BRS: ఈ తలతిక్క లాజిక్‌లే బీఆర్ఎస్ ను ప్రతిపక్షంలో కూర్చుండబెట్టినయ్‌!

తప్పులెన్నువారు తమ తప్పులెరుగరు అన్నట్లు ఉంది ప్రస్తుతం బీఆర్‌ఎస్‌ నేతల తీరు. ఎన్నికల్లో ఓటమిపై రాజకీయ పార్టీలు సమీక్ష చేసుకోవాలి. వాటిని సరిదిద్దుకునే ప్రయత్నం చేయాలి.

Written By: Raj Shekar, Updated On : January 2, 2024 6:19 pm

AP BRS

Follow us on

BRS: ఎనుకటికి ఓ రాణి రాజును ఇలా అడిగిందట..‘రాజా.. నేను పుట్టాను కాబట్టే నన్ను పెళ్లి చేసుకున్నారు.. నేను పుట్టకపోయి ఉంటే ఎవర్ని పెళ్లి చేసుకునేవారు’ అని.. దీనికి రాజు ఇచ్చిన మాధానంతో రాణి దిమ్మ తిరిగిపోయింది. ఇప్పుడు తెలంగాణలో ప్రజలు ఇచ్చిన తిమ్మతిరిగే తీర్పుతో ప్రతిపక్షానికే పరిమితమైన బీఆర్‌ఎస్‌ నేతలు ఇంకా తలతిక్క మాటలు మాట్లాడడం మానుకోవడం లేదు. ముఖ్యమంగా కేటీఆర్, హరీశ్‌రావు అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ వైఫల్యాలను ఒప్పుకోకుండా.. ఆ నెపాన్ని ఎదుటివారిపై వేసే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. గతంలో కేసీఆర్‌.. ఇంటకో ఉద్యోగం ఇస్తామన్నాడు.. దానిని అనలేదని వాదించారు. పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవమైతే రూ.5 లక్షల ఇస్తామన్నారు. తర్వాత అనలేదన్నారు. తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్సే అన్నారు.. తర్వాత మేం కొట్లాడి లాక్కున్నామని తెలిపారు. నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు.. తర్వాత తప్పించుకున్నారు. దళితుడిని సీఎం చేస్తా అన్నారు తప్పించుకున్నారు. దళితులకు మూడెకరాల భూమి అన్నారు. తప్పించుకున్నారు. ఇలా అనేక హామీలను తప్పించుని, చేయని పనులు చేసినట్లు చెప్పుకోవడంలో కేసీఆర్‌ అండ్‌ పార్టీ దిట్ట. వాటికితోడు అహంకారపూరిత మాటలు ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ను ఓడించాయి.

తమతప్పులెరుగరు..
తప్పులెన్నువారు తమ తప్పులెరుగరు అన్నట్లు ఉంది ప్రస్తుతం బీఆర్‌ఎస్‌ నేతల తీరు. ఎన్నికల్లో ఓటమిపై రాజకీయ పార్టీలు సమీక్ష చేసుకోవాలి. వాటిని సరిదిద్దుకునే ప్రయత్నం చేయాలి. కానీ, బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ఎన్నికల్లో ఓటమి తర్వాత ఒక్కసారి కూడా మీడియా ముందుకు రాలేదు. కాంగ్రెస్‌ గెలుపును, తమ ఓటమిని అంగీకరించలేదు. తప్పులు సరిచేసుకుంటామని ప్రకటించలేదు. మీడియతో మాట్లాడిన కేటీఆర్‌ ఓటమి అంగీకరిస్తున్నామని తెలిపారు. ఓటమికి కారణాలు తెలుసుకుంటామన్నారు. కానీ, ఇప్పుడు ఓటమికి తమ తప్పు ఏమీ లేదన్నట్లు వ్యవహరిస్తున్నారు. తాము అన్నీ చేశామని, కాంగ్రెస్‌ తప్పుడు ప్రచారం కారణంగానే ఓడిపోయామంటున్నారు.

32 యూట్యూబ్‌ చానెళ్లు పెట్టుంటే..
తాము తెలంగాణలో 32 జిల్లాలో‍్ల మెడికల్‌ కాలేజీలో‍్ల 32 మెడికల్‌ కాలేజీలు ఏర్పాటు చేశామని, దానికి బదులు 32 యూట్యూబ్‌ చానెళ్లు పెట్టి ఉంటే ఫలితాలు వేరేలా ఉండేదని కేటీఆర్‌ రెండు రోజుల క్రితం వ్యాఖ్యానించారు. ఈ మాటలు కూడా కేటీఆర్‌ అహంకారానికి నిదర్శనం అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అసలు బీఆర్‌ఎస్ మీడియాను ఉపయోగించుకున్నంతగా, సోషల్‌ మీడియాను వాడుకున్నంతగా ఎవరూ వాడుకోలేదు. న్యూస్‌ ఛానెళ్లన్నీ బీఆర్‌ఎస్‌ కంట్రోల్‌లోనే ఉన్నాయి. పలు యూట్యూ్‌బ్‌ చానెళ్లను కూడా కొనుగోలు చేశారు. ప్యాకేజీలు ఇచ్చారు. పత్రికలకు ప్రకటలు ఇచ్చారు. ఇంత చేసినా ఎన్నికల్లో ఓడిపోయారు. అయినా ఓటమికి తమ స్వయంకృతాపరాధమే కారణం అని అంగీకరించడం లేదు. కాంగ్రెస్‌ తప్పుడు ప్రచారమే కారణం అంటున్నారు. తప్పుడు ప్రచారమే కారణం అయి ఉంటే 2018లో కూడా కాంగ్రెస్‌ ప్రచారం చేసింది. దుబ్బాక, హుజూరాబాద్‌లో కూడా బీజేపీ ప్రచారం చేసింది. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లోనూ చాలా స్థానాల్లో బీఆర్‌ఎస్‌ ఓడిపోయింది. మరి అప్పుడు ఏ యూట్యూబ్‌ చానెల్‌ పనిచేశాయి.

యూట్యూబ్‌ చూసేవారు హైదరాబాద్‌లోనే ఎక్కువ..
వాస్తవంగా సోషల్‌ మీడియాపై పట్టున్నవారు, చూసేవారు హైదరాబాద్‌లోనే ఎక్కువ ఉంటారు. అయినా అసెంబ్లీ ఎన్నికల్లో జీహెచ్‌ఎంసీ పరిధిలో చాలా మంది బీఆర్‌ఎస్‌ అభ్యర్థులే గెలిచారు. మరి ఇక్కడ ఏ యూట్యూబ్‌ చానెల్‌ పనిచేసిందో కేటీఆర్‌ చెప్పాలి. యూట్యూబ్‌ చానెల్‌ ఉంటే.. ఊళ్లో అయినా పట్టణంలో అయినా.. నగరంలో అయినా.. చివరకు అమెరికాలో అయినా చూడొచ్చు. ఎన్నికల ఫలితాలపై వాటి ప్రభావం చాలా తక్కువ. కానీ, ఈ విషయం గుర్తించకుండా, ఐటీ మినిస్టర్‌గా చేసిన కేటీఆర్‌ యూట్యూబ్‌ చానెళ్లు పెట్టి ఉంటే గెలిచేవారమని పేర్కొనడంపై విమర్శలు వస్తున్నాయి. ఇది లీడర్‌ లక్షణం కాదని విశ్లేషకులు పేర్కొంటున్నారు.