగళగిరి, గుంటూరుల్లోని తెలుగుదేశం పార్టీ కార్యాలయాల మీద దాడి జరిగిన విషయం నా దృష్టికి వచ్చిందని పవన్ తెలిపారు. విశాఖపట్నం, ప్రొద్దుటూరుల్లో వారి నాయకుల మీద కూడా దాడులు జరిగాయి. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికీ నియంత్రణ అవసరమని హితవు పలికారు.

ఈ విధంగా వ్యక్తిగత దాడులు గానీ, పార్టీ కార్యాలయాల మీద, నాయకుల ఇళ్ల మీద దాడులు జరిగితే అది అరాచకానికి, దౌర్జన్యానికి దారి తీస్తుందన్నారు. ఇది ప్రజాస్వామ్యానికి క్షేమకరం కాదన్నారు. కేంద్ర ప్రభుత్వం, కేంద్ర హోంశాఖలు దీని మీద దృష్టి సారించాలని సూచించారు.

అరాచకానికి కేరాఫ్ అడ్రస్ గా ఏపీ తయారవుతుందని పవన్ కళ్యాణ్ నిప్పులు చెరిగారు. ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ సత్వరం చర్యలు తీసుకోవాలన్నారు. భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా దోషుల్ని పట్టుకుని శిక్షించకపోతే ఆంధ్రప్రదేశ్ అరాచకానికి కేరాఫ్ అడ్రస్ లా తయారవుతుందని పవన్ హెచ్చరించారు. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా చూడాలన్నారు. దాడికి పాల్పడిన వారు వైసీపీ వర్గీయులని చెబుతున్నారని.. అదే నిజం అయితే వైసీపీ నాయకులకు ఒకటే చెబుతున్నానని పవన్ హెచ్చరికలు పంపారు.. ఇలాంటి చర్యలు ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు అన్నారు. దయచేసి దీన్ని సరి చేసుకోవాలని హితవు పలికారు. అంతా క్షేమంగా, ధైర్యంగా ఉండాలని.. కేంద్ర ప్రభుత్వం సత్వరం దీని మీద దృష్టి సారించాలని పవన్ డిమాండ్ చేశారు. విమర్శలు, ప్రతివిమర్శలు చేసేటప్పుడు నియంత్రణ పాటించాలన్నారు. విమర్శ హర్షించే విధంగా ఉండాలి తప్ప… ఉద్రిక్తతలకు దారి తీసే విధంగా ఉండకూడదని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.