Singer Mangli : నోటిదురుసు కొంప ముంచింది.. సింగర్ మంగ్లీ పై రాళ్లదాడి… కారణం ఇదే!

Singer Mangli : హద్దులు మీరిన ప్రాంతీయవాదం, భాషాభిమానం ఉన్మాదం కిందకే వస్తుంది. ఇతర భాషలు, సంస్కృతులను గౌరవించలేని వాడు సొంత భాషను కూడా అనుమానిస్తున్నట్లే లెక్క. సౌత్ ఇండియాలో తమిళులు, కన్నడిగులలో ఈ జాఢ్యం ఎక్కువైపోయింది. భాషాభిమానం పేరుతో హద్దులు మీరి ప్రవర్తిస్తున్నారు. సందర్భాన్ని అర్థం చేసుకోకుండా మూర్ఖత్వం చాటుకుంటున్నారు. పక్క రాష్ట్రాల భాషల పట్ల వారికి కనీస గౌరవం ఉండదు. ద్రవిడ భాషల్లో భాగమైన తెలుగును కించపరుస్తూ మాట్లాడిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అసలు […]

Written By: NARESH, Updated On : January 22, 2023 6:53 pm
Follow us on

Singer Mangli : హద్దులు మీరిన ప్రాంతీయవాదం, భాషాభిమానం ఉన్మాదం కిందకే వస్తుంది. ఇతర భాషలు, సంస్కృతులను గౌరవించలేని వాడు సొంత భాషను కూడా అనుమానిస్తున్నట్లే లెక్క. సౌత్ ఇండియాలో తమిళులు, కన్నడిగులలో ఈ జాఢ్యం ఎక్కువైపోయింది. భాషాభిమానం పేరుతో హద్దులు మీరి ప్రవర్తిస్తున్నారు. సందర్భాన్ని అర్థం చేసుకోకుండా మూర్ఖత్వం చాటుకుంటున్నారు. పక్క రాష్ట్రాల భాషల పట్ల వారికి కనీస గౌరవం ఉండదు. ద్రవిడ భాషల్లో భాగమైన తెలుగును కించపరుస్తూ మాట్లాడిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అసలు భాషాప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు దారితీసింది ఈ భాషా దురహంకారమే.

కన్నడిగులు మరోసారి తమ మూర్ఖత్వం బయటపెట్టుకున్నాడు. కన్నడలో మాట్లాడనందుకు సింగర్ మంగ్లీపై రాళ్ళ దాడికి తెగబడ్డారు. ఏపీకి పొరుగున ఉన్న బళ్లారిలో ఈ సంఘటన జరిగింది. కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఆమె కారుపై రాళ్లు రువ్వి పారిపోయారు. కారులో ఉన్న మంగ్లీ, ఆమె సహాయక సిబ్బంది ఊహించని దాడికి ఆందోళన చెందారు. అయితే మంగ్లీకి ఎలాంటి గాయాలు కాలేదని సమాచారం. ఆమె కారు పాక్షికంగా దెబ్బతిన్నట్లు తెలుస్తుంది. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.

బళ్లారి మున్సిపల్ స్టేడియంలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న మంగ్లీ అక్కడి నుండి హైదరాబాద్ కి బయలుదేరారు. ఆ సమయంలో ఈ సంఘటన జరిగింది. ఇక మంగ్లీ పై దాడికి కారణం… కన్నడలో మాట్లాడటానికి నిరాకరించడమే. ఇటీవల చిక్బళ్లాపూర్ లో జరిగిన ఓ ఈవెంట్లో పాల్గొన్న మంగ్లీని తెలుగులో మాట్లాడాలని ప్రేక్షకులు కోరారు. ఏపీ బోర్డర్ కనుక చాలా మందికి తెలుగు కూడా వచ్చి ఉంటుంది. కాబట్టి నేను తెలుగులోనే మాట్లాడతాను అన్నారు.

ఆమె కామెంట్స్ కి నిరసనగా కొందరు దుండగులు ఈ చర్యకు పాల్పడ్డారు. కన్నడ మాట్లాడాలంటే ఆమెకు కన్నడ రావాలి కదా అనే కనీస జ్ఞానం వాళ్లకు లేకుండా పోయింది. ఈ మధ్య కన్నడిగుల్లో వ్యతిరేక భావాలు ఎక్కువైపోయాయి. వారి సోషల్ మీడియా దాడులు సైతం శృతి మించిపోతున్నాయి. కన్నడిగుల ట్రోలింగ్ కి తట్టుకోలేక ప్రశాంత్ నీల్ సోషల్ మీడియాకు దూరమయ్యారు. రష్మిక చాలా కాలంగా ఈ వేధింపులను ఎదుర్కొంటున్నారు. ఇక తెలుగు సినిమాలను భాష కారణంగా వ్యతిరేకిస్తూ సోషల్ మీడియా ట్రోల్స్ కి పాల్పపడిన సందర్భాలు అనేకం . తెలుగు చిత్రాల విడుదలను అడ్డుకునే ప్రయత్నం చేశారు.