అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వచ్చే నెలలో అమెరికన్లకు కరోనా వ్యాక్సిన్ పంచుతానని ప్రకటించారు. ఈమేరకు వ్యాక్సిన్ తయారీ సంస్థలకు అడ్వాన్స్ కూడా ఇచ్చి వేగవంతం చేస్తున్నారు. అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ముందే ఈ వ్యాక్సిన్ పంపిణీ చేసి ఎన్నికల్లో లబ్ధి పొందాలని చూస్తున్నారు. అయితే ఆయన వ్యక్తిగత అధికారి, ప్రముఖ డాక్టర్ మాత్రం ట్రంప్ ఆశలపై నీళ్లు చల్లాలే వ్యాఖ్యానించడం విశేషంగా మారింది.
Also Read: పాకిస్తాన్ లో దారుణాలు.. హిందూ ఆలయాల కూల్చివేతలు
అయితే రెండు మూడు నెలలు ఆలస్యమైనా సరే అమెరికా ప్రజలకు వ్యాక్సిన్ వచ్చే సమయం అయితే దగ్గరపడింది. అమెరికాలో వచ్చే జనవరి నుంచి కరోనా వైరస్ వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని అధ్యక్షుడు ట్రంప్ వ్యక్తిగత అధికారి, డాక్టర్ రాబర్ట్ కాడ్ లేక్ ప్రకటించారు. జనవరి లేదా ఫిబ్రవరి మొదటి వారానికి ఈ టీకా మందు మార్కెట్ లో ఉండే అవకాశాలు ఉన్నాయని క్టర్ రాబర్ట్ కాడ్ లేక్ తెలిపారు.
సురక్షితమైన సమర్థవంతమైన టీకా మందు డిసెంబర్ లోగా ఆమోదం పొందవచ్చునని ఆశిస్తున్నట్టు డాక్టర్ లేక్ చెప్పారు. అయితే పంపిణీకి కొంత సమయం పడుతుందన్నారు.
Also Read: వైరల్ వీడియో: రేపిస్ట్ కు టికెట్ వద్దన్నందుకు మహిళా కార్యకర్తపై దాడి
ఎమర్జెన్సీ ఆథరైజేషన్ కి కొంత సమయం పడుతుందని భావిస్తున్నారు. అయితే ట్రంప్ మాత్రం ఈ నెల నుంచి వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని ప్రకటించడం విశేషం.