https://oktelugu.com/

Tollywood Stars: రిస్కీ లైఫ్స్… సర్జరీలతో సావాసం చేస్తున్న స్టార్స్

Tollywood Stars: ఒక హీరో స్టార్ డమ్, లగ్జరీ లైఫ్, కోట్ల సంపాదన వెనుక చాలా రిస్క్ దాగి ఉంటుంది. తీరిక లేని షెడ్యూల్స్ తో సరైన నిద్ర, విశ్రాంతి ఉండదు. కుటుంబాన్ని వదిలేసి ఎప్పుడూ అవుట్ డోర్స్ లో గడపాలి. పాత్రకు తగ్గట్టుగా శరీర బరువులో మార్పులు చేసుకోవాలి. దీని కోసం విపరీతమైన వ్యాయామం చేయాలి. ఇష్టమైన ఫుడ్ ని వదిలేయాలి. ప్రమాదకరమైన పోరాట సన్నివేశాలలో పాల్గొనాలి. స్టార్స్ కలర్ ఫుల్ లైఫ్ వెనుక ఇంతటి […]

Written By:
  • Shiva
  • , Updated On : December 3, 2021 / 02:55 PM IST
    Follow us on

    Tollywood Stars: ఒక హీరో స్టార్ డమ్, లగ్జరీ లైఫ్, కోట్ల సంపాదన వెనుక చాలా రిస్క్ దాగి ఉంటుంది. తీరిక లేని షెడ్యూల్స్ తో సరైన నిద్ర, విశ్రాంతి ఉండదు. కుటుంబాన్ని వదిలేసి ఎప్పుడూ అవుట్ డోర్స్ లో గడపాలి. పాత్రకు తగ్గట్టుగా శరీర బరువులో మార్పులు చేసుకోవాలి. దీని కోసం విపరీతమైన వ్యాయామం చేయాలి. ఇష్టమైన ఫుడ్ ని వదిలేయాలి.

    Mahesh Balayya NTR

    ప్రమాదకరమైన పోరాట సన్నివేశాలలో పాల్గొనాలి. స్టార్స్ కలర్ ఫుల్ లైఫ్ వెనుక ఇంతటి కష్టం ఉంటుంది. అసమయ భోజనాలు,విదేశీ ప్రయాణాలు వారి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతాయి. దాని కారణంగా తరచుగా ఆసుపత్రి పాలయ్యే పరిస్థితి ఏర్పడుతుంది. తాజాగా టాలీవుడ్ కి చెందిన ముగ్గురు స్టార్స్ సర్జరీలు చేయించుకున్నారు.

    యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇటీవల గాయంతో కనిపించి షాకిచ్చారు. ఆరాతీస్తే ఆయన వేళ్ళకు సర్జరీ జరిగినట్లు తెలిసింది. ఇంట్లో వ్యాయామం చేస్తున్న ఎన్టీఆర్ చిన్న ప్రమాదానికి గురయ్యారట. దీంతో ఆయన కుడి చేతి వేళ్ళకు గాయమైంది. డాక్టర్స్ చేతికి సర్జరీ చేసి, రెస్ట్ తీసుకోవాలని సూచించారు. అలాగే నటసింహం బాలయ్య ఎడమ చేతికి సర్జరీ జరిగింది. ఆయన కూడా ప్రమాదానికి గురయ్యారు. దీంతో సర్జరీ నిర్వహించిన వైద్యులు బెడ్ రెస్ట్ సూచించారు.

    Also Read: Naga Chaitanya: ఈసారైనా నాన్న మాట విను చైతూ..!

    ఈ కారణంగా ఆయన హోస్ట్ గా ఆహాలో ప్రసారం అవుతున్న అన్ స్టాపబుల్ టాక్ షోకి షార్ట్ బ్రేక్ పడింది. ఓ వారం ఆయన షూట్ లో పాల్గొనలేక పోయారు. అఖండ ప్రీ రిలీజ్ ఫంక్షన్ కి బాలయ్య చేతికి కట్టుతోనే హాజరయ్యారు. సర్జరీ చేయించుకొని కూడా బాలయ్య అఖండ ప్రమోషన్స్ లో విరివిగా పాల్గొన్నాడు. మరో స్టార్ హీరో మహేష్ కూడా సర్జరీకి సిద్ధం అవుతున్నట్లు సమాచారం అందుతుంది.

    మహేష్ కొన్నాళ్లుగా మోకాలి నొప్పితో బాధపడుతున్నారట. నడవడానికి ఇబ్బంది పడుతున్న తరుణంలో డాక్టర్స్ సర్జరీ అవసరమని సూచించారట. దీనితో మహేష్ సర్జరీ చేయించుకోనున్నారట. ఈ సర్జరీ తర్వాత మహేష్ రెండు నెలలు బెడ్ రెస్ట్ తీసుకోవాలని వైద్యులు సలహా ఇచ్చారట. సమ్మర్ బరిలో దిగనున్న సర్కారు వారి పాట షూట్ కి చిన్న బ్రేక్ ప్రకటించి సర్జరీకి సిద్దమవుతున్నారు మహేష్.

    Also Read: Saipallai: సాయిపల్లవి చెల్లెలు హీరోయిన్​గా పరిచయమవుతున్న సినిమా రిలీజ్​ ఈరోజే

    Tags