https://oktelugu.com/

పాకిస్తాన్ లో దారుణాలు.. హిందూ ఆలయాల కూల్చివేతలు

శత్రుదేశం పాకిస్తాన్ లో హిందువులపై దారుణాలు ఆగడం లేదు. అల్ప సంఖ్యాకులైన హిందువులకు రక్షణ లేకుండా పోతోంది. ఇటీవలే ఓ సిక్కు యువతిని కిడ్నాప్ చేసి బలవంతంగా ముస్లిం మతంలోకి మార్చి పెళ్లి చేయడం దుమారం రేపింది. తాజాగా మరో హిందూ యువతిని కిడ్నాప్ చేసి ఓ ముస్లిం వ్యక్తితో పెళ్లి చేయడం కలకలం రేపింది. Also Read: వైరల్ వీడియో: రేపిస్ట్ కు టికెట్ వద్దన్నందుకు మహిళా కార్యకర్తపై దాడి హిందూ, సిక్కు యువతులను బలవంతంగా […]

Written By:
  • NARESH
  • , Updated On : October 11, 2020 / 06:33 PM IST
    Follow us on

    శత్రుదేశం పాకిస్తాన్ లో హిందువులపై దారుణాలు ఆగడం లేదు. అల్ప సంఖ్యాకులైన హిందువులకు రక్షణ లేకుండా పోతోంది. ఇటీవలే ఓ సిక్కు యువతిని కిడ్నాప్ చేసి బలవంతంగా ముస్లిం మతంలోకి మార్చి పెళ్లి చేయడం దుమారం రేపింది. తాజాగా మరో హిందూ యువతిని కిడ్నాప్ చేసి ఓ ముస్లిం వ్యక్తితో పెళ్లి చేయడం కలకలం రేపింది.

    Also Read: వైరల్ వీడియో: రేపిస్ట్ కు టికెట్ వద్దన్నందుకు మహిళా కార్యకర్తపై దాడి

    హిందూ, సిక్కు యువతులను బలవంతంగా మతమార్పిడులు చేయడంపై అల్ పాకిస్తాన్ హిందూ పంచాయతీ అనే హిందూ ఎన్జీవో సంస్థ తీవ్రంగా ఖండించింది. దీనిపై పోరాటం చేస్తామని స్పష్టం చేశారు.పంజాబ్ ప్రావిన్స్ లోని ఓ గురుద్వారాలో పూజారిగా పనిచేస్తున్న వ్యక్తి కూతురును కిడ్నాప్ చేసుకున్నా ఇంతవరకు చర్యలు తీసుకోలేదని.. దీనిపై ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయలేదని హిందూ సంఘం ఆరోపించింది. ఈ నేపథ్యంలో హిందూ యువతుల కిడ్నాప్ వ్యవహారంపై ప్రభుత్వంపై పోరాటం చేసేందుకు పాకిస్తాన్ లోని మైనార్టీలైన హిందువులు సిద్ధమయ్యారు.

    సింద్ ప్రావిన్స్ లో గతంలో 428 హిందూ ఆలయాలు ఉండేవి. ప్రస్తుతం ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం వచ్చాక ఆ సంఖ్య 20కి పడిపోయింది. భవిష్యత్ లో ఈ మందిరాలు కూడా ఉంటాయనే నమ్మకం లేదని హిందుత్వవాదులు ఆరోపిస్తున్నారు.

    తాజాగా పాకిస్తాన్ లో మరో దారుణం వెలుగుచూసింది. ఆదేశంలో మైనార్టీలైన హిందువుల మనోభావాలు దెబ్బతింటున్నాయి.. పాకిస్తాన్ లో ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఈ దాడులు మరింత ఎక్కువైనట్టు హిందుత్వవాదులు మండిపడుతున్నారు.

    Also Read: బీహార్‌ ఎన్నికల ప్రచారంలో ఎవరు ముందున్నారంటే..?

    ఇప్పటికే పాకిస్తాన్ లో అనేక హిందూ ఆలయాలను కూల్చివేశారు. ఒక్క కొత్త దేవాలయం నిర్మించకపోగా.. స్వాతంత్ర్యానికి పూర్వం ఉన్న పురాతన ఆలయాలు కూడా కూల్చేస్తున్నారు. ముఖ్యంగా సింధ్ ప్రావిన్స్ లో ఆలయాలపై దాడులు ఇటీవల కాలంలో ఎక్కువైనట్టు లండన్ బేస్డ్ పాకిస్తానీ యాక్టివిస్ట్ అనిలా గుల్జార్ తెలిపారు. కాగా ఈ దారుణాలపై పాకిస్తాన్ లోని హిందూ దేవాలయాలు ఫిర్యాదులు చేసినా పాకిస్తాన్ సర్కార్ పట్టించుకోవడం లేదని యాక్టివిస్ట్ అనిలా గుల్జార్ ఆరోపించారు.