
తమిళనాడు రాజధాని చెన్నైలో దారుణం జరిగింది. కన్న కొడుకును తల్లి కొట్టి చంపింది. కొడుక్కి దెయ్యం పట్టిందంటూ కన్న తల్లి కొట్టి చంపిన ఘటన తిరువన్నామలై జిల్లా అరణిలో జరిగింది. ముగ్గురు మహిళలు ఏడేళ్ల బాటుడిని చిత్రహింసలు పెడుతున్నట్లు స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే పోలీసులు ఘటనా స్థలంకు చేరుకునే సరికి బాలుడిని అప్పటికే కొట్టి చంపేశారు. దీంతో వెంటనే బాలుడి తల్లితో సహా ముగ్గురు మహిళలను పోలీసులు అరెస్ట్ చేశారు. కొడుక్కి దెయ్యం పట్టిందని, పూజలు చేసే క్రమంలో బాలుడు చనిపోయాడని పోలీసులకు తెలిపారు. కన్నతల్లి మానసిక స్థితి సరిగా లేదని డబ్బుల కోసమే ఇదంతా జరిందని బంధువులు చెబుతున్నారు.