అశోక్ గజపతి రాజు కౌంటర్ అటాక్ షురూ..:

  కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతి రాజు తాజాగా దూకుడు పెంచారు. ఇన్నాళ్లు ఆయన రాజకీయంగా ఎలాలంటి ప్రకటనలు చేయకపోయినా.. హైకోర్టు తీర్పు వెలువడిన తరువాత దూకుడు పెంచారు. దీంతో మొన్నటి వరకు మన్సాస్ ట్రస్టుకు చైర్మన్ గా ఉన్న సంచయితపై ఆసక్తికర వ్యాక్యలు చేశారు. అటు ప్రభుత్వం సైతం హైకోర్టు తీర్పుపై అప్పీల్ చేస్తామని ప్రకటించినా.. అందుకు తగిన చర్యలు తీసుకుంటున్నట్లు కనిపించడం లేదు. దీంతో గజపతి రాజు మన్సాస్ ట్రస్టు విషయంలో సంచయిత […]

Written By: NARESH, Updated On : June 21, 2021 2:00 pm
Follow us on

 

కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతి రాజు తాజాగా దూకుడు పెంచారు. ఇన్నాళ్లు ఆయన రాజకీయంగా ఎలాలంటి ప్రకటనలు చేయకపోయినా.. హైకోర్టు తీర్పు వెలువడిన తరువాత దూకుడు పెంచారు. దీంతో మొన్నటి వరకు మన్సాస్ ట్రస్టుకు చైర్మన్ గా ఉన్న సంచయితపై ఆసక్తికర వ్యాక్యలు చేశారు. అటు ప్రభుత్వం సైతం హైకోర్టు తీర్పుపై అప్పీల్ చేస్తామని ప్రకటించినా.. అందుకు తగిన చర్యలు తీసుకుంటున్నట్లు కనిపించడం లేదు. దీంతో గజపతి రాజు మన్సాస్ ట్రస్టు విషయంలో సంచయిత తీసుకున్న నిర్ణయాలపై విమర్శలు చేయడం ప్రారంభించారు.

విజయనగరంలో జిల్లాలోని మాన్సాస్ ట్రస్టుకు ఎంతో కాలంగా అధినేతగా వస్తున్న కేంద్ర మాజీ మంత్రి అశోక గజపతి రాజు గతేడాది ట్రస్టు చైర్మన్ పదవి కోల్పోయారు. ఆయన స్థానంలో అశోక్ అన్న కూమార్తె సంచయిత చైర్మన్ గా చేసింది వైసీపీ ప్రభుత్వం. అయితే అశోక్ గజపతి రాజు హైకోర్టును ఆశ్రయించడంతో ఆయనకు అనుకూలంగా తీర్పునిచ్చింది. దీంతో మరోసారి ఆయన చైర్మన్ అయ్యారు. అయితే ప్రభుత్వం మాత్రం హైకోర్టు తీర్పుపై అప్పీల్ చేస్తానని అంటోంది.

అంతేకాకుండా అశోక్ గజపతిరాజును జైలుకు పంపుతామంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అశోక్ పై విమర్శలు చేయని కొందరు ప్రభుత్వ పెద్దలు ఇప్పుడు ఆయనను బెదిరింపులకు పాల్పడడం చర్చనీయాంశంగా మారిందంటున్నారు. ఈ తరుణంలో అశోక్ గజపతి రాజు ప్రభుత్వంపై విమర్శలు చేయడం ప్రారంభించారు. మొన్నటి వరకు చైర్మన్ గా ఉన్న ఆయన అన్న కూతురు సంచయిత చేసిన కార్యక్రమాలపై విమర్శలు చేయడం ప్రారంభించారు.

ఇన్నాళ్లు ఎంపీ విజయసాయిరెడ్డి , దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ చేస్తున్న విమర్శలకు అశోక్ మౌనంగా ఉండిపోయారు. కాని మాన్సాస్ ట్రస్టు విషయంలో సంచయిత తీసుకున్న నిర్ణయంపై ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ మండిపడుతున్నారు. తాజాగా ఆయన సోషల్ మీడియాలో ఇసుక తవ్వకాల అనుమతులపై ప్రభుత్వాన్ని ఇరుకున్నపెట్టే ప్రయత్నం చేస్తున్నారు.