Umesh Yadav : ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియడం లేదు. మనవారే అనుకున్న వారే మనల్ని మోసం చేసేందుకు వెనుకాడటం లేదు. ఫలితంగా మోసపోయే వరకు కూడా ఏం అర్థం కావడం లేదు. తీరా మోసపోయాక ఎంతో బాధపడటం తప్ప మనం చేసేదేమి ఉండదు. అప్పటికే జరగాల్సిన మోసం జరిగేపోతుంది. మన డబ్బు మన చేజారిపోతుంది. ఫలితంగా కంట నీరు పెట్టుకోవడం తప్ప మనకు ఎలాంటి ఆధారం కూడా కనిపించదు. ఈ నేపథ్యంలో మనుషుల్లో తగ్గుతున్న నైతికతతో లోకంలో ఎవరిని కూడా అంత తేలిగ్గా నమ్మేందుకు ముందుకు రావడం లేదు.

తాజాగా మహారాష్ట్రలో జరిగిన ఓ ఘటన అందరిలో ఆశ్చర్యం కలిగిస్తోంది. టీమిండియా పేసర్ ఉమేష్ యాదవ్ ను తాను నమ్మిన వ్యక్తే మోసం చేయడం కలకలం రేపింది. ఉమేష్ యాదవ్ స్నేహితుడు శైలేష్ కు ఉద్యోగం లేకపోవడంతో ఖాళీగా ఉంటున్నాడని భావించి తన మేనేజర్ గా ఉద్యోగం ఇచ్చాడు. స్నేహితుడే కదా అన్ని విషయాలు అప్పగించాడు. ఆర్థిక విషయాల్లో కూడా అతడికి ప్రాధాన్యం ఇవ్వడంతో లావాదేవీలు మొత్తం చూసుకునే వాడు. ఉమేష్ కూడా అతడిని పూర్తిగా నమ్మాడు.
ఈ నేపథ్యంలో ఓ చోట ప్లాట్ ఉందని రూ.44 లక్షలకే వస్తుందని ఉమేష్ ను నమ్మించి డబ్బు తీసుకున్నాడు. తరువాత ప్లాట్ ను తన పేరున రిజిస్టర్ చేసుకున్నాడు. ఇదేంటని ప్రశ్నిస్తే డబ్బు ఇచ్చేందుకు కూడా నిరాకరించాడు. దీంతో మోసపోయానని గుర్తించిన అతడు పోలీసులను ఆశ్రయించాడు. కానీ డబ్బు మాత్రం పోయింది. ఇక ఏం చేసేదని పోలీసులపై భారం వేశాడు. స్నేహితుడే కదా అని నమ్మితే మోసం చేసిన విధానంపై అందరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
తిన్నింటి వాసాలు లెక్కపెట్టే వారు కోకొల్లలు. సమయం వచ్చినప్పుడు అందరు ఊసరవెళ్లిలా మారుతున్నారు. తమ భవిష్యత్ ను తామే నాశనం చేసుకుంటున్నారు. అదే ఉమేష్ కు నమ్మకస్తుడిగా ఉంటే జీవితాంతం ఉపాధి దొరుకుతుంది కదా అనే భావన కూడా లేకుండా తనకు అన్నం పెట్టిన వాడినే నిలువునా దోపిడీ చేయడంపై రకరకాలుగా చర్చించుకుంటున్నారు. ఇంత అన్యాయమా? డబ్బు దొంగిలించేందుకు ఇదే పద్ధతా? అని పలువురు నెటిజన్లు తిట్టిపోస్తున్నారు. అప్పనంగా డబ్బు లాక్కోవడం సముచితం కాదని హితవు పలుకుతున్నారు. అతడికి అంతకు అంత నస్టం జరుగుతుందని సోషల్ మీడియా వేదికగా శాపనార్థాలు పెడుతున్నారు.