Uttar Pradesh : ఏమ్మా సంతాన లక్ష్మి.. ఇప్పటికే 24 మందిని కన్నావ్ .. ఇంకా ఎంతమందిని కంటావు?

ఉత్తరప్రదేశ్ కు చెందిన కుష్భూ పాఠక్ కు 24 మంది సంతానం ఆమె వివాహం జరిగి 23 సంవత్సరాలు గడుస్తుంది. అయితే 8 సార్లు కవల పిల్లలకు జన్మనిచ్చిన కుష్భూ 8 సార్లు ఒక్కొక్కరికి జన్మనిచ్చింది. ఆమె గురించి తెలుసుకుందాం..

Written By: NARESH, Updated On : August 18, 2024 2:44 pm

Kushboo Pathak

Follow us on

Uttar Pradesh : పిల్లలను కనడం నేటి జనరేషన్ లో చాలా ప్రయాసతో కూడుకున్నది. మొదటిది కనేవారు ఇంట్రస్ట్ గా లేకపోవడం.. రెండోది ఉరుకులు, పరుగుల జీవితం. ఇలా చాలా కారణాలతో పిల్లలు పుట్టే రేషియో క్రమ క్రమంగా తగ్గుతూ వస్తోంది. అయితే, ఇది నాణేనికి ఒక వైపు అనుకుంటే రెండో వైపు మరోలా ఉంది. కొందరు సంవత్సరానికి ఒకరిని చొప్పున కంటూనే ఉంటారు. కారణం.. దంపతులు ఆరోగ్యంగా ఉండడం, రోజంతా కష్టపడి పని చేయడం, కాలుష్యం లేని ప్రదేశాలలో జీవించడం, ఇలా చాలా అంశాలు కలిసి వచ్చి పిల్లల జనాభా పెరుగుతుంది. ఇక్కడ ఒక మహిళ 24 మందిని కన్నది. వివాహం జరిగి 23 సంవత్సరాలే అయినా.. 24 మందిని కన్నది. అయితే అందులో 8 సార్లు కవల పిల్లలు పుట్టారు. బాల్య వివాహం ముమ్మాటికి నేరమే. అయినా ఈ సంతాన లక్ష్మి మాత్రం బాల్యంలోనే వివాహం చేసుకొని ఇంత మందికి జన్మనిచ్చింది. 16వ ఏటనే తన మొదటి సంతనంను భూమిపైకి తీసుకువచ్చిందట. తన భర్త డ్రైవర్ గా పని చేస్తున్నాడని, ప్రస్తుతం కుటుంబ పోషణకు ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పుకస్తోంది. ప్రభుత్వం, తాము కూడా కాయ, కష్టంతో కుటుంబం ఇబ్బందులు లేకుండా గడుస్తుందని వివరిస్తోంది. ఇంత మందిని కన్నందుకు ఎలా ఫీలవుతున్నావని ఒక ఛానల్ రెప్రజెంటీవ్ ప్రశ్నించగా గర్వంగా ఫీలవుతున్నామని చెప్తోంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది. పూర్తి వివరాలు తెలుసుకుందాం..

ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన కుష్బూ పాఠక్ తన భర్తలో కలిసి జీవిస్తోంది. అయితే ఆమె మైనర్ గా ఉన్న సమయంలోనే తల్లిదండ్రులు వివాహం చేశారు. డ్రైవర్ గా పని చేసే తన భర్తతో ఆమె ఆనందంగా జీవిస్తోంది. ఈ సందర్భంలో తన మొదటి సంతానం తనకు 16 సంవత్సరాలు ఉన్న సమయంలో కలిగింది. ఆ తర్వాత అప్పుడప్పుడు 8 సార్లు కవల పిల్లలు పుట్టారు. అంటే 8*2=16 మంది 8 కాన్పుల్లో కలిగారు. ఇక మిగిలిన 8 మంది ఒక్కో కాన్పులో కలిగారు.

మొత్తం 24 మంది పిల్లలతో కుష్బూ పాఠక్ వైరల్ గా మారింది. తక్కువ వయస్సు, అందం ఉన్న ఈ కుష్బూ పాఠక్ ను ప్రతీ ఒక్కరూ అభినందిస్తున్నారు. జనాభాను ఎందుకు పెంచుతున్నావని కొందరు వ్యతిరేకిస్తుండగా.. ఇలానే కనాలి అంటూ మరికొందరు కితాబిస్తున్నారు. ఏది ఏమైనా 24 మంది పిల్లలంటే అంత తేలిక కాదు కదా..

ఇక వారికి ఒక్కొక్కరికి ఒక్కో పేరు ఉన్నా కూడా.. ఇంట్లో మాత్రం నెంబర్ పెట్టి మాత్రమే పిలుస్తారట. తన మొదటి సంతానానికి 23 సంవత్సవాలు ఉంటుందని చెప్తోంది పాఠక్. అంటే ఆమెకు 39 సంవత్సరాలు ఉంటాయని అనుకోవచ్చు. మళ్లీ దేవుడు వరమిస్తే కంటాను అంటుందే తప్ప చాలు అనడం లేదు. అంటే గతంలో మన పెద్ద వారు తిట్లు దీవెనలు ఈమెకు సరిగ్గా పట్టాయేమో కదా.

మన చిన్నతనంలో పెద్ద ‘నీ అమ్మ కడుపు మాడ’ అని తిట్టేవారు. వీళ్ల పిల్లలను కూడా ఇలానే తిట్టినట్టు ఉన్నారు. అందుకే ఆమె కడుపు ఎప్పుడూ పండుతూనే ఉంది. నిజానికి నీ అమ్మ కడుపు మాడ అనేది తిట్టు కాదట.. ఒక దీవెన. ఎలాగంటే ఒక ఆహార పదార్థాన్ని వండుతున్న సందర్భంలో పూర్తిగా ఉడికిన తర్వాత మాడుతుంది. కాబట్టి ఎగ్ రిలీజ్ ఆగేంత వరకు, పూర్తి జీవితంలో సంతానం పొందుతుంది అని అర్థం. ఈ సంతాన లక్ష్మిని అందరూ దీవిస్తున్నారు.