Assam : భారత దేశంలోని ఈశాన్య రాష్ట్రాల్లో కాస్తో.. కూస్తో అభివృద్ధి చెందిన రాష్ట్రం అసోం. ఒకప్పుడు అంతర్గత తీవ్రవాదం, అస్సాం రైఫల్స్, బోడో తీవ్రవాదులతో ఇబ్బంది పడిన రాష్ట్ర క్రమంగా వారితో చర్చలు, కాల్పు విరమణలు జరుపుతూ.. వాటిని తమ నియంత్రణలోకి తెచ్చుకున్నాయి ప్రభుత్వాలు. ప్రస్తుతం ఆ రాష్ట్రంలో అంతర్గత సమస్యలు పెద్దగా లేవు. అయితే వరదలు ఆ రాష్ట్రాన్ని ఏటా ముంచెత్తుతున్నాయి. ప్రత్యేక భౌగోళిక పరిస్థితులు, వాతావరణ పరిస్థితుల కారణంగా అక్కడ ఎక్కువగా కాఫీ పండిస్తారు. ఇక వర్షాలు ఎక్కువే. కొండ ప్రాంతాలు, నదులు ఎక్కువగా ఉండడంతో వరదల ప్రభావం ఎక్కువ. ఇక అసోంలో దర్శనీయ ప్రదేశాలు కూడా ఉన్నాయి. అహోం రాజులు 700 ఏళ్ల క్రితం అసోంను పాలించారు. వారి కాలంలో నిర్మించిన మట్టి సమాధులు ఇప్పటికీ చెక్కు చెందరకుండా ఉన్నాయి. వాటిని ఏటా వేల మంది పర్యాటకులు సందర్శిస్తారు. ఇటీవలే వీటిని వారసత్వ సంపదగా గుర్తించాలని కేంద్రం యునెస్కోకు ప్రతిపాదించింది. 2023–24 సంఒవత్సరానికి గాను ఈ సమాధులు(మెయిడమ్స్)ను ప్రపంచ వారసత్వ జాబితాలో చేర్చింది. మొయిడమ్స్ అనేవి పిరమిడ్ లాంటి ఆకృతిలో భూగర్భ నిల్వల కోసం నిర్మించిన మట్టి సమాధులు. అసోంను 600 ఏళ్లు పాలించిన తాయ్ – అహోం రాజవంశానికి చెందిన రాజులను ఖననం చేసేందుకు వీటిని నిర్మించారు. రెండంతస్తులు కలిగిన ఈ నిర్మాణంలోకి ప్రవేశించే మార్గం వంపు తిరిగి ఉంటుంది. ఖననం చేయబడిన వ్యక్తి వాడిన వస్తువులు, నగలు, ఆయుధాలను, దుస్తులను ఈ సమాధుల్లో ఉంచేవారు.
మొయిడమ్స్ అంటే ఏమిటి?
అసోంలోని మొయిదమ్‌లు ఎక్కువగా చరైడియో జిల్లాలో కనిపిస్తారు. ఇవి పూర్వపు రాజ కుటుంబాలకు శ్మశానవాటికలు. యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ ప్రపంచ వారసత్వ జాబితాలో చేర్చడంతో, వారు ఇప్పుడు రాష్ట్ర సంస్కృతి, వారసత్వ సంరక్షణ, ప్రచారం కోసం మెరుగైన నిధులను పొందుతున్నారు. మొయిదమ్‌లకు ప్రభుత్వం, అంతర్జాతీయ మద్దతు శ్మశాన వాటికల సంరక్షణ, రక్షణ కోసం సాంకేతిక సహకారం కూడా లభిస్తుంది.
90 మంది సమాధులు..
19వ శతాబ్దం వరకు దాదాపు 600 సంవత్సరాలపాటు ప్రస్తుత ఈశాన్య భారతదేశంలోని ప్రాంతాలను అహోం రాజవంశానికి చెందినవారు పాలించారు. దాదాపు 90 మంది రాజులు, రాణులు, ప్రభువులను మరణానంతరం మొయిదమ్స్‌లో ఖననం చేశారు. మొయిడమ్‌లు తప్పనిసరిగా మట్టి, ఇటుకలు లేదా రాళ్లతో చేసిన బోలుగా ఉండే ఖజానాలపై నిర్మించిన మట్టిదిబ్బలు. అష్టభుజి కుహరం మధ్యలో ఒక మందిరం ఉంచబడుతుంది. మొయిడమ్‌ల ప్రాథమిక ప్రదేశం 95.02 హెక్టార్లు. సైట్ చుట్టూ 754.511 హెక్టార్ల బఫర్ జోన్ ఉంది. మొయిడమ్‌లను పురాతన చైనా యొక్క రాజ సమాధులు, ఈజిప్షియన్ల ఫారోల పిరమిడ్‌లతో పోల్చారు.
ఈశాన్య రాష్ఠ్రం నుంచి తొలిసారి..
అహోం రాజవంశం సమాధులకు యునెస్కో గుర్తింపు దక్కడంతో ఈశాన్యం రాష్ట్రం నుంచి యునెస్కో గుర్తింపు దక్కిన తొలి రాష్ట్రంగా అసోం నిలిచింది. కాజిరంగా, మానస్ నేషనల్ పార్క్‌ల తర్వాత అసోం 3వ ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తింపు దక్కిందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ తెలిపారు. ఈమేరకు ఎక్స్‌లో పోస్టు చేశారు.